ETV Bharat / entertainment

అభిమాని చేసిన పనికి కన్నీరు పెట్టుకున్న తమన్నా.. ఎయిర్​పోర్టులోనే..! - తమన్నా భాటియా సినిమాలు

టాలీవుడ్​ మిల్కీ బ్యూటీ తమన్నా ముంబయి ఎయిర్​పోర్టులో ఎమెషనల్​కు గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. తన అభిమానిని కౌగిలించుకుని ఏడ్చేశారు. అసలేం జరిగిందంటే..

Tamannaah Bhatia gets emotional as fan gets tattoo of her face on hand
'ఫ్యాన్స్​లో ఇలాంటి ఫ్యాన్స్​ వేరయా'.. చేతిపై తమన్నా ముఖం పచ్చబొట్టు ..చూసి అక్కడే ఏడ్చేసిన మిల్కీ బ్యూటీ..!
author img

By

Published : Jun 27, 2023, 4:20 PM IST

Tammanna Tattoo : ఇటు టాలీవుడ్​తో పాటు అటు బాలీవుడ్​లోనూ మంచి క్రేజ్​ ఉన్న హీరోయిన్​లలో తమన్నా భాటియా ఒకరు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఆమె ఫుల్​ బిజీగా గడుపుతోంది. తెలుగులో ప్రస్తుతం చిరంజీవీ హీరోగా రూపొందుతున్న 'భోలా శంకర్​' సినిమాలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్​లోనూ రెండు బోల్డ్​ వెబ్​సిరీస్​లో నటించి ప్రస్తుతం హాట్​టాపిక్​గా మారింది. దీంతో పాటే ఆమె ప్రస్తుతం బాలీవుడ్​ నటుడు విజయ్​ వర్మతో రిలేషన్​లో ఉండటం వల్ల అందరి దృష్టి తమన్నాపై పడింది. దీంతో ఆమె ఎక్కడకి వెళ్లినా అభిమానుల తాకిడి ఎక్కువైంది.

అయితే తాజాగా తమన్నా ముంబయి ఏయిర్​పోర్టులో కనిపించి సందడి చేశారు. ఈ మిల్కీ బ్యూటీని చూసేందుకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్​ అక్కడకు చేరుకున్నారు. విమానాశ్రయంలో తమన్నాను చూసిన అభిమానులు ఒక్కసారైనా ఆమెతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా తమన్నా కొద్దసేపు అక్కడే ఆగి ఫ్యాన్స్​తో ముచ్చటించారు. అలా మాట్లాడుతున్న సమయంలో ఓ మహిళా అభిమాని ఒక్కసారిగా వచ్చి తమన్నా కాళ్లపై పడి దండం పెట్టారు. అంతేకాకుండా తనతో తెచ్చుకున్న ఓ పూలబొకేతో పాటు ఓ గ్రీటింగ్​ కార్డును కూడా తమన్నాకు ప్రెజెంట్​ చేశారు. అయితే ముచ్చటించే సమయంలో అభిమాని.. తన చేతిపై తమన్నా ముఖాన్ని పచ్చబొట్టుగా పొడిపించుకున్న బొమ్మను ఆమెకు చూపించారు. ఈ టాటూ కింది 'లవ్​ యూ తమన్నా' అని రాసి ఉంది.

అది చూసిన మిల్కీ బ్యూటీ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆమెను కౌగిలించుకొని 'థ్యాంక్యూ ఫర్ యువర్​ లవ్​' అంటూ కాసేపు కంటతడి పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోను చూసిన కొందరు అభిమానులు.. ఫ్యాన్స్​తో తమన్నా మెలిగిన తీరును చూసి ప్రశంసిస్తున్నారు. టాటూ వేయించుకున్న అభిమానిని మెచ్చుకుంటున్నారు.

Lust Stories 2 Release Date : ఇటీవలే బాలీవుడ్ ప్రముఖ నిర్మాత దినేశ్​ విజన్​ రూపొందించిన 'జీ కర్దా' అనే వెబ్​ సిరీస్​లో నటించింది తమన్నా. దీనికి అరుణిమా శర్మ దర్శకత్వం వహించారు. ఆషిమ్​ గులాటి, సుహైల్ నయ్యర్, అన్య సింగ్, హుస్సేన్ దలాల్, సయాన్ బెనర్జీ, సంవేద సువాల్కా సహా ఇతర నటీనటులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈనెల 15 నుంచి ఈ వెబ్​ సిరీస్ ప్రైమ్​ వీడీయోలో స్ట్రీమింగ్​ అవుతోంది. ఇక ఆమె నటించిన మరో వెబ్​ సిరీస్​ 'లస్ట్​ స్టోరీస్-2' (హిందీ) ఈనెల 29న విడుదలకు సిద్ధంగా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.