Maheshbabu Bollywood entry: తెలుగు సినిమాలకు దేశవ్యాప్తంగా లభిస్తున్న క్రేజ్‌పై హర్షం వ్యక్తం చేశారు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు. తాను ప్రత్యేకంగా బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు.
చాలా కాలం నుంచి మహేశ్ బాలీవుడ్ ఎంట్రీపై అనేక వార్తలు వచ్చాయి. వాటిపై పలు సందర్భాల్లో ఆయన స్పష్టత కూడా ఇచ్చారు. తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న మహేశ్‌కు మళ్లీ ఇదే ప్రశ్న ఎదురైంది. 'నేరుగా హిందీ సినిమా చేసే అవకాశం ఉందా?' అని ఓ విలేకరి అడిగారు. దీనికి ప్రిన్స్ స్పందిస్తూ.. "నేరుగా హిందీ సినిమా చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాను ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆదరిస్తున్నారు." అని అన్నారు.
త్వరలోనే మహేశ్.. పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కీర్తిసురేశ్ హీరోయిన్. దీని తర్వాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా, దర్శకధీరుడు రాజమౌళితో మరో చిత్రాన్ని చేయనున్నారు. ఈ మూవీ పాన్ ఇండియాగా తెరకెక్కనుంది. దీని బడ్జెట్ రూ.800కోట్లు ఉండబోతుందని ఇటీవలే జోరుగా ప్రచారం సాగింది.
ఇదీ చూడండి: 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్.. జక్కన్న, తారక్, చరణ్ ఏం అన్నారంటే?