ETV Bharat / entertainment

అమ్మ, రాధికా ఆంటీతో నన్ను చూసి నాన్న షాకయ్యారు : వరలక్ష్మీ శరత్​కుమార్ - వరలక్ష్మీ శరత్​కుమార్ తండ్రి పేరు

లేడీ విలన్‌ అంటే ఈ మధ్య కాలంలో బాగా గుర్తొచ్చే పేరు వరలక్ష్మీ శరత్‌కుమార్‌. గంభీరమైన గొంతుతో, కరుకైన మాటలతో, భయపెట్టే హావభావాలతో హీరోలకు దీటుగా నటిస్తున్న ఈ నటి- ఆఫ్‌స్క్రీన్‌లో అల్లరి అమ్మాయి. సమస్యల్లో ఉన్నవాళ్లకి అండగా నిలబడే అసలైన హీరో. అటు నటనలోనూ, ఇటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ దూసుకుపోతున్న వరలక్ష్మిని పలకరిస్తే ఆమె మనసులోని జ్ఞాపకాలను ఇలా పంచుకుంది.

tamil fame varalaxmi sarathkumar
tamil fame varalaxmi sarathkumar
author img

By

Published : Nov 13, 2022, 10:29 AM IST

తెర మీద నన్ను చూసిన చాలామంది "మీరు బయట కూడా సీరియస్‌గానే ఉంటారా.." అని అడుగుతుంటారు. నిజానికి నేను చాలా సరదా మనిషిని. కానీ, నేను చేసే విలన్‌ పాత్రల వల్ల అందరూ సీరియస్‌ పర్సన్‌ని అనుకుంటున్నారు. ఆన్‌స్క్రీన్‌ వరలక్ష్మి గురించి తెలిసిన మీకు.. తెర వెనక వరూ ఎలా ఉంటుందో చెబుతా..

పుట్టి పెరిగింది చెన్నైలోనే. నాకు ఊహ తెలిసేప్పటికే అమ్మానాన్నలు విడిపోయారు. మా అమ్మ ఛాయ.. అవమానాలూ, ఆర్థిక సమస్యలూ ఎదుర్కొంటూనే నన్నూ, చెల్లినీ పెంచింది. అయినా ఎప్పుడూ భయపడలేదు, బాధపడలేదు. మాకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని ఆశపడేది. కొన్నాళ్లకు ఇంటీరియర్‌ డిజైనింగ్‌ సంస్థను ప్రారంభించి మంచి పేరు తెచ్చుకుంది. పైగా మగవారితో పనిచేయించడం, గంటలు గంటలు తానూ కష్టపడటం నాకు ఎంతో అబ్బురంగా అనిపించేది. అయితే తనకి మేం సినిమాలు చూడటం ఇష్టముండేది కాదు.

tamil fame varalaxmi sarathkumar
వరలక్ష్మి శరత్​కుమార్, నటి

పదమూడు, పద్నాలుగేళ్లు వచ్చే వరకూ కార్టూన్‌ షోలకే అనుమతిచ్చేది. నాన్న సినిమాలు కూడా నేను ఓ పదికి మించి చూడలేదు. అయితే సినిమా ప్రపంచానికి దూరంగా పెరిగిన నాకు డాన్స్‌ అంటే పిచ్చి అనే చెప్పాలి. అమ్మ భరతనాట్యం నేర్పించింది. నా ఆసక్తి కొద్దీ బాలే, వాల్ట్‌, సల్సా, హిప్‌హాప్‌ వంటివన్నీ నేర్చుకున్నా. బాలే, సల్సాల్లో గోల్డ్‌ మెడల్‌ కూడా అందుకున్నా.

tamil fame varalaxmi sarathkumar
వరలక్ష్మి శరత్​కుమార్, నటి

కాలేజీకి వెళ్లాక రంగస్థలం వైపు మనసు మళ్లింది. చదువుకంటే నాటకాలకే ప్రాధాన్యమిచ్చేదాన్ని. అలా డిగ్రీ పూర్తి చేశాక ఎంబీఏ చదవడానికి స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర యూనివర్సిటీకి వెళ్లా. అక్కడ చదువుకుంటున్నప్పుడే ఓ కార్పొరేట్‌ సంస్థలో ఉద్యోగమొచ్చింది. ఇక అదే నా భవిష్యత్తు అని ఫిక్సైపోయా. తీరా చదువు పూర్తై ఉద్యోగంలో చేరదామనుకునేటప్పుడు... "నువ్వు దూరంగా ఉండటం నాకు నచ్చట్లేదు. చదువు కోసం తప్పలేదు కానీ, నా దగ్గరే ఉండి ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు. ఇండియాకి వచ్చెయ్‌" అంది అమ్మ. అయిష్టంగానే ఇంటికొచ్చా. కొన్నాళ్లు అమ్మ నడిపే ఇంటీరియర్‌ డిజైనింగ్‌ సంస్థలోనే పనిచేశా. అప్పుడే అనిపించింది ఇలాంటి ఉద్యోగాలు మన వల్ల కాదనీ, అందుకు నేను సెట్‌కాననీ. క్రమంగా నేనేం చేయగలనూ, ఏ రంగం నాకు బాగుంటుందీ అని ఆలోచించడం మొదలుపెట్టా. చివరికి నాకు డాన్స్‌ పట్ల అంతర్లీనంగా ఉన్న ఇష్టం నన్ను సినిమాల వైపు వెళ్లేలా చేసింది. నాకో స్పష్టత తెచ్చి పెట్టింది.

tamil fame varalaxmi sarathkumar
వరలక్ష్మి శరత్​కుమార్, నటి

నాన్న నో అన్నారు
టీనేజీకొచ్చాక అమ్మానాన్నలు ఎందుకు విడిపోయారో అర్థమైంది. వాళ్ల నిర్ణయాన్ని గౌరవించాలని నేనూ, చెల్లీ అనుకున్నాం. అమ్మతోపాటు నాన్ననీ అర్థం చేసుకోవడం మొదలుపెట్టాం. అందుకే సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాక మొదట నాన్నకే చెప్పా. కానీ, ఆయన వద్దన్నారు. కాదు.. కాదు.. భయపడ్డారు. సినీరంగంలోని ఒడుదొడుకుల్ని తట్టుకునే శక్తి నాకుందో లేదోనని తండ్రిగా ఆయన ఆలోచించారు. అమ్మ నా ఇష్టాన్ని కాదనలేదు. నాన్న ఒప్పుకోవట్లేదని తనతో చెబితే వెంటనే నటి రాధిక ఆంటీకి ఫోన్‌ చేసి విషయం చెప్పింది.

నాన్న రాధిక ఆంటీని పెళ్లి చేసుకున్నాక అమ్మ తనతో మొదటిసారి మాట్లాడటం అప్పుడే. "వరూ కోరుకుంటే మనం తనని ప్రోత్సహించాల్సిందే. మీ ఇద్దరూ బయల్దేరి రండి... ఆయనతో మాట్లాడదాం" అని ఆంటీ అనడంతో షూటింగ్‌లో ఉన్న నాన్న దగ్గరకు ముగ్గురం వెళ్లాం. మా ముగ్గుర్నీ చూసిన నాన్న షాక్‌ అయ్యారు. అమ్మా, ఆంటీ ఒక్కటైపోయి నాన్నని ఒప్పించి ఆయన భయాలన్నీ పోగొట్టారు. "ఆడవాళ్లంతా ఒక్కటయ్యాక నేను మాత్రం నో ఎలా చెప్పగలను" అంటూ నాన్న కూడా నేను సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్నారు. ముంబయి వెళ్లి అనుపమ్‌ఖేర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణకు చేరా.

కొన్నిరోజుల తరవాత ఆయన మా నాన్నకు ఫోన్‌ చేసి "మీ అమ్మాయి అద్భుతంగా నటిస్తుంది. నాకు తన భవిష్యత్తు కనిపిస్తోంది. మీరూ ప్రోత్సహించండి" అని చెప్పారు. ఆ మాటలకు నాన్నకు సంతోషం కలిగింది. నాలోనేమో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇదిలా ఉంటే... ఫేస్‌బుక్‌లో నా ఫొటోని ముంబయిలోని ఓ నిర్మాత భార్య చూశారట. వాళ్లకి తెలిసినవాళ్లు తమిళంలో సినిమా తీస్తున్నారని ఆమె నన్ను సంప్రదించారు. అలా నాకు 2012లో 'పోడా పోడి' అనే సినిమాలో మొదటి అవకాశం వచ్చింది. నన్ను నేను తెరపైన చూసుకున్నాక నటిగా నేను పనికొస్తాను అనే ధైర్యం కలిగింది. కథ వినడం, నా పాత్ర ఏంటో తెలుసుకోవడం వంద శాతం అందుకు తగ్గట్టు నటించడం... మొదలుపెట్టా. కానీ, దాదాపు నాలుగేళ్ల పాటు సరైన అవకాశాలు రాలేదు. అలాగని నాన్న రికమండేషన్లు కూడా నాకు నచ్చవు.

2016లో అనుకుంటా, మలయాళంలో 'కసబా' అనే సినిమాలో నెగెటివ్‌ రోల్‌ చేశా. ఒకరకంగా అది సాహసమే. హీరోయిన్‌గా చేస్తూ నెగెటివ్‌ పాత్ర ఒప్పుకోవడం వల్ల కెరీర్‌కి నష్టం జరుగుతుందేమోనని చాలామంది అనుకున్నారు. కానీ, నేను నా నటనని నమ్ముకున్నా. హీరోయిన్‌ అవ్వాలి, స్టార్‌డమ్‌ రావాలి అని ఎప్పుడూ అనుకోలేదు. ఛాలెంజింగ్‌గా, నటిగా సంతృప్తి కలిగించే ఏ పాత్ర అయినా చేయాలనే లక్ష్యం పెట్టుకున్నా. ఆ సినిమా విడుదలయ్యాక దాదాపు అటువంటి పాత్రలే వరస కట్టాయి. తెలుగులో 'పందెం కోడి2' నా మొదటి సినిమా, ఆ తరవాత 'సర్కార్‌'లో కోమలవల్లి పాత్ర కూడా బాగా పేరు తెచ్చిపెట్టింది. 'మారి2'లోనూ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

అందుకు ఒప్పుకోలేదు
2019లో వచ్చిన 'తెనాలి రామకృష్ణ' నేను నేరుగా తెలుగులో నటించిన సినిమా. అల్లరి నరేశ్‌ 'నాంది'లో మాత్రం పాజిటివ్‌ పాత్ర. లాయర్‌ ఆద్యగా నేను చేసిన ఆ పాత్ర ఎప్పటికీ నా ఫేవరెట్‌. నేను చాలా బాగా నటించానని ఫీలైన సినిమా అదే. అంతేకాదు, ఈ సినిమాలో నాకు మరో అనుభవం కూడా ఉంది. సాధారణంగా నా సినిమాలకు నేను డబ్బింగ్‌ చెప్పుకుంటా. నా హావభావాలకు మరొకరి గొంతును జత చేయడం నచ్చదు. పైగా నేను సినిమా రంగంలోకి వచ్చిన కొత్తల్లో చాలామంది "నీది మగాడి గొంతులా ఉంది" అన్నారు. మరికొందరేమో అసలు హీరోయిన్‌కి ఉండాల్సిన వాయిస్‌ కాదన్నారు. అందుకే నా పాత్రలకు నేనే డబ్బింగ్‌ చెప్పాలని నిర్ణయించుకున్నా.

'పందెం కోడి2' నుంచి తెలుగు రాకపోయినా యాసగా ఉన్నా నేనే డబ్బింగ్‌ చెప్పుకుంటున్నా. 'నాంది'కి మాత్రం నాతో చెప్పించకుండానే వేరే వాళ్లతో చెప్పించి ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. అది చూసి షాక్‌ అయ్యా. పైగా ప్రేక్షకులు కూడా "వరూకి తన గొంతే సూట్‌ అవుతుంది" అంటూ కామెంట్లు పెట్టారు యూట్యూబ్‌లో. దాంతో నేనే డబ్బింగ్‌ చెప్పుకుంటానన్నా. అందులో లాయర్‌గా కష్టమైన సంభాషణలు ఉంటాయి.. పలకడం కష్టమన్నారు. నేను ఒప్పుకోలేదు. "మూడు రోజులు టైమివ్వండి. నేనే డబ్బింగ్‌ చెప్పుకుంటా. దాన్ని ఓ పదిమందికి వినిపించండి. వాళ్లలో ఏ ఒక్కరు బాలేదన్నా... వేరే వాళ్ల డబ్బింగ్‌తోనే సినిమా విడుదల చేయండి" అని చెప్పా.

ఓపిగ్గా సాధన చేసి నాలుగు రోజులు డబ్బింగ్‌ చెప్పా. అంతా అయ్యాక "మీరు చెప్పిందే బాగుంది. చెప్పలేరేమోనని పొరపాటు పడ్డా" అన్నారు దర్శకుడు. చాలామంది ప్రేక్షకులు నా నటనతోపాటు గంభీరంగా ఉండే నా గొంతునూ ఆదరించారు. అది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది. అలానే బాలయ్య 'వీరసింహారెడ్డి'లోనూ ఐదు పేజీల డైలాగు ఉంది ఒక సీన్‌లో. అది పూర్తి చేయడానికి మూడురోజులు పడుతుందని నా కాల్షీట్లు తీసుకున్నారు. నేను ఒక్క పూటలోనే ఆ సీన్‌ చేసేశా. ఒక్కసారి వింటే పక్కాగా గుర్తుపెట్టుకోవడం నాకు చిన్నప్పట్నుంచీ అలవాటు. ఇప్పుడు అదే నాకు టేకులు తీసుకోకుండా పనికొస్తోంది.

బరువు తగ్గాల్సొచ్చింది
'క్రాక్‌' విడుదలయ్యాక చాలామంది నన్ను 'జయమ్మ' అనే పిలుస్తున్నారు. కథ వినగానే నచ్చి ఓకే చెప్పా. ఆ గెటప్‌, మాట తీరు భలేగా ఉంటాయి. అందుకే ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయింది. ఇక 'పక్కా కమర్షియల్‌'లోనూ చిన్న పాత్ర చేశా. 'యశోద' సినిమా కథ విని షాక్‌ అయ్యా. సరోగసీ విషయంలో నాకు తెలియంది చాలా ఉందని కథ విన్నాకే అర్థమైంది. అసలు ఇలాంటి కథ ఎలా రాశారబ్బా అనుకున్నా. ఈ సినిమా సమాజానికి మంచి సందేశాన్నిస్తుంది అనిపించింది. ఫెర్టిలిటీ సెంటర్‌ హెడ్‌గా నటించిన ఈ సినిమాలో ఫ్లాష్‌ బ్యాక్‌ సీన్స్‌ కోసం నేను బరువు తగ్గాల్సి వచ్చింది. ఐదు నెలల్లో దాదాపు పదిహేను కేజీలు తగ్గా. 'వీరసింహారెడ్డి'లోనూ ఓ ఫ్లాష్‌బ్యాక్‌ సీన్‌ ఉంది.

ఈ సినిమా కోసమూ సన్నబడాల్సి వచ్చింది. ఇన్నాళ్లూ తెర మీద కాస్త బొద్దుగా కనిపించిన నేను ఇప్పుడు స్లిమ్‌గా మారిపోయా. ప్రస్తుతం నా చేతిలో ఉన్న ఎనిమిది సినిమాల్లో- 'హనుమాన్‌', 'వీరసింహారెడ్డి', 'శబరి' తెలుగు సినిమాలు. నన్ను దృష్టిలో పెట్టుకుని కథలు రాస్తున్నామని తెలుగు దర్శకులు చెప్పడం నాకు పెద్ద కాంప్లిమెంట్‌.

వరలక్ష్మి శరత్​కుమార్, నటి

రాజకీయాల్లోకి వస్తా.. :
నేను ఆరాధించే వ్యక్తి జయలలిత అమ్మ. ఎప్పటికైనా రాజకీయాల్లోకి రావాలనేది నా కోరిక.

  • నాన్న నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నా. సెట్‌కి కూడా టైమ్‌కి వెళ్లడం అలవర్చుకున్నా.
  • నాకు షార్ట్‌టెంపర్‌. నాకళ్ల ముందు తప్పు జరిగితే అస్సలు ఊర్కోను.
  • తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఫ్రెంచ్‌, జర్మన్‌, స్పానిష్‌... అన్నీ మాట్లాడగలను. నాకు పర్యటనలంటే చాలా ఇష్టం. ఏ కొత్త ప్రాంతానికి వెళ్లినా అక్కడి భాషలు నేర్చేసుకోవడం అలవాటు.
  • రాజకుమారి, పోరాటయోధుల పాత్రల్లో నటించాలనుంది.
  • షూటింగ్‌ లేకపోతే ఇంట్లో ఉండి మా పప్పీతో ఆడుకుంటా.
వరలక్ష్మి శరత్​కుమార్, నటి

న్యాయం చేస్తాం..
నా చిన్నతనంలో లైంగికదాడికి గురయ్యా. అమ్మానాన్నలతో ఆ విషయం చెప్పాలో కూడదో తెలియని వయసు అప్పట్లో నాది. చాలా భయపడిపోయా. అలానే నేను హీరోయినయ్యాక ఓ టీవీ అధినేత అన్యాపదేశంగా 'నాతో గడుపుతావా' అన్నాడు. 'పోరా బయటకు' అని చేయి చేసుకోబోయా. ఆడపిల్లగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న నేను పిల్లలకు గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ గురించి చెప్పమని తల్లిదండ్రుల్ని కోరుతున్నా. మన దగ్గర చాలామంది పెద్దవాళ్లు పిల్లల దగ్గర అలాంటి విషయాలు ఇప్పటికీ మాట్లాడట్లేదు.

అందుకే నాకు జరిగింది చెబితే అయినా వాళ్ల పిల్లలకు అవగాహన కల్పిస్తారని బయటకు చెబుతున్నా. అంతేకాదు, చెన్నైలో 'సేవ్‌శక్తి' పేరిట ఎన్జీవోను స్థాపించి గృహహింస- అత్యాచార బాధితుల కోసం పోరాడుతున్నా. లాయర్లను పెట్టి వారి తరపున కేసులు వేయించి న్యాయం జరిగేలా చూస్తున్నా. దాంతోపాటు వారికి ఉద్యోగాలు ఇప్పించి భవిష్యత్తుకు బాసటగా నిలుస్తున్నా. జంతుసంరక్షణలో భాగంగా చెన్నైలోని మూడు వేల కుక్కలకు ప్రతిరోజూ ఆహారం అందిస్తున్నా. మానసిక ఆందోళనలు ఉన్నవారికి నిపుణుల సేవలూ అందుబాటులో ఉంచుతున్నా. అమ్మ చేత వ్యాపారాలన్నీ మాన్పించి ఎన్జీవో బాధ్యత తన చేతిలో పెట్టా. సౌత్‌ ఇండియా నలుమూలల్నుంచీ ఎవరు సాయం కోసం వచ్చినా మా స్వచ్ఛంద సంస్థ ద్వారా వారికి న్యాయం జరిగేవరకూ వెన్నంటే ఉంటాం.

ఇవీ చవదండి : 'పొద‌ల మాటున శానిట‌రీ ప్యాడ్లు మార్చుకునేవాళ్లం'.. క‌ష్టాలు గుర్తుచేసుకున్న జ‌య

ఆసక్తిగా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ట్రైలర్​.. ఫన్నీగా 'నేను స్టూడెంట్​ సర్' టీజర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.