ETV Bharat / entertainment

జాన్వీ హోమ్​ టూర్​.. అతిలోక సుందరి శ్రీదేవి ఇంద్రభవనాన్ని చూశారా? - జాన్వీ కపూర్​ హోమ్​​ టూర్​

అతిలోక సుందరి అలానిట అందాల తార శ్రీదేవి తొలి ప్రాపర్టీని హూమ్​ టూర్​ పేరుతో పంచుకుంది ఆమె కూతురు హీరోయిన్​ జాన్వీ కపూర్​. ఆ వీడియోను మీరు చూసేయండి..

Sridevi Janvikapoor Home tour
అతిలోక సుందరి శ్రీదేవి ఇంద్రభవనం చూశారా
author img

By

Published : Nov 17, 2022, 6:45 PM IST

అతిలోక సుందరిగా అల‌నాటి అందాల తార శ్రీదేవి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. టాలీవుడ్​ టు బాలీవుడ్​.. భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.

ఆమె ఎంతో ఇష్టపడి చెన్నైలో కట్టించుకున్న ఇంటిని తన కూతురు, నటి జాన్వీకపూర్‌ అభిమానులకు చూపించింది. 'హోమ్‌టూర్‌'లో భాగంగా ఆ ఇంటి జ్ఞాపకాలను పంచుకుంది. ఆ గృహమే శ్రీదేవి తొలి ప్రాపర్టీ అని, ఎంతో ప్రేమతో దాన్ని నిర్మించుకున్నట్టు చెప్పింది. లాక్‌డౌన్‌ సమయంలో తన సోదరి ఖుషి కపూర్‌ పుట్టినరోజు వేడుకలు ఆ ఇంట్లోనే చేసినట్టు తెలిపింది.

బెడ్‌రూమ్‌, డైనింగ్‌ హాల్‌, సీక్రెట్‌ రూమ్‌, టీవీ రూమ్‌, బాత్‌రూమ్‌, జిమ్‌.. ఇలా ప్రతిదాన్ని చూపిస్తూ జాన్వీ నాటి రోజుల్లోకి వెళ్లింది. ఖుషి కపూర్‌తో ఎక్కువ సమయం టీవీ రూమ్‌లోనే గడిపానని చెప్పింది. తమకు పెయింటింగ్స్‌ వేయడం చాలా ఇష్టమని చెబుతూ వాటిని చూపించింది. బెడ్‌రూమ్‌ దెబ్బతినగా ఇటీవల దానికి మరమ్మతలు చేయించినట్టు తెలిపింది. ఆ ఇంటి మొత్తంలో తనకు బాత్‌రూమ్‌ ఫేవరెట్‌ అని, ఇప్పటికీ ఆ రూమ్‌ డోర్‌కి లాక్‌ ఉండదని చిరునవ్వు చిందించింది. ఆ ఇంట్లోనే జాన్వీ తండ్రి, ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌ ఆఫీసు ఉంది. ఆ ఇంటి గోడలపై ఉన్న శ్రీదేవి, బోనీకపూర్‌ల చిన్ననాటి ఫొటోలు, వారి పెళ్లి ఫొటోలు, విహార యాత్రలకు సంబంధించిన ఫొటోలు, ఎన్నో అపురూపమైన పెయింటిగ్స్‌ను ఈ వీడియోలో చూడొచ్చు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: Krishna: తాత కోసం అమెరికా నుంచి వచ్చిన పెద్ద మనవడు.. చివరి చూపు దక్కలేక ఆవేదన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.