ETV Bharat / entertainment

'అందుకు నేను పదేళ్లు కష్టపడ్డా.. తనకు మాత్రం 'ఊ అంటావా'తో ఫుల్​ క్రేజ్​'

గిల్లికజ్జాలు, ప్రతిదాంట్లో పోటీ, కీచులాటలు.. అక్కాచెల్లెళ్లున్న ఏ ఇంట్లో అయినా కనిపించేవే! బయటికే ఇవన్నీ! సమస్య వచ్చినపుడు కానీ తెలియదు ఒకరికొకరిపై ఎంత ప్రేముందో. అవసరమైతే అక్క అమ్మవుతుంది. అక్కకేమైనా అయితే చెల్లి శివంగిలా మారుతుంది. అరమరికలంటూ ఎరుగని.. ప్రాణ స్నేహితులకు మించిన బంధమిది. ఎంత పేరు ప్రఖ్యాతులు సాధించినా.. మేమూ ఇంతే అంటున్నారీ అక్కాచెల్లెళ్లు. సిస్టర్స్‌ డే సందర్భంగా తమ అనుబంధాన్ని పంచుకున్నారు. అవి వారి మాటల్లోనే..

author img

By

Published : Aug 7, 2022, 6:24 PM IST

sisters day special
mangli satyavathi

Sisters Day Special: సోదరీమణులు అంటే మంచి స్నేహితులు. ఒకే ఇంట్లో పెరుగుతూ ఉన్న సమయంలో ప్రతి విషయంలో పోటీ పడుతుంటారు. అవసరమైన సమయంలో అన్నీ మర్చిపోయి సపోర్ట్​ చేసుకుంటారు. ఎటువంటి బేధ భావం ఎరుగని.. ప్రాణ స్నేహితులకు మించిన బంధం అక్కాచెల్లెళ్ల అనుబంధం. అయితే తమ గానంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న మంగ్లీ సిస్టర్స్​, విజయవంతమైన చిత్రాలు నిర్మిస్తూ.. నాన్న అశ్వనీదత్‌కి తగిన తనయలుగా నిలుస్తున్న స్రవంతి సిస్టర్స్.. ఆదివారం అక్కాచెల్లెళ్ల దినోత్సవం సందర్భంగా తమ అనుబంధాలను షేర్​ చేసుకున్నారు.

తల్లీబిడ్డల అనుబంధం..
Singers Mangli Satyvathi:సత్యవతి.. అంటే కాస్త ఆలోచిస్తారేమో కానీ మంగ్లీగా తెలుగు నాట అక్క అందరికీ సుపరిచితమే. తన బాటలోనే నడుస్తూ ఒక్కపాటతో ప్రపంచంలోని తెలుగు వారందరికీ పరిచయమైంది చెల్లి ఇంద్రావతి చౌహాన్‌. వీళ్లది అనంతపురంలోని గుత్తి దగ్గర చిన్న తండా. పేద కుటుంబం. చదువుకుంటూనే ఇంటి పని, నాన్న బాధ్యతను భుజానికెత్తుకొని తోబుట్టువుల ఆలనాపాలనా చూసుకునేది మంగ్లీ.

sisters day special
.

అందుకే.. "పాట అక్క నుంచే నేర్చుకున్నా. తనే నాకు స్ఫూర్తి. చిన్నప్పటి నుంచీ ఆమె చేతుల్లోనే పెరిగా. తను అక్క కాదు.. అమ్మంటా"నని ఇంద్రావతి చెబుతుంది. మంగ్లీనేమో.. "ఇంద్రావతి, వెంకటలక్ష్మి.. ఇద్దరు చెల్లెళ్లు నాకు. ఉద్యోగం మొదలుపెట్టినప్పటి నుంచి వాళ్ల చదువులు, బాగోగులు అన్నీ నేనే చూసుకున్నా. ఇంద్రావతి, నేను కలిసి ఎన్నో వేదికల్నీ పంచుకున్నాం. తనని గాయనిగా చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. శిక్షణా ఇవ్వలేదు. సరదాగా నాతో కలిసి పాడుతూ ఆసక్తి పెంచుకుంది. తను నా చెల్లి.. అవకాశాలివ్వమని ఏనాడూ ఎవరినీ అడగలేదు. నేను పాడటానికి వెళ్లినప్పుడు చెల్లెళ్లలో ఎవరో ఒకరు తోడుగా వస్తారు. ఓసారలా వచ్చినపుడు సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్‌ ఇంద్రావతితో మాట్లాడారు. అలా తనకి అవకాశమొచ్చింది.

నేను పదేళ్లు కష్టపడితే వచ్చిన గుర్తింపు తను ఒక్క 'ఊ అంటావా మావా' పాటతో తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరికీ చేరువైంది. తననలా చూస్తోంటే చాలా ఆనందంగా ఉంది. తను ఎదుగుతూ గుర్తింపు తెచ్చుకోవడం ఆనందంగా ఉన్నా.. కష్టపడుతోంది, సెలబ్రిటీగా శాంతియుత జీవితానికి దూరమవుతోందన్న బాధా ఉంది. చెల్లెల్లిద్దరికీ నేనంటే ప్రాణం. నువ్వు మా అమ్మవి అంటారు. ఇద్దరూ డిగ్రీ చదువుతున్నారు. ఇంద్రావతి పాటను ఎంచుకుంది. నాకో తమ్ముడు కూడా. వాళ్లనీ వాళ్లకు నచ్చిందే చేయమంటా. ఇది చెయ్యమని ఎప్పుడూ చెప్పను. ప్రతి ఒక్కరి దగ్గర్నుంచీ ఒక్కోటి నేర్చుకోవచ్చు. అలా నేర్చుకుంటూ ఉండమన్న సూచన మాత్రం ఇస్తా"నంటోంది.

ముగ్గురిదీ ఒకే మాట
AshwaniDatt Daughters: కష్టమైనా సుఖమైనా మా ముగ్గురిదీ ఒకే బాట అంటున్నారు.. స్వప్న, ప్రియాంక, స్రవంతిదత్‌. మహానటి, జాతిరత్నాలు, సీతారామం వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మిస్తూ.. నాన్న అశ్వనీదత్‌కి తగిన తనయలుగా నిలుస్తున్నారు. వాళ్ల అనుబంధం గురించి..
'పదోతరగతి వరకు విజయవాడలోనే పెరిగాం. చిన్నప్పుడు అందరిలాగే మేమూ బాగా కొట్టుకునేవాళ్లం. ముగ్గురం రెండు వర్గాలుగా విడిపోయేవాళ్లం. కొద్దిసేపటికే తిరిగి కలిసిపోయేవాళ్లం. స్కూల్‌లో పుట్టినరోజని ఎవరైనా ఒక చాక్లెట్‌ ఇస్తే, బతిమాలి మరోటి తీసుకునేదాన్ని. ఇంటర్‌వెల్‌లో మా చెల్లెలు స్రవంతి దగ్గరకెళ్లి సంతోషంగా ఇచ్చొచ్చేదాన్ని. మధ్యాహ్నం భోజనం ఆలస్యమైతే ఆలస్యమైతే స్వప్న అక్క కంగారుపడేది. క్యాంటిన్‌కెళ్లో, స్నేహితులనడిగో మాకేదైనా తెచ్చిచ్చేది. అంత బాధ్యతగా ఉండేది.

sisters day special
.

కాలేజీకొచ్చాక అమ్మకి అబద్ధం చెప్పి పుట్టినరోజు పార్టీలు, షాపింగ్‌లకు వెళ్లేవాళ్లం. పెళ్లిళ్లయ్యాక మా అనుబంధం మరింత గట్టిపడింది. వారానికోసారి కలుసుకొని కబుర్లు చెప్పుకొంటాం. 'మహానటి'ని నిర్మిస్తున్నప్పుడు మా బాబు రిషీకార్తికేయ పుట్టాడు. వాడి బాగోగులు స్రవంతే చూసుకుంది. తను ఆ బాధ్యత తీసుకోకపోయుంటే ఇన్ని విజయాలు సాధ్యమయ్యేవి కాదు. వాడిని కన్నది నేనే అయినా, తల్లి మా చెల్లి అయ్యింది. తన నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటా. సినిమా కథలను స్వప్నక్క, నేను కలిసి వింటాం. స్క్రిప్టు విషయంలో అభిప్రాయ భేదాలూ వస్తాయి. అన్నీ చర్చించుకొని ఒక నిర్ణయానికొచ్చాకే షూటింగ్‌ మొదలుపెడతా'మని ప్రియాంకా దత్‌ చెబుతుంది.

స్వప్న.. 'మేం స్నేహితుల్లానే మెలిగేవాళ్లం. దీంతో వేరే ఫ్రెండ్స్‌ అవసరం ఉండేది కాదు. అమ్మ ఎప్పుడూ 'చెల్లెళ్లను బాగా చూసుకోవాలి. నువ్వెలా ఉంటే వాళ్లూ అలాగే తయారవుతారు. వాళ్లకు స్ఫూర్తిగా ఉండా'లనేది. అందుకే బాధ్యతగా చూసుకునేదాన్ని. స్కూల్‌లో వాళ్లని ఎవరేమన్నా ఊరుకునేదాన్ని కాదు. విజయం వచ్చినపుడు ఇంకా బాగా చేయాల్సిందని వాదించుకుంటాం. కానీ కష్టంలో మాత్రం ఒకరికొకరం అండగా ఉంటాం. మాటల్లో పడ్డామో.. సమయమే తెలీదు. మా పాప వైజయంతి, ప్రియాంక కొడుకు రిషీ మాలాగే కలిసుంటారు. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ వంటివన్నీ ప్రియాంక చూసుకుంటుంది. కథ మాత్రం ఇద్దరం చర్చిస్తాం. సీతారామం నిర్మించేప్పుడు ఒక క్లాసిక్‌ సినిమాను ప్రేక్షకులకు అందివ్వాలనుకున్నాం. మూడేళ్లకు ఓ సినిమా తీసినా అది పదేళ్లు అందరి మనసులోనూ ఉండిపోవాలనేదే మా లక్ష్యం. మా విజయాలకి మా ముగ్గురి ఐకమత్యమే కారణం. మా చెల్లి స్రవంతి వెనకుండి…, మమ్మల్ని నడిపిస్తోంది' అంటున్నారు.

'స్వప్న అక్క నాకు అమ్మలాగే. ప్రతి చిన్న విషయాన్నీ తనతో పంచుకోవడం అలవాటు. ప్రియాంక స్నేహితురాల్లాగే. చిన్నప్పటి నుంచి స్వప్నక్క మా ఇద్దరినీ చాలా బాగా చూసుకునేది. ఓసారి స్కూల్‌లో నన్నెవరో కొడితే, అక్క వాడిని కొట్టి వచ్చింది. ఒకరి అవసరాలు మరొకరికి చెప్పకపోయినా తెలిసిపోతాయి. ముగ్గురిదీ ఒకే మాట. చిన్నదాన్నని ఇప్పటికీ గారాబం చేస్తారు' అని సంబరంగా చెబుతారు స్రవంతి.

ఇవీ చదవండి: బన్నీ​ వైఫ్ క్రేజీ​ ఫొటోషూట్​.. నిహారిక, సుస్మిత 'హాట్' కామెంట్స్

నందమూరి హీరోల జోష్.. ఆ సెంటిమెంట్​తో గ్రాండ్​ సక్సెస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.