ETV Bharat / entertainment

Adipurush Jai shri Ram Song : 'జై శ్రీ రామ్'​ ఫుల్ సాంగ్​​ వచ్చేసింది.. వింటే.. - Adipurush movie release

పాన్​ ఇండియా స్టార్​​ ప్రభాస్​ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న ఆదిపురుష్​ సినిమా నుంచి విడుదలైన జై శ్రీ రామ్​ సాంగ్ గ్లింప్స్​ శ్రోతలను బాగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సాంగ్​​ ఫుల్​ వెర్షన్​ రిలీజైంది. గ్లింప్స్​తోనే గూస్​బంప్స్​ తెప్పించిన ఈ సాంగ్​ ఇప్పుడు పూర్తి వెర్షన్​లోనూ అభిమానులను మరింతగా ఆకట్టుకుంటోంది.

Adipurush Jai shri ram full song
Adipurush Jai shri ram full song
author img

By

Published : May 20, 2023, 3:21 PM IST

Updated : May 20, 2023, 3:45 PM IST

Adipurush Jai shri Ram Song : టాలీవుడ్​ స్టార్ హీరో ప్రభాస్ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న మైథలాజికల్​ మూవీ 'ఆదిపురుష్​'. ఇప్పటికే రిలీజైన టీజర్​, ట్రైలర్​తో సినిమాపై అభిమానులకు ఓ రేంజ్​లో అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాకు ఆయువులా జై శ్రీ రామ్​ సాంగ్​ విశేషాదరణను సంతరించుకుంది. మహిమాన్విత మంత్రం నీ నామం అంటూ సాగే ఈ సాంగ్​ చిన్న గ్లింప్స్​ ఫ్యాన్స్​కు గూస్​బంప్స్​ తెప్పించగా.. తాజాగా ఈ సాంగ్​ ఫుల్ వెర్షన్ బయటకి వచ్చింది. అయితే ఈ సాంగ్ మొత్తం ఓ రేంజ్​లో ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. లిరిక్స్​, మ్యూజిక్​, విజువల్స్​ ఇలా అన్నీ ఈ సాంగ్​లో హైలైట్​గా ఉన్నాయని కామెంట్లు పెడుతున్నారు. స్టార్​ మ్యూజిక్​ డైరెక్టర్స్​ అజయ్-అతుల్​ ఈ సాంగ్​కు స్వరాలు సమకూర్చగా.. తెలుగులో రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. 'ఎవరు ఎదురు రాగలరు మీ దారికి.. ఎవరికుందీ ఆ అధికారం.. పర్వత పాదాలు వణికి కదులుతాయి మీ హూంకారానికి.. ' అంటూ ప్రభాస్‌ వాయిస్‌ఓవర్​తో మొదలైన ఈ సాంగ్‌ వింటుంటే ఒళ్లు గగురుపొడిచేలా ఉందని.. ఇక నుంచి ప్రతి శ్రీరామనవమికి ప్లే లిస్ట్‌లో ఈ పాట ఖాయమంటూ ప్రభాస్‌ అభిమానులు కామెంట్స్‌ పెడుతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Adipurush movie : ఇక సినిమా విషయానికి వస్తే.. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాఘవునిగా ప్రభాస్​ నటించగా.. జానకిగా కృతిసనన్​ నటిస్తున్నారు. లక్ష్మణుడిగా ​ సన్నీ సింగ్​, హనుమంతునిగా దేవదత్త్​ నాగే, లంకేశునిగా సైఫ్​ అలీ ఖాన్​ నటిస్తున్నారు. ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రెట్రో ఫైల్స్, టి సిరీస్ ఫిలిమ్స్, సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్‌ 16న విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే షూటింగ్​ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్​ ప్రొడక్షన్​ పనుల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ప్రమోషన్లను ప్రారంభించిన మూవీ టీమ్​.. కొత్త పోస్టర్లు, లిరికల్‌ సాంగ్స్‌ను ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది.

Adipurush Special event : మరోవైపు ఈ సినిమా జూన్​లో రిలీజవ్వనున్న నేపథ్యంలో ప్రమోషన్స్​ను గ్రాండ్​గానే ప్లాన్​ చేసింది మూవీ యూనిట్​. ఇందులో భాగంగా ముంబయిలో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్​లో 'జై శ్రీరామ్' సాంగ్​ను మ్యూజిక్ డైరెక్టర్స్ అజయ్ అతుల్ లైవ్ ఆర్కెస్ట్రా పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారట. దాదాపుగా 30 మంది కోరస్ సింగెర్స్ తో ఈ సాంగ్ లైవ్​లో అదిరిపోనుందని టాక్​. అయితే ఈ ఈవెంట్ గురించి అఫీషియల్ అప్డేట్​ ఇంకా రావాల్సి ఉంది.

Last Updated : May 20, 2023, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.