Skanda Movie Song : టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని - యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'స్కంద'. అయితే ఇప్పటికే రిలీజైన ఫస్ట్ గ్లింప్స్, తొలి పాట ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కాగా ఈ సినిమా నుంచి 'గండరబాయి' అనే పాటను మూవీమేకర్స్ శుక్రవారం విడుదల చేశారు. ఈ పాటకు హీరో రామ్‌తో పోటీపడి మరీ హీరోయిన్ శ్రీలీల ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ చేసింది. ఈ వీడియో చూసిన ప్రేక్షకులు.. ఇద్దరి జోడీ అదిరిందంటూ కామెంట్లు పెడుతున్నారు.
Skanda Movie Cast : ఇక సినిమా విషయానికొస్తే.. 'అఖండ' తో ఫుల్ జోష్‌లో ఉన్న దర్శకుడు బోయపాటి.. ఈ సినిమాను కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇక మరోసారి తమన్.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదరగొడితే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఎడిటర్‌గా తమ్మిరాజు వ్యవహరించగా.. సంతోష్ డిటాకే కెమెరా బాధ్యతలు తీసుకున్నారు. కాగా ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్ర్కీన్ పతాకంపై చిట్టూరి శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. వినాయకచవితి సందర్భంగా 'స్కంద' సినిమా సెప్టెంబర్ 15న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
-
Mass Dhamakedhar Folklore Fever Takes Over!🤩🔥#Gandarabai trending 🔝 in India on @ X 😍🕺💃
— Srinivasaa Silver Screen (@SS_Screens) August 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
- https://t.co/rYckaGmYWX
A @MusicThaman Musical BLAST🔥#SkandaOnSep15 #RAPOMass
Ustaad @ramsayz @sreeleela14 #BoyapatiSreenu @srinivasaaoffl @SS_Screens @detakesantosh… pic.twitter.com/YPgGaw8GXw
">Mass Dhamakedhar Folklore Fever Takes Over!🤩🔥#Gandarabai trending 🔝 in India on @ X 😍🕺💃
— Srinivasaa Silver Screen (@SS_Screens) August 18, 2023
- https://t.co/rYckaGmYWX
A @MusicThaman Musical BLAST🔥#SkandaOnSep15 #RAPOMass
Ustaad @ramsayz @sreeleela14 #BoyapatiSreenu @srinivasaaoffl @SS_Screens @detakesantosh… pic.twitter.com/YPgGaw8GXwMass Dhamakedhar Folklore Fever Takes Over!🤩🔥#Gandarabai trending 🔝 in India on @ X 😍🕺💃
— Srinivasaa Silver Screen (@SS_Screens) August 18, 2023
- https://t.co/rYckaGmYWX
A @MusicThaman Musical BLAST🔥#SkandaOnSep15 #RAPOMass
Ustaad @ramsayz @sreeleela14 #BoyapatiSreenu @srinivasaaoffl @SS_Screens @detakesantosh… pic.twitter.com/YPgGaw8GXw
Ram Double Ismart : హీరో రామ్ నటించిన 'రెడ్', 'ది వారియర్' సినిమాలు డిజాస్టర్‌గా నిలవడం వల్ల.. కెరీర్లో మళ్లీ సక్సెస్ బాట పట్టాలని ఆశిస్తున్నాడు. కాగా ఈ సినిమా తర్వాత.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'డబుల్ ఇస్మాట్' సినిమా చేయనున్నారు. 2019లో బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన 'ఇస్మాట్ శంకర్' సీక్వెల్‌గా సినిమా తెరకెక్కనుంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్,నటి ఛార్మి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Actress Sreeleela Movies : మరోవైపు హీరోయిన్ శ్రీలీల సైతం వరుస ప్రాజెక్టులతో కెరీర్లో దూసుకుపోతుంది. ప్రస్తుతం రామ్ స్కందతో పాటు.. నందమూరి బాలకృష్ణ 'భగవంత్ కేసరి', సూపర్ స్టార్ మహేశ్ బాబు 'గుంటూరు కారం', నితిన్‌తో 'ఎక్స్టాడనరీ మ్యాన్' సినిమాల షూటింగ్‌ల్లో బిజీగా గడిపేస్తుందీ అమ్మడు.
యాక్టింగ్‌లోనే కాదు.. డ్యాన్స్‌లోనూ తగ్గేదేలే.. రామ్- నితిన్‌తో శ్రీలీల స్టెప్పులు కేక!