ETV Bharat / entertainment

మహేశ్​ను ఫాలో అవుతున్న బిల్​గేట్స్​.. పీకే, సాయితేజ్ మూవీ షూటింగ్​ - Lakshmi Manchu Mohan Babu film

ప‌వ‌న్‌క‌ల్యాణ్, సాయిధ‌ర‌మ్‌తేజ్ కాంబినేషన్​లో రానున్న మల్టిస్టారర్​పై క్రేజీ అప్డేట్​ వచ్చేసింది. మహేశ్​ బాబు, బిల్​గేట్స్ వార్త ఒకటి తెగ వైరల్​ అవుతోంది. ​మంచు లక్ష్మి తన కొత్త ప్రాజెక్ట్‌ ప్రకటించారు.

Tollywood newswrap: Vinodhaya Sitham to go on floors soon; Bill Gates follows Mahesh Babu and more
మహేశ్​బాబును ఫాలో అవుతున్న బిల్​గేట్స్​.. ప‌వ‌న్‌క‌ల్యాణ్, సాయిధ‌ర‌మ్‌తేజ్ మూవీ షూటింగ్​
author img

By

Published : Jul 1, 2022, 8:53 PM IST

పవర్​ స్టార్​ ప‌వ‌న్‌క‌ల్యాణ్, సాయి ధ‌ర‌మ్‌తేజ్ హీరోలుగా నటించబోతున్న సినిమా షూటింగ్ ప్రారంభంపై క్లారిటీ వచ్చేసింది. జులై 12న సినిమా ప్రారంభోత్సవం ఉండనుంది. స‌ముద్ర‌ఖ‌ని, తంబిరామ‌య్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో త‌మిళంలో రూపొందిన 'వినోదయ సీత‌మ్' చిత్రం.. తెలుగులో ప‌వ‌న్‌ క‌ల్యాణ్ - సాయిధ‌ర‌మ్‌ తేజ్ కాంబినేషన్​లో రీమేక్​ కాబోతోంది. మామ అల్లుళ్ల క‌ల‌యిక‌లో రూపొంద‌నున్న తొలి 'మెగా' సినిమా ఇదే కావ‌డం వల్ల అభిమానుల్లో ఆస‌క్తి మొద‌లైంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు స‌ముద్ర‌ఖ‌ని దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం.

Tollywood newswrap: Vinodhaya Sitham to go on floors soon; Bill Gates follows Mahesh Babu and more
సాయిధరమ్​ తేజ్​- పవన్​ కల్యాణ్​

సూపర్ స్టార్ మహేశ్​ బాబు ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌‌కు అమెరికాకు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ మహేశ్​, నమ్రత దంపతులు ప్రపంచ కుబేరుడు బిల్​గేట్స్​ను కలిశారు. ఈ ఫొటోలను మహేశ్ ట్విట్టర్​లో పోస్ట్​ చేయగా.. వైరల్​ అయ్యింది. అయితే మహేశ్​ చేసిన ట్వీట్​కు బిల్​గేట్స్​ స్పందించారు. రీట్వీట్​ చేశారు. అయితే బిల్​గేట్స్​ అంతటితో ఆగకుండా.. తన ట్విట్టర్‌ హ్యాండిల్‌లో మహేశ్​ బాబును ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో మహేశ్​బాబు కూడా బిల్​గేట్స్​ ట్విట్టర్​ను​ ఫాలో అవుతున్న నేపథ్యంలో.. ఇది కూడా వైరల్​గా మారింది.

మహేశ్​బాబు, బిల్​గేట్స్​, నమ్రత

నటి, వ్యాఖ్యాతగా సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటున్న మంచు లక్ష్మి తన కొత్త ప్రాజెక్ట్‌ ప్రకటించారు. తన తండ్రి మోహన్‌బాబుతో కలిసి 'అగ్నినక్షత్రం' సినిమా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఆ ప్రాజెక్ట్‌ టైటిల్‌ అనౌన్స్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను నిర్మాతలతో కలిసి మంచు లక్ష్మి విడుదల చేశారు.

manchu lakshmi
తండ్రి మోహన్​బాబుతో మంచు లక్ష్మి

ఇదీ చదవండి: 'బాధలో ఉన్నా.. అసత్య ప్రచారాలు చేయకండి'.. నటి మీనా భావోద్వేగం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.