ETV Bharat / entertainment

800 The Movie trailer : ఎమోషనల్​గా మురళీధరన్ బయోపిక్ ట్రైలర్​.. దిగ్గజ స్పిన్నర్‌ ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడో

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 5, 2023, 4:48 PM IST

Updated : Sep 5, 2023, 5:14 PM IST

800 The Movie Trailer Muthiah Muralidaran Biopic : శ్రీలంక క్రికెటర్‌, స్పిన్‌ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్​ ట్రైలర్​ రిలీజైంది. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం గుండెను పిండేసేలా ఉంది.

800 The Movie trailer : ఎమోషనల్​గా మురళీధరన్ బయోపిక్ ట్రైలర్​.. దిగ్గజ స్పిన్నర్‌ ఇన్ని అవమానాలు ఎదుర్కొన్నాడా?arat
800 The Movie trailer : ఎమోషనల్​గా మురళీధరన్ బయోపిక్ ట్రైలర్​.. దిగ్గజ స్పిన్నర్‌ ఇన్ని అవమానాలు ఎదుర్కొన్నాడా?

800 The Movie Trailer Muthiah Muralidaran Biopic : ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్లకు మైదానంలో చెమటలు పట్టించిన బౌలర్లలో ముత్తయ్య మురళీధరన్ ఒకడు. టెస్ట్ క్రికెట్‌ చరిత్రలో 800 వందల వికెట్లు తీసిన ఏకైన బౌలర్‌గా సెన్సేషనల్​ రికార్డ్ సృష్టించిన లెజెండరీ స్పిన్నర్ అయినా మురళీధరన్ జీవితం ఆధారంగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా '800' (800 Movie). మురళీధరన్​ జీవితాన్ని వెంటాడిన ఎన్నో సమస్యలు, చేదు అనుభవాలు, వివాదాలను.. దర్శకుడు ఎంఎస్ శ్రీపతి.. ఈ 800 చిత్రం ద్వారా బయట ప్రపంచానికి చూపించబోతున్నారు.

ఈ చిత్రంలో మురళీధరన్ పాత్రను 'స్లమ్‌డాగ్ మిలియనీర్' ఫేమ్ మధుర్ మిట్టల్, మురళీధరన్ భార్య మది మలర్ పాత్రను మహిమా నంబియార్ పోషించారు. బుకర్ ప్రైజ్ విన్నర్ స్నేహన్ కరుణాతిలక చిత్రానికి రైటర్‌గా వ్యవహరించారు. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ బ్యానర్​పై వివేక్ రంగాచారి చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ తెలుగు నిర్మాత అయిన శ్రీదేవి పిక్చర్స్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రిలీజ్​ కానుంది.

'పౌరహక్కు లేకుండా బానిసలుగా బతకి వచ్చిన వారికి పౌరసత్వం లభించడం చాలా కష్టం.. ఈ రోజు దేశమే తిరిగి చూసేలా ఓ పేదవాడు గొప్పవాడు అయ్యాడు' అంటూ నాజర్ చెప్పిన డైలాగ్‌తో ట్రైలర్ ఎమోషనల్‌గా ప్రారంభమైంది. శ్రీలంకలో ప్రత్యేక దేశం ఏర్పాటు కోసం జరిగిన మారణహోమం, బాంబు పేలుళ్ల సంఘటనలను చాలా ఉద్వేగంగా చూపించారు. ఈ ట్రైలర్‌లో అర్జున రణతుంగ, షేర్ వార్న్ లాంటి గొప్ప క్రికెటర్లను కూడా చూపించారు.

శ్రీ‌లంక‌లో త‌మిళుల‌కు, సింహ‌ళీయుల‌కు మ‌ధ్య జ‌రిగిన వ‌ర్గ వైశ‌మ్యాల‌ని చూపించారు. పౌర స‌త్వం లేకుండా బానిస‌లుగా మారిన ఓ వ్య‌క్తి ప్ర‌పంచ క్రికెట్​లో ఎలా ఎదిగాడు? ఈ క్ర‌మంలో అత‌నికి ఎదురైన సవాళ్లేంటీ?.. తన స్పిన్ మాయాజాలంతో ప్ర‌త్య‌ర్థుల‌ని ఎలా ఎదుర్కొన్నాడు? ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ముర‌ళీ జీవితాన్ని ఎలా ఇబ్బందుల‌కు గురి చేసింది? వంటి అంశాలతో సినిమాను తెరకెక్కించినట్లు చూపించారు.

అలానే శ్రీలంక జట్టులో తమిళలకు చోటు లేదనే వాదనకు.. ముత్తయ్య మురళీధరన్ తన తండ్రికి ఇచ్చిన సమాధానం కూడా చాలా ఎమోషనల్​గా ఉంది. 'జట్టులో తమిళులకు చోటు ఉండుదుగా'.. అని తండ్రి అన్నప్పుడు.. 'నేను ఒక తమిళవాడిగా భావించడం లేదు'.. అని ముత్తయ్య అనడం.. 'నీవు సింహళీయుడివా' అంటే.. 'లేదు..నేను క్రికెటర్‌ను' అంటూ మళ్లీ ముత్తయ్య సమాధానం చెప్పడం వంటి సన్నివేశాలు డైలాగ్స్​ ఆకట్టుకుంటున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'ఆ సమయంలో ధోనీ ముందే వస్తాడని ఊహించాం..'

దిగ్గజ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ స్వీట్‌ వార్నింగ్‌.. ఎందుకంటే?

Last Updated : Sep 5, 2023, 5:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.