ETV Bharat / entertainment

హత్యా బెదిరింపుల కేసులో సల్మాన్ షాకింగ్ స్టేట్​మెంట్! - సలీమ్ ఖాన్

Salman Khan Statement: హత్యా బెదిరింపుల వ్యవహారంలో బాలీవుడ్​ కండలవీరుడు సల్మాన్ ఖాన్ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు ముంబయి పోలీసులు. అంతకుముందు అతడి తండ్రి సలీమ్ ఖాన్ స్టేట్​మెంట్​ను కూడా రికార్డు చేశారు. ఇక తన తదుపరి సినిమా షూటింగ్​ కోసం హైదరాబాద్​లోని రామోజీ ఫిల్మ్​సిటీ చేరుకున్న సల్మాన్​కు అక్కడ కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

Salman Khan Statement
salman khan latest news
author img

By

Published : Jun 7, 2022, 6:05 PM IST

Updated : Jun 7, 2022, 6:35 PM IST

Salman Khan Statement: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్​, ఆయన తండ్రి సలీమ్ ఖాన్​ హత్యా బెదిరింపుల వ్యవహారంపై ముంబయి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ మేరకు సల్మాన్​ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నట్లు మంగళవారం ఓ అధికారి తెలిపారు. సోమవారం హైదరాబాద్​కు బయలుదేరే ముందు ఆయన స్టేట్​మెంట్​ను తీసుకున్నట్లు వెల్లడించారు.

అయితే తనకు ఎలాంటి బెదిరింపులు కానీ, బెదిరింపు ఫోన్​కాల్స్​ కానీ రాలేదని ఈ స్టేట్​మెంట్​లో సల్మాన్ స్పష్టంచేశారు. ఇటీవలి కాలంలో తనకు ఎవరితోనూ గొడవలు కూడా లేవని పేర్కొన్నారు. అంతకుముందు సలీమ్ ఖాన్ స్టేట్​మెంట్​ను కూడా రికార్డు చేశారు పోలీసులు. బాంద్రాలో సల్మాన్​ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఇదీ జరిగింది: ఆదివారం ఉదయం సలీమ్​ ఖాన్​.. స్థానికంగా ఉన్న ఓ పార్కులో జాకింగ్​కు వెళ్లారు. అక్కడే ఓ బెంచీ మీద విశ్రాంతి తీసుకుంటుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆయన పక్కన ఓ లేఖ వదిలి వెళ్లారు. దివంగత పంజాబ్​ గాయకుడు సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే తండ్రీకొడుకులకు కూడా పడుతుందని.. ఇద్దరినీ హత్య చేస్తామని దుండగులు లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఆర్​ఎఫ్​సీలోనూ పటిష్ఠ భద్రత: ఇక తన తదుపరి చిత్రం 'కభీ ఈద్ కభీ దివాలీ' కోసం సల్మాన్​.. హైదరాబాద్​లోని రామోజీ ఫిల్మ్​ సిటీ చేరుకోగా.. అక్కడ కూడా పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేసినట్లు సమాచారం. దాదాపు నెల రోజులు సల్మాన్​ ఇక్కడే ఉంటారని తెలుస్తోంది.

టైటిల్ మార్పు?: 'కభీ ఈద్ కభీ దివాలీ' సినిమా పేరు 'భాయ్​జాన్'​గా మారనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ చిత్రంలో సల్మాన్ సరసన పూజా హెగ్డే హీరోయిన్​గా నటిస్తోంది. ఫర్హాద్​ సంజీ దర్శకుడు.

ఇవీ చూడండి:

సల్మాన్​ ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు.. భద్రత కట్టుదిట్టం

బాలీవుడ్​ నటుడు సల్మాన్​ఖాన్​కు బెదిరింపులు.. చంపేస్తామని లేఖ

మరోసారి 'నో ఎంట్రీ' అంటున్న సల్మాన్​.. వెబ్​సిరీస్​గా గాంధీ పోరాటం

Last Updated : Jun 7, 2022, 6:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.