ఎన్టీఆర్.. ప్రేక్షకులకు వెండితెర ఇలవేల్పు. థియేటర్లలో తెరపై కనిపిస్తే జనం హారతులు పట్టేవారు. చేతులెత్తి మొక్కేవారు. ఇళ్లలో దేవుడి గదిలో ఆయన ఫొటోలు పెట్టుకునేవారు. ఆయన పట్ల భక్తిభావంతో ఉండే ప్రేక్షకులు.. ఒక సినిమా నుంచి మాత్రం ఎన్టీఆర్‌ను మరో కోణంలో చూశారు. ఆ సినిమానే 'అడవిరాముడు'. అప్పటి వరకు అక్కినేని నాగేశ్వరరావు డ్యాన్స్‌లతో అదరగొట్టేవారు. ఆయన డ్యాన్సులకు ఫిదా అయిపోయేవారు ప్రేక్షకులు. అయితే ఎన్టీఆర్ మాత్రం అప్పటి వరకు ఎందుకో స్టెప్పుల జోలికే పోలేదు. ఎక్స్‌ప్రెషన్స్‌తోనే మెస్మరైజ్ చేసేవారు.
అయితే అడవిరాముడు సినిమాలో మాత్రం ఎన్టీఆర్‌ను కొత్తగా చూపించారు దర్శకుడు రాఘవేంద్రరావు. అందులో ఎన్టీఆర్‌కు అదిరిపోయే డ్యూయెట్లను పెట్టారు. ఆ పాటలకు ప్రేక్షకులు ఊగిపోయారు. అప్పటివరకు ఎన్టీఆర్ తెరపై కనిపిస్తే.. హారతులు ఇచ్చి.. పూల చల్లే ప్రేక్షకులు.. డబ్బులు చల్లారు. థియేటర్లను మోతెక్కించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఆ సినిమాలో ఎన్టీఆర్‌కు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడారు. ఇందులోని సాంగ్స్ సూపర్ హిట్‌గా నిలిచాయి. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్-బాలు కాంబినేషన్లో వచ్చిన పాటలు వేరే లెవల్ అనే చెప్పాలి. ఎన్టీఆర్ పాటలకు బాలు స్పెషల్ ఎఫెక్ట్స్ ఇచ్చి పాడేవారు. మాస్ బీట్ ఉన్న పదాలను మధ్య మధ్యలో బాలు సొంతంగా జత చేసేవారట.
అది ఎన్టీఆర్‌కు నచ్చి.. ప్రతి పాటలో అలాంటి జోష్ వచ్చే పదాలను వాడాలని అడిగేవారట. అందుకే ఆడవిరాముడు తర్వాత వచ్చిన యమదొంగ, కేడీ నం1, డ్రైవర్‌రాముడు లాంటి అనేక సినిమాల్లో సాంగ్స్ ఫుల్ జోష్‌తో ఉంటాయి. ఆ పాటలకు థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు వచ్చేవి. అందులో చాలా వరకు ఇప్పటికీ పాడుకునే పాటలు ఉన్నాయి.
వేటగాడు సినిమాలోని 'పుట్టింటోళ్లు తరిమేశారు', 'ఆకు చాటు పిందె తడిసే'.. గజదొంగ సినిమాలోని 'నీ ఇల్లు బంగారం కానూ'.. డ్రైవర్‌రాముడు సినిమాలోని 'గు.. గు.. గు.. గు.. గుడిసుంది'.. సర్దార్ పాపారాయుడు సినిమాలోని 'తెల్లచీర- కల్ల కాటుక'.. ఇలా ఎన్నో పాటలు ఎస్పీ బాలు- ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చినవే. ఆ పాటలకు ఎంతలా మోతెక్కేవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇలా స్పెషల్ ఎఫెక్ట్స్‌తో పాడటం జనాలకు కూడా నచ్చడం వల్ల ఎస్పీ బాలు.. ప్రతిపాటను మరింత ఉత్సాహంగా పాడేవారట. ఎన్టీఆర్‌కు పాడే పాటలకు.. 'ఇనుప లవ్' సాంగ్స్ అనే పేరు కూడా పెట్టుకున్నారు బాలు. ఈ విషయాన్ని 'స్వరాభిషేకం' కార్యక్రమంలో ఒకసారి గుర్తు చేసుకున్నారు బాలు. ఎన్టీఆర్ కోసం సలీమ్ మాస్టర్ ప్రత్యేకంగా స్టెప్పులను కొరియోగ్రఫీ చేసేవారు.
ఇదీ చదవండి: ఇప్పటికీ.. ఎప్పటికీ.. ఆ పాత్రలంటే గుర్తొచ్చేది ఎన్టీఆరే!