Tiger 3 movie OTT Details : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'టైగర్ 3'. దీపావళి కానుకగా ఈ సినిమా ఈనెల 12న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైంది. సినిమాలో సల్మాన్ ఖాన్ యాక్షన్ సీన్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తొలి రెండు రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు చేసింది. అయితే ఇప్పటికీ హౌస్‌ఫుల్ షోస్‌తో థియేటర్లలో రన్ అవుతున్న ఈ మూవీ.. త్వరలోనే ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది.
'టైగర్ 3' ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకున్నట్లు సమాచారం. ఇందుకు మూవీ మేకర్స్ భారీ మొత్తంలో అమెజాన్ ప్రైమ్‌తో డీల్ కుదుర్చుకున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక థియేట్రికల్ రన్ పూర్తికాగానే, డిసెంబర్ మూడో వారంలో లేదా క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది.
Tiger 3 cast : యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన టైగర్ 3.. సినిమాను ఆదిత్య చోప్రా నిర్మించారు. మనీశ్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి ప్రీతమ్, తనూజ్ టింకూ సంగీతం సమకూర్చారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్.. సల్మాన్‌కు జంటగా నటించగా, నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించారు. ఇక సిమ్రన్, రిధి డోగ్రా, విశాల్ జెత్వా, కుముద్ మిశ్రా, రణ్‍వీర్ షోలే తదితరులు కీలకపాత్రల్లో కనిపించారు.
కథేంటంటే.. విద్వేషపు ఆలోచనల్లో ఉన్న మాజీ ఐఎస్ఐ ఏజెంట్ అతీష్ రెహ్మాన్ (ఇమ్రాన్ హష్మీ), పాకిస్థాన్ ప్రధాన మంత్రి నస్రీన్ ఇరానీ (సిమ్రాన్)ని హత్య చేసి, ఆ నేరాన్ని ఇండియా ఏజెంట్ టైగర్ (సల్మాన్‌ఖాన్) పై వేయాలని ప్లాన్ చేస్తాడు. నస్రీన్ ఇరానీ చేస్తున్న శాంతి ప్రయత్నాలు నచ్చని అతీష్.. పాకిస్థాన్ దేశ సైన్యాధికారుల్ని రెచ్చగొట్టి మరీ ఇందుకోసం వ్యూహం రచిస్తాడు. టైగర్ (సల్మాన్‌ఖాన్), అతని భార్య జోయా (కత్రినాకైఫ్) పర్సనల్ లైఫ్‌లోకి వెళ్లి.. వారిని ఓ ఆపరేషన్‌కోసం వాడుకుంటాడు. ఆ ఆపరేషన్‌తో దంపతులిద్దర్నీ ప్రపంచం ముందు దేశద్రోహులుగా నిలబెట్టాలని ప్రయత్నిస్తాడు. వాటిని టైగర్ ఎలా తిప్పికొట్టాడనేదే సినిమా కథ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'టైగర్ 3' రివ్యూ - స్పై యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
'వారిని ప్రమాదంలోకి నెట్టకుండా హాయిగా సినిమాను చూద్దాం'- క్రాకర్స్ ప్రమాదంపై సల్మాన్