Siva karthikeyan Ayalaan Movie : తన డబ్బింగ్ మూవీస్‌తో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కోలీవుడ్ నటుడు శివ కార్తికేయన్. తాజాగా ఆయన నటించిన 'అయలాన్' అనే సైన్స్ ఫిక్షన్ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏలియన్స్ నేపథ్యంలో సాగే ఈ విభిన్నమైన కథాంశాన్ని ఆర్.రవికుమార్ తెరకెక్కించారు. అయితే మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శివ కార్తికేయన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సినిమాతో పాటు తన పర్సనల్ విషయాలను ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
" ఫలితాలతో సంబంధం లేకుండా ఇప్పటివరకు నేను యాక్ట్ చేసిన అన్ని సినిమాల విషయంలో నేను సంతోషంగా ఉన్నాను. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చూసే స్టోరీలకు మాత్రమే నేను సైన్ చేస్తున్నాను. 'ఏ' సర్టిఫికేట్ సినిమాల్లో అస్సలు నటించాలనుకోవడం లేదు. ఎందుకంటే, అందరికీ వినోదాన్ని అందించే చిత్రాల్లో నటించడం అంటేనే నాకు చాలా ఇష్టం. ఇటీవల నేను నటించిన 'ప్రిన్స్' మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని అందుకుంది. నా వరకూ ఆ సినిమాకు మైనస్ నేనే. అదే స్టోరీనీ కొత్త హీరోతో తెరకెక్కించి ఉంటే అది తప్పకుండా విజయం సాధించేది.’’ అని శివ కార్తికేయన్ వ్యాఖ్యానించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
"కెరీర్ పరంగా నా వద్ద ఏమీ లేనప్పుడు నా భార్య ఆర్తి నాకు తోడుగా నిల్చుంది. ఆమె నాలో ఎంతో స్ఫూర్తి నింపింది. నా సినిమాలన్నింటినీ చూసి తన ఒపినియన్‌ను చెబుతుంటుంది. సినిమాల్లో నేను ఎంత బిజీగా ఉన్నా కూడా ఆమె కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలను దగ్గరుండి చూసుకుంటుంది. నేను ఎప్పుడైనా డల్‌గా ఉన్నా కూడా తన మాటలతోనే నాలో ప్రేరణ నింపుతుంది" అంటూ తన కుటుంబం గురించి చెప్పుకొచ్చారు.
Ayalaan Movie Cast : ఇక 'అయలాన్' సినిమా విషయానికి వస్తే ఇందులో శివ కార్తికేయన్‌కు జంటగా పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్‌సింగ్ నటిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇందులో శరద్ ఖేల్కర్, ఇషా కొప్పికర్, భానుప్రియ, యోగి బాబు, కరుణాకరన్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
విజయ్ దేవరకొండ, శివ కార్తికేయన్ మధ్య తేడా ఏంటో తెలుసా?
హీరో శివ కార్తికేయన్‌కు తెలుగులో ఫేవరెట్ డైరెక్టర్ ఎవరో తెలుసా?