ETV Bharat / entertainment

'బింబిసార'లో కొత్తేమి లేదు.. చూసి మురిసిపోకండి: ప్రముఖ నిర్మాత షాకింగ్ కామెంట్స్​ - బింబిసార తమ్మారెడ్డి భరద్వాజ

Bimbisara movie: 'బింబిసార', 'సీతారామం' హిట్‌ అయిన కారణంగా ఆనందపడిపోవద్దని అన్నారు ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. బింబిసార చిత్రం రెగ్యులర్‌ కమర్షియల్‌ కథేనని.. కొత్త కథేమీ కాదని చెప్పారు.

bimbisara
బింబిసార
author img

By

Published : Aug 11, 2022, 1:44 PM IST

Bimbisara movie: 'బింబిసార', 'సీతా రామం' హిట్‌ అయ్యాయని ఆనందపడిపోకూడదు. భవిష్యత్తులో తెరకెక్కించే ప్రతి చిత్రాన్ని మంచి కంటెంట్‌తో రూపొందించాలి. మూడు, నాలుగు రోజుల కలెక్షన్స్‌ చూసి సంబరాలు చేసుకోకూడదు" అని ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. 'బింబిసార'ను వీక్షించిన ఆయన సినిమా గురించి తన అభిప్రాయాలు పంచుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం రెగ్యులర్‌ కమర్షియల్‌ కథేనని.. కొత్త కథేమీ కాదని చెప్పారు. అయితే దర్శకుడు వశిష్ఠ ఈ సినిమాను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారని మెచ్చుకున్నారు.

'బింబిసార' అనే క్రూరమైన రాజుతో కథ మొదలుపెట్టి టైమ్‌ ట్రావెల్‌లో ఆ రాజు ఎలా సెంటిమెంటల్‌గా మారాడో చూపించారు అని తమ్మారెడ్డి విశ్లేషించారు. అయితే, ఈ చిత్రాన్ని 'ఆదిత్య 369'తో పోల్చి చూడటం సరైన పద్ధతి కాదన్నారు. ఆ సినిమాకు, ఈ సినిమాకూ ఎలాంటి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. "మంచి కంటెంట్‌ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా సినిమాని ఆదరిస్తారు. అయితే ఈ విజయాలతో ఆనందపడిపోకుండా సినిమాల రన్‌ పెరిగేలా చూడాలి. థియేటర్లకు రెగ్యులర్‌ ఆడియన్స్‌ పెరగాలి" అని సూచించారు తమ్మారెడ్డి.

"50 రోజులపాటు సినిమాలు ఎందుకు థియేటర్లలో ఆడటం లేదు? అసలు ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు రావడం లేదు అనేది ఆలోచించాలి. అప్పుడే మరిన్ని మంచి సినిమాలు వచ్చి థియేటర్లు బతుకుతాయి. సినిమాకు పూర్వ వైభవం సొంతమవుతోంది" అని తమ్మారెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చూడండి: బన్నీ షాకింగ్ నిర్ణయం.. రూ.10కోట్లు లాస్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.