ETV Bharat / entertainment

అంజనాద్రి కోసం 'హనుమాన్‌' పోరు.. దేశమే ముఖ్యం అంటున్న సిద్ధార్థ్​!

author img

By

Published : Jan 10, 2023, 9:56 AM IST

తేజా సజ్జా లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న హను-మాన్​ మూవీ నుంచి ఓ కొత్త అప్డేట్​ వచ్చింది. మరోవైపు దేశమే తనకు ముఖ్యం అంటున్నాడు నటుడు సిద్ధార్ధ్​ మల్హోత్రా. ఆ విశేషాలు మీ కోసం..

hanuman and mission majnu updates
hanuman and mission majnu updates

ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి వస్తున్న తొలి చిత్రం 'హను-మాన్‌'. తేజ సజ్జా కథానాయకుడు. కె.నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. అమృత అయ్యర్‌ కథానాయిక. ఈ సినిమాని పాన్‌ వరల్డ్‌ స్థాయిలో మే 12న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోమవారం ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రచార చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.

ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మరాఠీ లాంటి భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్‌, స్పానిష్‌, కొరియన్‌, చైనీస్‌, జపనీస్‌ లాంటి విదేశీ భాషల్లోనూ విడుదల చేయనున్నట్లు ఆ ప్రచార చిత్రంలో చూపించారు. అంజనాద్రి అనే ఓ ఊహా ప్రపంచంలో సాగే కథ ఇది. హనుమంతుని శక్తులు పొందిన కథానాయకుడు.. అంజనాద్రి కోసం ఎలా పోరాడాడనేది తెరపై చూసి తెలుసుకోవాలి.

నాకన్నా.. దేశమే ముఖ్యం
సిద్ధార్థ్‌ మల్హోత్రా, రష్మిక ప్రధాన పాత్రధారులుగా శంతను బాగ్చి తెరకెక్కిస్తున్న చిత్రం 'మిషన్‌ మజ్ను'. స్పై థ్రిల్లర్‌గా ముస్తాబైన ఈ సినిమా ట్రైలర్‌ సోమవారం విడుదలైంది. ఇందులో సిద్ధార్థ్‌ భారత గూఢచారిగా కనిపించనున్నారు. అతడితో ప్రేమలో పడే అంధ అమ్మాయిగా రష్మిక నటిస్తోంది. 1970లలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

పాకిస్థాన్‌లోని అణ్వాయుధ వివరాల రహస్యాలను ఛేదించడానికి ఒక గూఢచారి కావాలి అంటూ భారత ప్రధానితో అధికారులు చర్చించే సన్నివేశంతో ట్రైలర్‌ మొదలవుతుంది. ఈ సినిమా జనవరి 20న నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదలవుతోంది. 'ఎవరైతే నాకన్నా నా దేశం ముఖ్యం అని భావిస్తారో.. వాళ్లు ఆ దేశం కోసం సర్వస్వం అర్పించడానికి సిద్ధమవుతారు' అనే ట్వీట్‌ జోడించి ట్రైలర్‌ని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది నెట్‌ఫ్లిక్స్‌.

ప్రేక్షకులకు ఒక్కటే పాత్ర.. నా వరకు రెండు!
'హంట్‌'తో బాక్సాఫీస్‌ వేటకు సిద్ధమయ్యారు సుధీర్‌బాబు. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని మహేష్‌ తెరకెక్కించారు. వి.ఆనంద ప్రసాద్‌ నిర్మాత. భరత్‌ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ఈనెల 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర యాక్షన్‌ మేకింగ్‌ వీడియోను హీరో రానా సోమవారం విడుదల చేశారు. ప్రేక్షకులకు రియలిస్టిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందించడం కోసం డూప్స్‌, రోప్స్‌ వాడకుండా పోరాట ఘట్టాల్ని సహజంగా ఎలా చిత్రీకరించారన్నది ఈ వీడియోలో ఆసక్తికరంగా చూపించారు.

ఈ యాక్షన్‌ సన్నివేశాల గురించి హీరో సుధీర్‌బాబు మాట్లాడుతూ.. "హంట్‌ రెగ్యులర్‌ ఫార్ములాలో వెళ్లే సినిమా కాదు. కథను నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేశాం. ఈ చిత్ర పోరాట ఘట్టాల్ని క్యాంపస్‌ యూనివర్స్‌ కాస్‌కేడ్స్‌ టీమ్‌తో తెరకెక్కించాం. సినిమాలో ఎక్కడా ఒక్క రోప్‌, బెడ్‌ వాడలేదు. మా కెమెరామెన్‌ ఉన్నా.. ఫైట్స్‌ వరకు ఆ టీమ్‌ కెమెరామెన్‌తోనే చిత్రీకరించాం. ఈ సినిమాలో నేను ఓ ప్రమాదం తర్వాత జ్ఞాపకశక్తిని కోల్పోయిన వ్యక్తి పాత్రలో కనిపిస్తాను. సినిమా చూసే ప్రేక్షకులకు అది ఒక్కటే పాత్ర. కానీ, నా వరకు డబుల్‌ రోల్‌. ఈ చిత్రంలో యాక్షన్‌ మాత్రమే కాదు.. చాలా కథ ఉంది" అన్నారు.

పేరు లేని ఊరిలోకి కొత్త గాలి
'బుట్టబొమ్మ'గా వినోదాలు పంచేందుకు సిద్ధమవుతోంది అనిక సురేంద్రన్‌. ఆమె.. సూర్య వశిష్ఠ, అర్జున్‌ దాస్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని శౌరి చంద్రశేఖర్‌ రమేష్‌ తెరకెక్కించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం ఈ చిత్ర తొలి గీతాన్ని విడుదల చేశారు.

"పేరు లేని ఊరిలోకి కొత్త గాలొచ్చిందా.. ఊసుపోక ఊసులెన్నో తీసుకొస్తూ ఉందా" అంటే సాగే ఈ పాటకు స్వీకర్‌ అగస్తీ స్వరాలు సమకూర్చగా.. శనపతి భరద్వాజ్‌ పాత్రుడు సాహిత్యమందించారు. మోహన భోగరాజు ఆలపించారు. మొబైల్‌ సంభాషణల ద్వారా నాయకానాయికలు ఒకరితో ఒకరు ప్రేమలో పడే తీరును ఈ పాటలో ఆసక్తికరంగా చూపించారు. "కొత్తదనం నిండిన ఆహ్లాదకరమైన ప్రేమకథతో తెరకెక్కిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటుంది" అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి కూర్పు: నవీన్‌ నూలి, ఛాయాగ్రహణం: వంశీ పచ్చిపులుసు.

జైలర్‌లో అతిథిగా
ముత్తువేల్‌ పాండ్యన్‌ పాత్రలో.. తమిళ అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ నటిస్తున్న చిత్రం 'జైలర్‌'. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. శివరాజ్‌కుమార్‌, రమ్యకృష్ణ కీలక భూమికలు పోషిస్తున్నారు. ఇందులో మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌ అతిథి పాత్రలో మెరవనున్నారని గతంలోనే వెల్లడించారు. ఆయన కొద్దిరోజులుగా చెన్నైలో జరుగుతున్న షూటింగ్‌లో సైతం పాల్గొంటున్నారు.

ఆయన పాత్రకు సంబంధించిన పోస్టర్‌ని సోమవారం విడుదల చేశారు. చిరుతపులి చారల చొక్కా, వదులు ట్రౌజర్‌, పొడవాటి జుత్తుతో.. రెట్రో స్టైల్‌ వేషధారణతో ఉన్న ఆయన 1980 నాటి రోజులను గుర్తుకు తెస్తున్నారు. దీన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ "జైలర్‌లో లాల్‌ అన్న మోహన్‌లాల్‌" అంటూ ఈ ఫొటో జోడించింది నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆ నమ్మకంతోనే సంక్రాంతికి వస్తున్నాం
"కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం 'కళ్యాణం కమనీయం'. పెళ్లయ్యాక భర్తకు ఉద్యోగం లేకుంటే భార్య ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుందనేది ఇందులో చూపిస్తున్నాం" అన్నారు దర్శకుడు అనిల్‌ కుమార్‌ ఆళ్ల. సంతోష్‌ శోభన్‌, ప్రియ భవానీ శంకర్‌ జంటగా నటించిన చిత్రమిది. యువీ కాన్సెప్ట్స్‌ సంస్థ నిర్మించింది. ఈ సినిమా ఈనెల 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్‌ మాట్లాడుతూ.. "ఇదొక చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. సమాజంలోని అమ్మాయిల ఆలోచనా ధోరణిని మా చిత్రం ప్రతిబింబిస్తుంది. మా కథపై నమ్మకంతోనే స్టార్‌ సినిమాలున్నా సంక్రాంతికి వస్తున్నాం" అన్నారు. .

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.