ETV Bharat / entertainment

మరో సినిమాకు మాస్​ మహారాజా గ్రీన్​ సిగ్నల్​!.. హిట్​ ఇచ్చిన డైరెక్టర్​తోనే!! - సంపత్​ నంది సినిమాలు

వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు మాస్​ మహరాజా రవితేజ సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన తదుపరి చిత్రం కూడా కన్ఫార్మ్​ అయినట్లు సమాచారం. తనకు ఇదివరకే ఓ హిట్ ఇచ్చిన డైరెక్టర్​తో మరోసారి జట్టు కట్టేందుకు రవితేజ రెడీ అయ్యారని తెలుస్తోంది.

ravi teja sampath nandi movie
ravi teja sampath nandi movie
author img

By

Published : Dec 5, 2022, 5:04 PM IST

మాస్​ మహారాజా రవితేజ​ వరుస సినిమాలతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. ఓ డైరెక్టర్​తో మరోసారి జట్టుకట్టడానికి రెడీ అవుతున్నారు. ఇంతకముందు తనకు 'బెంగాల్​ టైగర్​'తో హిట్​ ఇచ్చిన దర్శకుడు సంపత్​ నందితో వచ్చే ఏడాది ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. రీసెంట్​గా రవితేజకు సంపత్ నంది కథ చెప్పారని.. దానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని టాక్​ నడుస్తోంది. అయితే ఈ విషయం గురించి సంపత్​గాని, రవితేజ గాని స్పందించలేదు.

కాగా, డైరెక్టర్ సంపత్ నంది-రవితేజ కలయికలో ఇప్పటికే 'బెంగాల్ టైగర్' చిత్రం వచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. మరి రవితేజ ఇమేజ్ కోసం సంపత్ నంది ఈసారి ఎలాంటి కథ రాశారో చూడాలి. అయితే ఇలాంటి కథతోనే సంపత్ నంది.. గోపీచంద్​తో సినిమా చేయబోతున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ మాస్​ మహారాజా అయితేనే తన కథకు పూర్తి న్యాయం జరుగుతుందని సంపత్ నంది భావించారట. అందుకే.. రవితేజతో సినిమా స్టార్ట్ చేయబోతున్నట్లు సనీ వర్గాల్లో టాక్​ నడుస్తోంది.

ప్రస్తుతం రవితేజ నటించిన మూడు సినిమాలు త్వరలో విడుదల కానున్నాయి. మెగాస్టార్​ చిరంజీవి మాస్​ ఎంటర్​టైనర్​ 'వాల్తేరు వీరయ్య' సినిమాలో రవితేజ నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి పండగకు విడుదలవుతోంది. దీంతో పాటు రవితేజ మరో చిత్రం 'ధమాకా' డిసెంబర్​ 23న విడుదల కాబోతోంది. ఇందులో శ్రీలీల కథానాయిక. మాస్​ మహారాజా మరో చిత్రం 'రావణాసుర' వచ్చే ఏడాది వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇవీ చదవండి : పూజిత పొన్నాడ సిల్వర్ స్క్రీన్​పై గోల్డ్ షైన్

ఒకే రోజు థియేటర్‌లో 17 మూవీస్​ రిలీజ్ మరి ఓటీటీలో ఎన్నంటే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.