ETV Bharat / entertainment

45 కోట్ల బడ్జెట్ - 40 వేల కలెక్షన్లు - ఈ వారం దారుణంగా డిజాస్టర్ అయిన చిత్రమిదే! - 38000 The Lady Killer collections

The Lady Killer Collections : ఈ వారం హిందీ బాక్సాఫీస్​ సీజన్​ దారుణంగా ఉంది. రిలీజైన ఏ చిత్రాలు కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. రూ.45 కోట్ల బడ్జెట్​ పెట్టి తీసిన ఓ సినిమా కేవలం రూ.38 వేలు మాత్రమే వసూలు చేసింది.

45 కోట్ల బడ్జెట్.. 40 వేల కలెక్షన్లు.. ఈ వారం దారుణంగా డిజాస్టర్ అయిన చిత్రమిదే!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2023, 2:50 PM IST

Updated : Nov 5, 2023, 5:47 PM IST

The Lady Killer Movie Collections : బాలీవుడ్​ హీరో అర్జున్ కపూర్​ - హీరోయిన్​ భూమి పెడ్నేకర్ నటించిన లేటెస్ట్ మూవీ 'ది లేడీ కిల్లర్'. రీసెంట్​గా నవంబర్ 3న రిలీజైన ఈ చిత్రం దారుణమైన వసూళ్లను అందుకుంటోంది. హిందీ చిత్రం పరిశ్రమలోనే అత్యంత దారుణమైన డిజాస్టర్ ఓపెనింగ్స్​ను వసూలు చేసింది.

ట్రేడ్​ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ లేడీ కిల్లర్​ చిత్రాన్ని.. హీరోహీరోయిన్ రెమ్యునరేషన్​, ఇతర ప్రమోషనల్​ మెటేరియల్​ ఖర్చుతో కలిపి రూ.45కోట్ల బడ్జెట్​తో నిర్మించారని తెలిసింది. అయితే థియేట్రికల్ బిజినెస్​ పెద్దగా జరగకపోయినా.. ఓటీటీ బిజినెస్​ కొంత వరకు పర్వాలేదనిపించేలా జరిగిందట. ముందు నుంచి ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్​ లేకపోవడం వల్ల దేశవ్యాప్తంగా పరిమిత స్క్రీన్స్​లోనే రిలీజ్​ చేశారు. మొత్తంగా ముంబయి, దిల్లీ కలిపి 11 స్క్రీన్లలో మాత్రమే విడుదల చేశారు. కానీ ఆ కొద్ది స్క్రీన్లకు కూడా ప్రేక్షకులు థియేటర్లకు రాలేదట.

మొదటి రోజు కేవలం 500 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయని తెలిసింది. దీంతో దారుణమైన ఓపెనింగ్స్​ వచ్చాయని ట్రేడ్​ వర్గాలు అంటున్నాయి. రూ.38000 వేలు మాత్రమే వసూలు చేసిందని పేర్కొన్నాయి. ఇక రెండో రోజు శనివారం ఎవరూ కనిపించలేదట. దీంతో హిందీ సినిమా పరిశ్రమలోనే అత్యంత డిజాస్టర్‌గా ఓపెనింగ్స్ అందుకున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది లేడీ కిల్లర్​. ఈ చిత్రాన్ని అజయ్ బెహల్ దర్శకత్వం వహించారు. శైలేష్ సింగ్, సాహిల్ మీర్ చందానీ నిర్మించారు.

ఈ లేడీ కిల్లర్​ చిత్రంతో పాటు ఈ వారం హిందీ బాక్సాఫీస్​ ముందు వచ్చిన ఆంఖ్​ మిచోలి, యూటీ 69 సినిమాలు కూడా అంతగా ఆకట్టుకోలేదు. వసూళ్లను కూడా సాధించలేదు. గత వారం వచ్చిన చిత్రాల్లో 12th ఫెయిల్​ టాక్​ పరంగా మంచిగా ఆకట్టుకుని పర్వాలేదనిపించే వసూళ్లను ఖాతాలో వేసుకుంది. అప్పుడే వచ్చిన కంగనా రనౌత్​ తేజస్​, సంజిని శిండే కా వైరల్​ వీడియో చిత్రాలు నిరాశ పరిచాయి. అలా గత రెండు వారాల నుంచి హిందీ బాక్సాఫీస్​ డౌన్​ అయిపోయింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బికినీలో అల్లు అర్జున్ హీరోయిన్ - కిరాక్​ పుట్టించేలా!

'యానిమల్​' డైరెక్టర్​ నిర్ణయంతో తలలు పట్టుకుంటున్న థియేటర్స్​ యజమానులు!

Last Updated : Nov 5, 2023, 5:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.