Suriya 43 Glimpse Video : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. దీంతో పాటు సుధ కొంగర దర్శకత్వంలో సూర్య 43 అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సూర్య 43కి సంబంధించిన గ్లింప్స్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. చూడటానికి ఇంట్రెస్టింగ్గా ఉన్న ఆ వీడియోలో సినిమాలో నటించననున్న స్టార్స్ పేర్లు.. సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్.. ఇలా పలు ఎలిమెంట్స్ ఉన్నాయి. అంతే కాకుండా వీడియో లాస్ట్‌లో సినిమా టైటిల్‌ను కూడా కాస్త రివీల్ చేశారు. అయితే తాజాగా ఈ వీడియో ఓ రికార్డును నెలకొల్పింది. దళపతి విజయ్ తన సినిమాకు సంబంధించి ఏడాది క్రితం సామాజిక మాధ్యమం ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసిన ఓ స్పెషల్ వీడియో రికార్డును బద్దలు కొట్టింది.
-
Dear all we are excited! Joining hands with @Sudha_Kongara again in a @gvprakash musical, his 100th! SO looking forward to work with my brother @dulQuer & the talented #Nazriya & the performance champ @MrVijayVarma Glad @2D_ENTPVTLTD is producing this special film! #Jyotika… pic.twitter.com/wW9iu0jMeR
— Suriya Sivakumar (@Suriya_offl) October 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Dear all we are excited! Joining hands with @Sudha_Kongara again in a @gvprakash musical, his 100th! SO looking forward to work with my brother @dulQuer & the talented #Nazriya & the performance champ @MrVijayVarma Glad @2D_ENTPVTLTD is producing this special film! #Jyotika… pic.twitter.com/wW9iu0jMeR
— Suriya Sivakumar (@Suriya_offl) October 26, 2023Dear all we are excited! Joining hands with @Sudha_Kongara again in a @gvprakash musical, his 100th! SO looking forward to work with my brother @dulQuer & the talented #Nazriya & the performance champ @MrVijayVarma Glad @2D_ENTPVTLTD is producing this special film! #Jyotika… pic.twitter.com/wW9iu0jMeR
— Suriya Sivakumar (@Suriya_offl) October 26, 2023
విడుదలైన రెండు వారాల్లోనే..
హీరో సూర్య తన 43వ చిత్రానికి సంబంధించి అక్టోబర్ 26న 'సూర్య 43' వర్కింగ్ టైటిల్‌తో ఓ అనౌన్స్మెంట్ వీడియోను ఎక్స్‌లో(ట్విట్టర్) విడుదల చేశారు. ఈ వీడియోను ఇప్పటికే 26.6(2.66 కోట్లు) మిలియన్ల మంది వీక్షించారు. అయితే ట్విట్టర్లో ఎక్కువ వ్యూస్ దక్కించుకున్న ఇండియన్ వీడియోగా సూర్య వీడియో నిలిచింది. అయితే ఇప్పటి వరకు హీరో దళపతి విజయ్ తన సినిమాకి సంబంధించి గతేడాది డిసెంబర్లో పోస్ట్ చేసిన ఓ వీడియో పేరిట ఈ రికార్డు ఉండేది. ఈ వీడియోకు అప్పట్లో 26.2(2.62 కోట్లు) మిలియన్ వ్యూస్ వచ్చాయి. కానీ, తాజాగా ఆ రికార్డును తిరగరాసింది 'సూర్య 43' అనౌన్స్మెంట్ వీడియో. అది కూడా వీడియో రిలీజ్ అయిన రెండు వారాల్లోనే ఆ రికార్డును అధిగమించింది.
సుధ కొంగర దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో సూర్యతో పాటు దుల్కర్ సల్మాన్, విజయ్ వర్మ వంటి అగ్ర నటులు కూడా నటిస్తున్నారు. ఈ ముగ్గురు కలిసి సిల్వర్ స్క్రీన్‌పై సరికొత్త రికార్డ్స్‌ను సృష్టించడం మాత్రం 'సూర్య 43' స్పెషల్ వీడియోను చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది.
Kanguva Movie Latest Update : హీరో సూర్య ప్రస్తుతం పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'కంగువ' మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను శివ డైరెక్ట్ చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సూరారై పొట్రు (తెలుగులో ఆకాశమే నీ హద్దురా) నేషనల్ అవార్డును కూడా గెలుచుకుంది. దీంతో మరోసారి వీరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో 'కంగువ'పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లింప్స్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇటీవలే థాయ్‌లాండ్‌లో ప్రధాన షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది 'కంగువ'. ప్రస్తుతం చెన్నైలో ఫైనల్ షెడ్యూల్‌కు సంబంధించి సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నారు. ఇక్కడ వార్ సీక్వెన్స్‌ను షూట్ చేయబోతున్నట్లు సమాచారం. చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో గురువారం ఫైనల్ షెడ్యూల్ పనులు కూడా షురూ అయ్యాయి.
మరోవైపు 'లియో' మూవీతో మరో సూపర్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నారు దళపతి విజయ్. ప్రస్తుతం 'దళపతి 68' ప్రాజెక్ట్ షూటింగ్లో బిజీగా గడుపుతున్నారు. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తోంది.
గోల్డ్ కలర్ శారీలో మాళవిక షైనింగ్ - ఫొటోస్ చూశారా?
కాటుక కళ్లతో మతిపోగొడుతున్న మీనాక్షి - చూపు తిప్పనివ్వట్లేదుగా!