SIIMA 2023 Awards NTR : మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరో ఘనతను అందుకున్నారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న సైమా 2023లో 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' చిత్రంకుగానూ తారక్.. ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్టేజ్ ఎమోషనల్‌గా మాట్లాడుతూ.. మరోసారి అభిమానులపై తనకున్న ప్రేమను తెలియజేశారు.
-
His electrifying performance in RRR stole all our hearts! He has won the Best Actor in a Leading Role (Telugu) for the same. Congratulations, @tarak9999! Thank you for delivering an unforgettable performance.#NEXASIIMA #DanubeProperties #A23Rummy #HonerSignatis #Flipkart… pic.twitter.com/9zt5QxTsnd
— SIIMA (@siima) September 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">His electrifying performance in RRR stole all our hearts! He has won the Best Actor in a Leading Role (Telugu) for the same. Congratulations, @tarak9999! Thank you for delivering an unforgettable performance.#NEXASIIMA #DanubeProperties #A23Rummy #HonerSignatis #Flipkart… pic.twitter.com/9zt5QxTsnd
— SIIMA (@siima) September 15, 2023His electrifying performance in RRR stole all our hearts! He has won the Best Actor in a Leading Role (Telugu) for the same. Congratulations, @tarak9999! Thank you for delivering an unforgettable performance.#NEXASIIMA #DanubeProperties #A23Rummy #HonerSignatis #Flipkart… pic.twitter.com/9zt5QxTsnd
— SIIMA (@siima) September 15, 2023
అవార్డు అందుకున్న తర్వాత ఎన్టీఆర్ మాట్లాడుతూ.. 'కొమరం భీమ్ పాత్రకు నన్ను మళ్ళీ మళ్ళీ మళ్లీ నమ్మినందుకు నా జక్కన్నకు థాంక్స్. నా కో స్టార్, మై బ్రదర్, ఫ్రెండ్ రామ్ చరణ్‌కు కూడా ధన్యవాదాలు. నా అభిమానులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. నా ఒడిదుడుకుల్లో నేను కింద పడ్డప్పుడల్లా నన్ను పట్టుకుని పైకి లేపినందుకు... నా కళ్ల వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకు వాళ్ళు కూడా బాధ పడినందుకు... నేను నవ్వినప్పుడల్లా నాతో పాటు నవ్వినందుకు... నా అభిమాన సోదరులు అందరికీ పాదాభివందనాలు చేసుకుంటున్నాను.'' అని తారక్ భావోద్వేగంగా మాట్లాడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
-
NTR Won the SIIMA Best Actor award For leading role in RRR Movie 💥🔥#SIIMA2023 #SIIMAinDubai@tarak9999 #ManofMassesNTR pic.twitter.com/IcIMEF1Dg1
— Jr NTR Fan Club (@JrNTRFC) September 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">NTR Won the SIIMA Best Actor award For leading role in RRR Movie 💥🔥#SIIMA2023 #SIIMAinDubai@tarak9999 #ManofMassesNTR pic.twitter.com/IcIMEF1Dg1
— Jr NTR Fan Club (@JrNTRFC) September 15, 2023NTR Won the SIIMA Best Actor award For leading role in RRR Movie 💥🔥#SIIMA2023 #SIIMAinDubai@tarak9999 #ManofMassesNTR pic.twitter.com/IcIMEF1Dg1
— Jr NTR Fan Club (@JrNTRFC) September 15, 2023
కాగా, 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీముడిగా కనిపించారు. ఈ పాత్రలో ఆయన అద్భుతంగా నటించి కంటతడి పెట్టించారు. యాక్షన్ సీన్స్‌లో వీరోచితంగా కనిపిస్తూనే.. ఎమోషనల్ సీన్స్‌లో ప్రేక్షకుల చేత ఏడ్పించేశారు. ముఖ్యంగా 'కొమురం భీముడో' సాంగ్‌లో ఆయన అభినయం ప్రతి ప్రేక్షకుడి గుండెను పిండేసింది. ఆ నటనకుగాను ఇప్పుడాయన సైమా పురస్కారాన్ని దక్కించుకున్నారు.
ఇకపోతే ప్రస్తుతం ఆయన దేవర చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. 'జనతా గ్యారేజ్' లాంటి హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ చిత్రంలో ఆయన యాక్షన్ సీన్లతో పాటు అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇది ఆమెకు తొలి తెలుగు సినిమా. బాలీవుడ్ స్టార్ హారో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా కనిపించనున్నారు.
Devara VFX : 'దేవర' షాకింగ్ న్యూస్.. రూ.100కోట్ల బడ్జెట్‌తో వీఎఫ్ఎక్స్ షురూ..
NTR Devara movie shooting : 'దేవర' కోసం ఎన్టీఆర్ అలా చేస్తున్నారా?