Tiger vs Pathaan Movie : బాలీవుడ్‌లో స్టార్ హీరోలు సల్మాన్, షారుక్ తమ తమ ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నారు. 'జవాన్' సినిమాతో షారుక్ ప్రేక్షకులను పలకరించగా.. 'కిసీ కా భాయ్ కిసీకీ జాన్' అంటూ రీసెంట్గా సల్మాన్ థియేటర్లలో సందడి చేశారు. ఇక వీళ్లిద్దరి సినిమాలు బాక్సాఫీస్ ముందుకొస్తున్నాయంటే ఇక బీటౌన్‌లోనే కాదు యావత్ సినీ ఇండస్ట్రీలో పండగ వాతావరణం నెలకొంటుంది. అలాంటిది ఈ ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటిస్తే ఇంకెలా ఉంటుంది. వింటుంటేనే ఆసక్తికరంగా ఉంది కదూ. ప్రస్తుతం ఈ విషయంపైనే బాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయట.
Tiger vs Pathaan Movie Cast : షారుక్, సల్మాన్‌కు ఈ కథను వినిపించగా.. దానికి ఈ ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే దీనికి ఓ టైటిల్‌ను కూడా రిజిస్టర్ చేయించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ మల్టీ స్టారర్‌కు 'వార్' డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించనున్నారట. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాకు 'టైగర్ వర్సెస్ పఠాన్' అనే పేరును ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.
Shahrukh Salman Movies : ఇక షారుక్ సల్మాన్ కలిసి మొదటి సారి 1995లో 'కరణ్ అర్జున్' అనే చిత్రంలో నటించారు. హీరో హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఆ తర్వాత 1998లో షారుక్ నటించిన 'కుచ్ కుచ్ హోతా హై' సినిమాలో సల్మాన్ అతిథి పాత్రలో కనిపించారు. రీసెంట్గా షారుక్ 'పఠాన్' సినిమా క్లైమాక్స్‌లో సల్మాన్ కనిపించారు. మళ్లీ దాదాపు 28ఏళ్ల తర్వాత ఈ ఇద్దరూ కలిసి ఒకే స్క్రీన్‌పై ఫుల్ లెంగ్త్ రోల్స్‌లో నటించనున్నారు.
Shahurkh Khan Movies : ఇక తాజాగా 'జవాన్'తో సూపర్ హిట్‌ను అందుకున్న షారుక్.. ప్రస్తుతం రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కిస్తున్న 'డుంకీ' మూవీలో లో నటిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌కు ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే సల్మాన్ ఖాన్ 'టైగర్ 3' సినిమాలో నటిస్తున్నారు. దీపావళి కానుకగా ఇది విడుదల కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">