ETV Bharat / entertainment

బ్రేక్స్​ ఫెయిల్​.. ప్రమాదం నుంచి తప్పించుకున్న విజయ్​!

Tarun Bhaskar Vijaydevarkonda: 'పెళ్లి చూపులు' సినిమా షూటింగ్​ సమయంలో తాను, విజయ్​ దేవరకొండ ఓ ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు గుర్తుచేసుకున్నారు దర్శకుడు తరుణ్​ భాస్కర్​. కానీ ఆ సమయంలో విజయ్​ చెప్పిన సమాధానం విని తాను షాక్​ అయినట్లు చెప్పారు.

author img

By

Published : May 24, 2022, 4:52 PM IST

విజయ్​దేవరకొండ తరుణ్​ భాస్కర్
Vijaydevarkonda tarun bhaskar

Vijaydevarkonda injured: 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు తరుణ్​ భాస్కర్. మరోవైపు నటుడిగా, సింగర్​గానూ మంచి పేరు సంపాదించుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. 'విజయ్​ దేవరకొండతో మళ్లీ సినిమా చేసే అవకాశం ఉందా' అన్న ప్రశ్నకు సమాధానం చెప్పారు. "నాకు వరుసగా మూడు ఫ్లాప్​లు వచ్చాక విజయ్​ దేవరకొండను వైల్డ్​ కార్డ్​లా వాడతా" అని అన్నారు.

దీంతో పాటు 'పెళ్లి చూపులు' సినిమా సమయంలో ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అయిన సంఘటనను గుర్తుచేసుకున్నారు. "ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అవ్వగానే అప్పటివరకు భయపడ్డ విజయ్​ సడన్​గా రిలాక్స్​ అయిపోయాడు. ప్రియదర్శి హ్యాండ్​ బ్రేక్​ తీయగానే అది చేతులోకి వచ్చేసింది. తర్వాత ట్రక్కు వెళ్లి చెట్టును ఢీ కొట్టింది. అందరం బతికిపోయాం. అయితే నేను బతికి ఉన్నానన్న దానికంటే విజయ్​ ఎందుకలా కూల్​గా ఉన్నాడో తెలుసుకోవాలన్న ఆతృత ఉందప్పుడు. వెంటనే విజయ్​ దగ్గరకు వెళ్లి ఎందుకంత రిలాక్స్​గా ఉన్నావని అడిగితే.. 'మొదట భయమేసింది, కానీ తర్వాత అందరం చచ్చిపోతాం కదా, ఏముంది' అని సమాధానం చెప్పడంతో షాకయ్య." అని అన్నారు తరుణ్​ భాస్కర్​.

ఇదీ చూడండి: కొడుకు అకీరా కోసం కలిసిన పవన్​కల్యాణ్-​రేణుదేశాయ్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.