ETV Bharat / entertainment

'ఆయనకి ఇప్పటిదాకా థ్యాంక్‌ యూ చెప్పలేదు.. మీరైనా చెప్పండి' - థ్యాంక్ యూ డైరెక్టర్

'ఇష్క్'​తో మొదలై 'గ్యాంగ్​లీడర్​', 'మనం' వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు విక్రమ్​ కె.కుమార్​. లవ్​ స్టోరీ, యాక్షన్​ ఇలా ఏ జోనర్​ అయినా తనదైన స్టైల్​లో తెరకెక్కించి హిట్​ చిత్రంగా మలుస్తారు విక్రమ్. తాజాగా ఆయన తెరకెక్కిన 'థ్యాంక్​ యూ' రిలీజ్​కు సిద్ధమైంది. ఈ సందర్భంగా సినిమా కథ, తన తదుపరి చిత్రాల గురించి విక్రమ్​ ఏమంటున్నారంటే..

vikram kumar thank you
vikram kumar thank you
author img

By

Published : Jul 15, 2022, 9:06 AM IST

Updated : Jul 15, 2022, 9:59 AM IST

విక్రమ్‌ కె.కుమార్‌... సెల్యులాయిడ్‌పై ఒక్కొక్క సినిమాతో ఒక్కో ప్రపంచాన్ని ఆవిష్కరించే దర్శకుడు. 'ఇష్టం', 'మనం', '24', 'గ్యాంగ్‌లీడర్‌'... ఈ చిత్రాలు ఆయన ప్రతిభకు గీటురాళ్లు. ఇటీవల నాగచైతన్య కథానాయకుడిగా 'థ్యాంక్‌ యూ' తెరకెక్కించారు. దిల్‌రాజు నిర్మించిన ఈ సినిమా జులై 22న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ..

"థ్యాంక్‌ యూ.. అనే మాట చాలా శక్తిమంతమైనది. ఎవరైనా మన కోసం తలుపు తెరవడం, టీ అందించడం దగ్గర్నుంచి చాలాసార్లు థ్యాంక్‌ యూ అని చెబుతుంటాం. దాన్ని వాడీ వాడీ విలువనే తగ్గించాం. అదే మాటని ఎక్కడ చెప్పాలో అక్కడ, ఎవరికి చెప్పాలో వాళ్లకి అస్సలు చెప్పం. అందుకే ఈ సినిమా తీశా. నేను ఇక్కడిదాకా వచ్చానంటే కారణం మా నాన్న. ఆయనకి ఇప్పటిదాకా థ్యాంక్‌ యూ చెప్పలేదు. ఉన్నట్టుండి ఆయన మాకందరికీ దూరమయ్యారు. అలా మనం చెప్పాల్సిన కృతజ్ఞతలు చాలానే పెండింగ్‌లో ఉండిపోతుంటాయి. మీ తల్లిదండ్రులకు ఒకసారి మనస్ఫూర్తిగా థ్యాంక్‌ యూ చెప్పి చూడండి. అదొక అద్భుతమైన అనుభవం. ఈ సినిమాలో ఎవరికి ఎవరు ఎప్పుడు చెప్పారనేది ఆసక్తికరం".

"నాగచైతన్య, నేను కలిసి మూడు నాలుగేళ్లుగా సినిమా చేయాలనుకుంటున్నాం. మా ఇద్దరి మధ్య దాని గురించి చర్చలు జరుగుతున్న సమయంలోనే 'థ్యాంక్‌ యూ' స్క్రిప్ట్‌ వచ్చింది. ఇందులో కథానాయకుడు 16 ఏళ్లు మొదలుకొని కాలేజీ రోజులు, 35 యేళ్ల మధ్య వయస్కుడి వరకు మూడు కోణాల్లో సాగే పాత్రలో కనిపించాలి. అలా కనిపించే ఒకే ఒక్క కథానాయకుడు ఎవరంటే నాకు చైతన్య తప్ప మరొకరు కనిపించలేదు. ఆ పాత్రల్లో వైవిధ్యం చూపించడం కోసం చైతూ చాలా కష్టపడ్డారు. అభిరామ్‌ పాత్రలో చై ఒదిగిపోయారు. మనం సొంతంగా ఎదిగామంటే మన విజయానికి మనమే కారణం అంటూ మరెవ్వరికీ క్రెడిట్‌ ఇవ్వడానికి ఒప్పుకోం. అలాంటి వ్యక్తే అభిరామ్‌. అతని ప్రయాణం ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అవుతుంది. రాశిఖన్నా, మాళవిక, అవికాగోర్‌ గుర్తుండిపోయేలా నటించారు. పీసీ శ్రీరామ్‌తో నాకు ఇది మూడో సినిమా. ఆయన నాకు గురువు, మార్గదర్శకులు. సినిమాపై ఆయనకున్న ప్యాషన్‌ చూస్తే ముచ్చటేస్తుంది. తమన్‌ పాటలు, నేపథ్య సంగీతం చాలా బాగా కుదిరింది. మిగతా నా బృందం పడిన కష్టానికి కచ్చితంగా 'థ్యాంక్‌ యూ' చెప్పాల్సిందే".

"ఇదొక కల్పిత కథ. ఎవ్వరి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని చేసింది కాదు. బి.వి.ఎస్‌.రవి కథని అందించారు. వేరొకరి కథతో సినిమా చేయడం ఇదే తొలిసారి. రవి కథ, అందులో ఆత్మ నాకు బాగా నచ్చింది. దానికి నా శైలి ట్రీట్‌మెంట్‌ ఇచ్చి ఈ స్క్రిప్ట్‌ సిద్ధం చేశా. నా సినిమాల్లో కనిపించే ఓ మేజిక్‌ ఇందులోనూ ఉంటుంది. అదేమిటన్నది తెరపైనే చూడాలి. దిల్‌రాజుతో 'ఆర్య' నుంచే పరిచయం. మేమిద్దరం కలిసి సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాం. ఇన్నాళ్లకి కుదిరింది. 'ప్రేమమ్‌', 'మై ఆటోగ్రాఫ్‌ స్వీట్‌మెమొరీస్‌' సినిమాలు గుర్తుకు రావొచ్చేమో కానీ, ఇదొక భిన్నమైన కథ. కానీ ఆ స్కూల్‌ సినిమాల జాబితాలో చేరుస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది".

"నా తదుపరి చిత్రం మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలో ఉంటుంది. అందుకోసం కథ సిద్ధం చేస్తున్నా. హిందీలోనూ ఓ యాక్షన్‌ సినిమా చేస్తున్నా. నేను ఇప్పటిదాకా చేయని కథ అది. '24'కి కొనసాగింపు చిత్రం గురించి అప్పుడప్పుడూ కొన్ని ఆలోచనలు వస్తుంటాయి. దాన్ని కొనసాగించాలనే ఆలోచనైతే ఉంది కానీ, అది ఎప్పుడు కుదురుతుందో తెలియదు".

" ఫీల్‌ గుడ్‌ సినిమాలంటే చాలా ఇష్టం. రియాలిటీ అంటే నాకు అస్సలు నచ్చదు. సినిమా థియేటర్‌ నా దృష్టిలో ఒక అందమైన ప్రపంచం. దాన్నుంచి బయటికి వెళ్లాలంటేనే బాధగా అనిపించాలి. అలాంటి అందమైన అనుభూతిని పంచే రొమాంటిక్‌ సినిమాలు తీయడమే నాకు ఇష్టం. నా సినిమాల్లో థ్రిల్లింగ్‌ అంశాలు ఉంటాయంటే కారణం ప్రేక్షకులకు బోర్‌ కొట్టకూడదనే. అలాగని ప్రతీచోటా థ్రిల్లింగ్‌ అంశాలు ఉంటే బాగోదు. కథల్నిబట్టే అవసరమైన చోట ఆ పద్ధతిలో సన్నివేశాలు ప్లాన్‌ చేస్తుంటా".

ఇవీ చదవండి:

National Nude Day: బాలీవుడ్​ భామల 'న్యూడ్'​ షో.. ఆ సీన్స్​తో మతి పోగొట్టారుగా..

'ఒకప్పుడు హీరోయిన్లకు ఆ కొలతలు చూసేవారు!'

Last Updated : Jul 15, 2022, 9:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.