'ప్రేమకావాలి', 'లవ్లీ', 'సుకుమారుడు' వంటి యూత్‌ఫుల్ లవ్‌స్టోర్స్‌తో కెరీర్ ఆరంభంలోనే వరుస హిట్స్ అందుకున్న హీరో ఆది. గత కొంతకాలంగా పరాజయాలు చవిచూసిన ఆయన తిరిగి ఫామ్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన నటించిన కొత్త చిత్రం 'తీస్ మార్ ఖాన్'. కల్యాణ్‌జీ గొంగన దర్శకుడు. తాజాగా ఈసినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ సినిమాలో ఆది.. తీస్ మార్ ఖాన్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. పాయల్ రాజ్‌పుత్ కథానాయిక. "రాక్షసుడికి రక్షకుడంటే ఏంటో చూపించాలి" అంటూ డైలాగ్స్‌తో ఆది ఎంట్రీ అదరగొట్టేలా ఉంది. ఇందులో అనూప్ సింగ్ ఠాకూర్ ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు. పూర్ణ, సునీల్, కబీర్ సింగ్ కీలకపాత్రలు పోషించారు. విజన్ సినిమాస్ పతాకంపై నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
రణ్‌బీర్ లుక్ వైరల్: గుబురుగడ్డం, సూటిగా చూస్తున్న కళ్లు, చేతిలో గొడ్డలితో ఉన్న రణ్‌బీర్ కపూర్ కొత్త సినిమా పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇది త్వరలో విడుదల కానున్న రణ్‌బీర్ సినిమా 'షంషేరా'లో లుక్‌గా తెలుస్తోంది. కరణ్ మల్హోత్ర దర్శత్వంలో ప్రముఖ 'యశ్ రాజ్ ఫిల్స్మ్' నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ‘షంషేరా’ చిత్రంలో రణ్‌బీర్ 1800 కాలం నాటి స్వాతంత్య్రకాంక్ష కలిగిన, దోపిడి ముఠా నాయకుడిగా కనిపించనున్నాడు. దానికి సంబంధించిన ఆహార్యంతో ఉన్న పోస్టర్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
'సంజు' సినిమా హిట్ తర్వాత రణ్‌బీర్‌ది ఇంతవరకు ఏ చిత్రం విడుదలవ్వలేదు. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల అనంతరం హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదలవుతున్న 'షంషేరా'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం 2022, జులై 22న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించింది.
'విరాట పర్వం' మేకింగ్ వీడియో: సాయి పల్లవి, రానా ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'విరాటపర్వం'. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. వెన్నెల పాత్రలో సాయిపల్లవి, రవన్న పాత్రలో రానాలను చూసుకుని ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. ప్రేమ, విప్లవం అంశాలతో తెరకెక్కిన ఈ చిత్ర మేకింగ్ వీడియోను చిత్రబృందం విడుదలచేసింది.
-
All the hardwork behind those beautiful & stunning sequences on the screen❤️
— Suresh Productions (@SureshProdns) June 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Making of #VirataParvam.
Book your tickets now
🔗 https://t.co/m3EcEspUHm
IN CINEMAS NOW.@RanaDaggubati @Sai_Pallavi92 @venuudugulafilm @dancinemaniac @DivakarManiDOP @SLVCinemasOffl @SureshProdns pic.twitter.com/uMp4jm0A4v
">All the hardwork behind those beautiful & stunning sequences on the screen❤️
— Suresh Productions (@SureshProdns) June 18, 2022
Making of #VirataParvam.
Book your tickets now
🔗 https://t.co/m3EcEspUHm
IN CINEMAS NOW.@RanaDaggubati @Sai_Pallavi92 @venuudugulafilm @dancinemaniac @DivakarManiDOP @SLVCinemasOffl @SureshProdns pic.twitter.com/uMp4jm0A4vAll the hardwork behind those beautiful & stunning sequences on the screen❤️
— Suresh Productions (@SureshProdns) June 18, 2022
Making of #VirataParvam.
Book your tickets now
🔗 https://t.co/m3EcEspUHm
IN CINEMAS NOW.@RanaDaggubati @Sai_Pallavi92 @venuudugulafilm @dancinemaniac @DivakarManiDOP @SLVCinemasOffl @SureshProdns pic.twitter.com/uMp4jm0A4v
ఇదీ చూడండి: థియేటర్‌లోనే ఏడ్చేసిన సదా.. ఆ ఘటన గుర్తొచ్చి..!