Mohan Babu Rs 100 Crore Movie : టాలీవుడ్ స్టార్ హీరో, డైలాగ్ కింగ్ మోహన్ బాబు ప్రస్తుతం అప్పడప్పుడు సినిమాల్లో మెరుస్తున్నారు. గతంలో వచ్చిన సన్ ఆఫ్ ఇండియా సినిమాలో చివరి సారిగా కనిపించిన ఆయన.. ఆ తర్వాత ఏ సినిమాలోనూ కనిపించలేదు. ఈ క్రమంలో ఆయన తాజాగా ఓ సంచలన విషయాన్ని వెల్లడించారు. వంద కోట్లతో బడ్జెట్‌తో ఓ సినిమాను తీస్తున్నట్టు ప్రకటించారు. ఆ వివరాలు త్వరలో తన తనయుడు మంచు విష్ణు వెల్లడిస్తారని తెలిపారు. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. ఈ మేరకు ప్రకటించారు. మరిన్ని విషయాలు త్వరలో మంచు విష్ణు తెలియజేస్తారని చెప్పారు.
Manchu Family Production House : అయితే మంచు ఫ్యామిలీ నిర్మాణ రంగంలోనూ ఉంది. 1982లో మోహన్ బాబు స్థాపించిన శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌తో పాటు, మంచు విష్ణుకు సంబంధించిన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, మంచు లక్ష్మీకి సంబంధించిన మంచు ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఇప్పటికే ఎన్నో సినిమాలను నిర్మించింది ఈ ఫ్యామిలీ. అయితే ఇప్పుడు ఏ సంస్థ ద్వారా ఈ సినిమా నిర్మితమౌతుందన్న విషయం అభిమానుల్లో ఆసక్తి రేగుతోంది. అంతే కాకుండా రూ.100 కోట్లతో సినిమా తీయడం కోసం.. నిర్మాణానికి కంటే దాని మార్కెటింగ్‌పై దృష్టి సారించాల్సి ఉంటుందని సినీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. అయితే వీరు ఏ సినిమాను తీయనున్నారన్న విషయంపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి.
Mohan Babu Movies : గతంలో మోహన్ బాబుతో 'రావణ బ్రహ్మ' అనే సినిమాను చేయాలనుకున్నారు. కానీ ఆ సినిమా ప్రారంభ దశలోనే ఆగింది. తర్వాత విష్ణు మంచు లీడ్ రోల్‌లో తనికెళ్ళ భరణితో 'భక్త కన్నప్ప' సినిమాను రూపొందించాలనుకున్నారు. అది కూడా ఆగిపోయింది. దీంతో ఈ రెండిట్లో ఏదైనా సినిమా చేయనున్నారా.. లేకుంటే ఇంకేదైనా సినిమా రానుందా అంటూ అభిమానులు రక రకాలుగా ఆలోచిస్తున్నారు.
Mohan Babu Movies : 'సన్నాఫ్ ఇండియా' తర్వాత మోహన్ బాబు.. ప్రస్తుతం తన కూతురు మంచు లక్ష్మీతో కలిసి 'అగ్ని నక్షత్రం' అనే సినిమా చేస్తున్నారు. మరోవైపు ఆయన కోసం ఓ రీమేక్ కథ సిద్ధమైందని టాక్. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25' అనే సినిమా ఇప్పుడు తెలుగులో పునర్నిర్మించేందుకు సిద్ధమయ్యారు నటుడు, నిర్మాత మంచు విష్ణు. ఈ విషయాన్ని తాజాగా ఆయనే స్వయంగా వెల్లడించారు. ఆయన తనయుడి పాత్ర కోసం ఓ ప్రముఖ నటుణ్ని ఎంపిక చేయనున్నాం. ప్రస్తుతం తెలుగు వాతావరణానికి తగ్గట్లుగా కథలో మార్పులు చేస్తున్నామని.. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని విష్ణు అన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">