ETV Bharat / entertainment

'30 ఏళ్ల వరకే ఆ పని చేస్తా'.. విష్వక్ సేన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

విష్వక్ సేన్.. సాధారణ నటుడిగా వచ్చి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. మొదటి సినిమాతోనే మాస్​ ఆడియన్స్​కు దగ్గరై.. మాస్​ కా దాస్​ అనిపించుకున్నారు. ఇకపై వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా అతడు నటించిన చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా తన సినిమాల గురించి విశేషాలు పంచుకున్నారు.

telugu actor vishwak sen interview
telugu actor vishwak sen interview
author img

By

Published : Oct 21, 2022, 8:49 AM IST

తొలి అడుగుల్లోనే మాస్‌ ప్రేక్షకులకు చేరువైన కథానాయకుడు విష్వక్‌సేన్‌. కథల ఎంపికలో వైవిధ్యం ప్రదర్శిస్తుంటాడు. చేసే పాత్రలతో తన నటనలో ప్రత్యేకతని ఆవిష్కరిస్తుంటాడు. అదే ఆయన్ని విజయాల బాటలో నిలుపుతోంది. విష్వక్‌ కథానాయకుడిగా పీపీపీ సినిమా పతాకంపై ఇటీవల 'ఓరి దేవుడా' తెరకెక్కింది. తమిళంలో విజయవంతమైన 'ఓ మై కడవులే'కి రీమక్‌ ఇది. దీపావళి సందర్భంగా శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా విష్వక్‌సేన్‌ గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

ఎలాంటి వివాదం లేకుండా మీ సినిమా విడుదలవుతోంది. వివాదాలు మీ సినిమాకి మేలు చేస్తుంటాయి కదా?
మేలంటూ ఏమీ లేదు. వివాదం చోటు చేసుకున్నాక నేను భయపడి ఇంట్లో కూర్చున్నానంటే నన్ను సర్దేస్తారు. నేను దాన్ని ఎదుర్కొని, పోరాడి నా తప్పేమీ లేదని నిరూపించుకుంటాను కాబట్టే అది నాకు ప్లస్‌ అవుతున్నట్టు అనిపిస్తుంది. అయినా 'హిట్‌' ఎలాంటి వివాదం లేకుండా విడుదలై విజయవంతమైంది కదా. పోయినసారి కూడా ప్రాంక్‌ వీడియో నేను ప్లాన్‌ చేసిందేమీ కాదు. ప్రచారం అంటే పది చోట్లకి పరిగెత్తుతుంటాం. ఆ క్రమంలో చోటు చేసుకున్న ఓ సంఘటనే ప్రాంక్‌ వీడియో. అది నేను రాసిందేమీ కాదు.

'ఓరి దేవుడా' ప్రాజెక్ట్‌ మీ దగ్గరికి ఎప్పుడొచ్చింది?
'అశోకవనంలో అర్జునకళ్యాణం' కంటే ముందు ఈ సినిమానే ఒప్పుకున్నా. కానీ మొదట 36 ఏళ్ల వయసున్న వ్యక్తిగా కనిపించి, ఆ తర్వాత యువకుడిగా కనిపిస్తే బాగుంటుందని.. కెరీర్‌ బ్యాలెన్స్‌ అవుతుందని మొదట 'అశోకవనంలో అర్జునకళ్యాణం' చేశా. ఈ కథకి నేనైతే బాగుంటానని ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత వంశీ కాక, నిర్మాత పీవీపీ అనుకుని నన్ను సంప్రదించారు. నీకు ఇది గేమ్‌ ఛేంజర్‌ అవుతుందని నిర్మాత చెప్పారు. సినిమా చూసి రెండు రోజుల్లోనే చేస్తానని చెప్పా. సున్నితమైన అంశంతో సాగే కథ ఇది. మాతృకని తీసిన దర్శకుడే ఇక్కడ తీయాలనేది పీవీపీ నిర్ణయం. నిజంగా ఏమాత్రం కదిలించినా చెడిపోయే అవకాశం ఉన్న కథ ఇది. దర్శకుడు అశ్వత్‌ తమిళంలో పలు పరిమితుల మధ్య సినిమాని తీశారు. కానీ ఇక్కడ అన్నీ పక్కాగా కుదరడంతో ఆ కథని అప్‌గ్రేడ్‌ చేసి తీశారు.

వెంకటేష్‌ ఇందులో కీలక పాత్ర పోషించారు. ఆయనతో కలిసి చేసిన ఈ ప్రయాణంలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి?
ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. ఐదో సినిమానే వెంకటేష్‌తో కలిసి నటిస్తానని కలలో కూడా అనుకోలేదు. నావరకు ఊహించని పరిణామం. సెట్లో మూడు రోజులు ఆయనతో కలిసి ప్రయాణం చేశా. సినిమాలో ఆయన లుక్‌, పాత్రలో ఆయన ఉత్సాహం చాలా బాగుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు అదిరిపోయేలా ఉంటాయి. షాట్‌ విరామంలో వేరేవాళ్లతో కబుర్లు చెబుతూ గడపకుండా సన్నివేశాన్ని ఎలా ప్రాక్టీస్‌ చేయాలో ఆయన్ని చూసి నేర్చుకున్నా. మన పని మనం చేస్తూ వెళ్లినప్పుడు గొప్ప సినిమా మనల్ని వెదుక్కుంటూ వస్తుందని ఆయన సెట్లో చెప్పిన మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

మీరు దర్శకత్వం వహించిన 'దాస్‌ కా ధమ్కీ' ఎప్పుడొస్తుంది?
చిత్రీకరణ పూర్తయింది. పలు భాషల్లో ఆ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. తదుపరి నా నుంచి వచ్చే సినిమా అదే. దాని తర్వాత 'గామి' అనే మరో సినిమా విడుదలవుతుంది. 'ఫలక్‌నామాదాస్‌ 2' కూడా ఆలోచన రూపంలో ఉంది. వచ్చే ఏడాది దాన్ని సెట్స్‌పైకి తీసుకెళతాం.

"కెరీర్‌ పరంగా ఏదీ ప్లాన్‌ చేయలేదు. అన్నీ అనుకోకుండానే జరిగాయి. ఎక్కువ, తక్కువ కాకుండా.. పనిచేస్తూ వెళుతున్నానంతే. అయితే 'ఈ నగరానికి ఏమైంది?' చేస్తున్నప్పుడు మాత్రం ఓ నిర్ణయం తీసుకున్నా. ముప్పయ్యేళ్ల వయసు వరకు ప్రయోగాలు చేయాలి, ఆ తర్వాత బాక్సాఫీసు, స్టార్‌ ఇమేజ్‌ గురించి ఆలోచించాలనుకున్నా. ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలపై సంతృప్తిగా ఉన్నా. ఒకదానికొకటి సంబంధం లేని పాత్రలు చేశా. మరికొన్నాళ్లు ఈ ప్రయాణం ఇదే ప్రవాహంలో సాగుతుంది".

ఇవీ చదవండి : వైరల్​గా రేణూ దేశాయ్​ పోస్ట్​.. పవన్​ను ఉద్దేశించి పెట్టిందేనా?

ఈ చిన్నారి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఓ హీరో భార్య కూడా.. ఎవరంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.