ETV Bharat / entertainment

త్వరలో సరికొత్తగా ఢీ15.. గ్రాండ్​గా లాంచ్ ఈవెంట్.. ప్రభుదేవా ఏమన్నారంటే? - ఢీ 15 సీజన్​ జడ్జస్​

తెలుగు బుల్లితెరపై తనడైన స్టార్​డమ్ తెచ్చుకున్న షోస్​లో ఢీ ఒకటి. 14 సంవత్సరాలుగా ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేస్తున్న ఈ షో ఇప్పుడు 15వ సీజన్‌లో అడుగుపెట్టబోతోంది. ఎంతో గ్రాండ్‌గా జరిగిన ఈ లాంచ్‌ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా డ్యాన్స్​ కొరియోగ్రాఫర్​ ప్రభుదేవా హాజరయ్యారు.

Telugu Dance Show Dhee 15 Season Start
Telugu Dance Show Dhee 15 Season Start
author img

By

Published : Dec 11, 2022, 10:32 AM IST

Dhee 15 : 'ఢీ' అంటేనే ఉరకలెత్తే ఉత్సాహం. అడుగడుగునా అంచనాలకు అందని నాట్యాలతో, అణవుణువునా సాటిలేని వినోదాలతో తెలుగు ప్రేక్షకుల్ని 14 సంవత్సరాలుగా సమ్మోహితుల్ని చేస్తున్న ఈ షో ఇప్పుడు 15వ సీజన్‌లో అడుగుపెట్టబోతోంది. ఎంతో గ్రాండ్‌గా జరిగిన ఈ లాంచ్‌ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా ప్రఖ్యాత నృత్య దర్శకుడు ప్రభుదేవా విచ్చేసి 'ఢీ'లో పాల్గొంటున్న కొత్త డ్యాన్సర్లు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఎంతోమంది ప్రతిభ కలిగిన డ్యాన్సర్లను, డ్యాన్స్‌ మాస్టర్లను సినీ రంగానికి అందించి, ఎప్పటికప్పుడు కొత్తదనంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ దక్షిణ భారతదేశంలోనే అగ్రగామి డ్యాన్స్‌ షోగా విశేష ఆదరణ పొందుతోంది 'ఢీ'. ఈ షో 15వ సీజన్‌ ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి ఈటీవీలో ప్రసారం కాబోతుంది.

ప్రభుదేవాతో పాటు ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్లు జానీ, నోబుల్‌, శ్రీధర్‌లు కూడా ప్రారంభ వేడుకలకు అతిథులుగా హాజరై కంటెస్టెంట్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. గణేష్‌ మాస్టర్‌, శ్రద్ధాదాస్‌ న్యాయ నిర్ణేతలుగా, ప్రదీప్‌ వ్యాఖ్యాతగా, హైపర్‌ ఆది, జెస్సీ ఎంటర్‌టైనర్స్‌గా వ్యవహరించిన ఈ కార్యక్రమం శుభారంభం సందర్భంగా ప్రభుదేవా పంచుకున్న విశేషాలివీ.

  • "అందరికీ నమస్కారం. మీ అందరూ నాపై ఇంత అభిమానం చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. ప్రదీప్‌ చెప్పినట్లు ఇంటి పెద్దన్నయ్య విదేశాల నుంచి తిరిగి ఇల్లు చేరినట్లు అనిపిస్తుంది. నా పొలంలో మొలకలు వచ్చినట్లుగా ఉంది".
  • "ఈ కార్యక్రమానికి ప్రదీప్‌ అద్భుతంగా వ్యాఖ్యానం చేస్తున్నారు. ఆయన కార్యక్రమాన్ని చాలా బాగా నడిపిస్తున్నారు. హైపర్‌ ఆది తదితరులు చాలా ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. ప్రోగ్రామ్‌లో హై ఎనర్జీ డ్యాన్స్‌ ఉన్నప్పుడు వాళ్ల మాటలు కూడా అంతే ఎనర్జీగా ఉంటున్నాయి".
  • "ప్రతిసారీ కొత్త న్యాయనిర్ణేతలు వస్తున్నారు. అందరూ చక్కగా జడ్జిమెంట్‌ ఇస్తున్నారు. కొరియోగ్రాఫర్స్‌ కూడా బాగా కొరియోగ్రఫీ చేస్తున్నారు. సరిగ్గా ప్లాన్‌ చేసుకొని టైటిల్‌ కొట్టాలి".
  • "డ్యాన్సర్లు అందరూ చాలా బాగా చేస్తున్నారు. నాకూ కూడా కంటెస్టెంట్‌గా చేరాలని ఉంది. కానీ ఫస్ట్‌ సెలక్షన్స్‌లోనే ఓడిపోతానని తెలుసు. మీరంతా చాలా డేంజరస్‌ డ్యాన్సర్లు. మీతో నేను ఆడలేను. నేను ముందే వచ్చేశాను. అందుకే నన్ను ఇక్కడ పెట్టారు. నా తర్వాత మీరు పుట్టినందుకు థ్యాంక్స్‌. అందరికీ నా శుభాకాంక్షలు. మల్లెమాల శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, ఈటీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు".

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.