ETV Bharat / entertainment

'ది కేరళ స్టోరీ' హీరోయిన్ అదా శర్మకు యాక్సిడెంట్​.. ప్రస్తుతం ఆమె ఎలా ఉందంటే? - ది కేరళ స్టోరీ సుదీప్తోసేన్​కు యాక్సిడెంట్

వివాదాస్పద సినిమా 'ది కేరళ స్టోరీ' దర్శకుడు, హీరోయిన్ అదా శర్మ కారు ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ వివరాలు..

the kerala story
the kerala story
author img

By

Published : May 14, 2023, 4:23 PM IST

Updated : May 14, 2023, 9:31 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'ది కేరళ స్టోరీ' సినిమా కథానాయిక అదా శర్మ, దర్శకుడు సుదీప్తోసేన్ ప్రమాదానికి గురయ్యారు. ఓ ప్రైవేటు ఈవెంట్​కు వెళ్తుండగా.. ముంబయిలో వీరి కారు ప్రమాదానికి గురైంది. దీంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. అనంతరం వీరిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. అయితే, ఈ రోజు వీరు తెలంగాణలోని కరీంనగర్​లో జరుగుతున్న హిందూ ఏక్తా యాత్రలో పాల్గొనాల్సి ఉంది. కాగా, అత్యయిక ఆరోగ్య పరిస్థితి వల్ల కరీంనగర్​లో జరుగుతున్న ఆ కార్యక్రమానికి హాజరు రాలేకపోతున్నట్లు ట్విట్టర్​ వేదికగా తెలిపారు సుదీప్తోసేన్.

''ఈ రోజు మేము కరీంనగర్‌ రావాల్సి ఉంది. మా సినిమా గురించి అక్కడ మాట్లాడాల్సి ఉంది. కానీ, అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడం వల్ల రాలేకపోతున్నా. కరీంనగర్‌ ప్రజలకు క్షమాణలు తెలియజేస్తున్నాను. మన కుమార్తెలను రక్షించేందుకు మేము ఈ సినిమా తీశాం. దయచేసి మమ్మల్ని సపోర్ట్‌ చేయండి''
--సుదీప్తోసేన్, ది కేరళ స్టోరీ డైరెక్టర్

కాగా, కరీంనగర్​లో బీజేపీ అధ్యర్వంలో హిందూ ఏక్తా యత్రను ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, తరుణ్​ ఛుగ్​ తిదితర ముఖ్య నేతలతో పాటు.. 'ది కేరళ స్టోరీ' చిత్ర బృందానికి కూడా ఆహ్వానం అందింది.

నేను బాగానే ఉన్నాను.. : అదా శర్మ
ఈ ప్రమాదంపై అదా శర్మ స్పందించింది. తాను బాగానే ఉన్నానంటూ ట్వీట్​ చేసింది. ' నేను బాగానే ఉన్నాను. ప్రమాదం గురించి వార్తలు రావడం వల్ల నాకు చాలా మేసేజ్​లు వస్తున్నాయి. మా సినిమా బృందం, మేమంతా బాగానే ఉన్నాం. సీరియస్​గా ఏమీ లేదు. ఇది పెద్ద ప్రమాదమేమీ కాదు. కానీ మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు' అని ట్విట్టర్​లో తెలిపింది.

ఇక, ది కేరళ స్టోరీ సినిమా విషయానికొస్తే.. దర్శకుడు సుదీప్తోసేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేరళ రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా 32 వేల మంది అదృశ్యమయ్యారని వస్తున్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడనే ఇతివృత్తంతో ఈ సినిమాను తీశారు. నలుగురు యువతులు మతం మారి, ఉగ్రవాద సంస్థ ఐసిస్​లో చేరతారనే నేపథ్యంతో సినిమా ఉంటుంది. అలా ఐసిస్​లో చేరిన యువతులు ఉగ్రవాద ట్రైనింగ్​ పొంది భారత్​తో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉగ్ర చర్యలకు పాల్పడుతున్నట్లు ఈ సినిమాలో చూపించారు. ఇదే వివాదానికి దారితీసింది. అయితే, ఈ సినిమాలో చూపించేది నిజం కాదని కొందరు ఆరోపించారు.

కొన్ని రాష్ట్రాలు ఈ సినిమాపై పన్ను ఎత్తేస్తే.. మరికొన్ని రాష్ట్రాలు ప్రదర్శనలను నిషేధించాయి. దీనిపై చిత్ర బృందం కోర్టును ఆశ్రయించింది.
మే 5న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్లలో దూసుకెళ్తొంది. ఇప్పటి వరకు సుమారు రూ.112 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాలో అదా శర్మ, సిద్ధి ఇద్నానీ, యోగితా బిహానీ, సోనియా బలానీ, ప్రముఖ తమిళ నటి దేవదర్శిని ప్రధాన పాత్రలు పోషించారు.

Last Updated : May 14, 2023, 9:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.