టాలీవుడ్ యువ హీరో రామ్ పోతినేని మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమం ఇటీవలే జరిగింది. శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే రామ్‌కు జోడీగా ఎవరు కనబడబోతున్నారన్న విషయంపై చాలా వార్తలు వచ్చాయి. వీటన్నింటికీ తెరతీస్తూ చిత్ర యూనిట్ హీరోయిన్ను ప్రకటించింది.
దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో.. ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ తనుయుడు నటించిన 'పెళ్లి సందడి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్రీలీల. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సుందరినే ఇప్పుడు రామ్ 20వ చిత్రంలో హీరోయిన్గా ఎంపిక చేశారు. ఈ మేరకు శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ సంస్థ ట్వీట్ చేసింది. ఈ సినిమాకు ఇంకా పేరు ఖరారు కాలేదు. కానీ 'బోయపాటి ర్యాపో' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ స్వరాలు సమకూర్చుతున్నారు. అయితే ఈ సినిమాలో ఉన్న నటీనటుల వివరాలు వెల్లడించలేదు. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్నట్టు సమాచారం.
అల్లరి నరేశ్.. 'లచ్చిమీ లచ్చిమీ' పాట..
తెలుగు ప్రముఖ నటుడు అల్లరి నరేశ్ నటిస్తున్న చిత్రం 'ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం'. ఈ చిత్రంలోని మొదటి పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్. 'లచ్చిమీ లచ్చిమీ' అంటూ సాగే ఈ పాట అద్భుతంగా ఉంది. జావేద్ అలీ గాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
వరుస ఫ్లాపుల తర్వాత నరేశ్ కాస్త రూటు మార్చారు. ఇంతకముందు విడుదలైన 'నాంది'తో మంచి విజయం అందుకున్నారు. దీంతో అలాంటి వైవిధ్యమైన కథల్ని ఎంచుకుంటున్నారు. నరేశ్ 59వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే టీజర్ విడుదలైంది. ప్రముఖ హాస్యనటుడు వెన్నెల కిశోర్ కూడా ప్రముఖ ప్రాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజేశ్ దండ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల స్వరాలందిస్తున్నారు.
ఇవీ చదవండి: ఘనంగా గుడ్డూ భయ్యా వివాహ వేడుక.. రిసెప్షన్లో తాప్సీ, టబు, ఈషా సందడే సందడి!
'ఆదిపురుష్ తీసింది వారి కోసం కాదు!'.. ట్రోల్స్‌పై దర్శకుడి కౌంటర్