బాలీవుడ్ జంట కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్ర పెళ్లి ఘనంగా జరిగింది. మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అతిరథ మాహారథుల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లికి రాజస్థాన్‌లోని జైసల్మేర్ సూర్యగఢ్ ప్యాలెస్ వేదికైంది. కాగా, ఫిబ్రవరి 4 నుంచి మొదలైన వేడుకలు మంగళవారం జరగనున్న బరాత్‌తో ముగియనున్నాయి. ఇక, పెళ్లికి వచ్చిన గెస్టుల కోసం ఈ జంట ఘనంగా ఏర్పాట్లు చేసింది. వివాహానికి విచ్చేసిన సినీ, రాజకీయ ప్రముఖలను రిసీవ్ చేసుకోడానికి దాదాపు 70 లగ్జరీ కార్లు ఏర్పాటు చేశారు. వీరికి వండి వడ్డించడానికి 500 మంది దాకా వెయిటర్లను ముంబయి, దిల్లీ నుంచి ప్రత్యేకంగా రప్పించారు.
రోజుకు రెండు కోట్లు ఖర్చు..!
ముంబయికి చెందిన ఓ వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ ఆధ్వర్యంలో కియారా సిద్ధార్థ్ పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. కాగా దీనికి ఒక్క రోజుకు దాదాపు రూ. 2 కోట్ల వరకు ఖర్చు అవుతుందని సమాచారం. ఇక మూడు రోజుల పాటు జరుగుతున్న స్టార్ కపుల్ వెడ్డింగ్‌కు రూ.6 కోట్లకు పైనే ఖర్చు చేస్తున్నారని టాక్. తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ప్రస్తుతానికి ప్రైవసీలో ఉంచనున్నారట ఈ జంట. తాము పోస్ట్ చేసేంత వరకు అతిథులెవరూ సోషల్ మీడియాలో పోస్టు చేయకూడదని కోరారట. ఈ విషయాన్ని హోటల్ సిబ్బందికి కూడా తెలియజేశారని సమాచారం. కాగా గతంలో విక్కీ, కత్రినా సైతం తమ పెళ్లి సందర్భంగా బంధుమిత్రులకు ఇలాంటి విజ్ఞప్తి చేశారు.
పెళ్లి వేడుక ఓటీటీ స్ట్రీమింగ్?
ప్రస్తుతం ఓటీటీలో పెళ్లి వేడుకలను స్ట్రీమింగ్ చేసే ట్రెండ్ నడుస్తోంది. ఈ ట్రెండ్ ఇదివరకే సినీ తారలు నరయతార-విఘ్నేష్ శివన్, హన్సిక మోత్వానీ తదితరులు ఫాలో అయ్యారు. ఇప్పుడు కియారా-సిద్ధార్థ్ జంట కూడా అదే కోవలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. వారి వివాహ వేడుక స్ట్రీమింగ్ హక్కులను ఓ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు అప్పగించినట్లు సమాచారం. అయితే, దీనికి బలం చేకూర్చేలా అమెజాన్ ప్రైమ్ కొద్ది రోజుల క్రితం ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేసింది. షేర్షా సినిమాలోని ఓ పిక్‌తో పాటు సూర్యగఢ్ ప్యాలస్ ఫొటోను పెడుతూ.. 'కోటలు చాలా అందంగా ఉంటాయి' అని రాసుకొచ్చింది. కాగా, పెళ్లి వేడుక స్ట్రీమిగ్ హక్కులు అమెజాన్ప్రైమ్కు అమ్మలేదని లేదని ఓటీటీ వర్గాల సమాచారం.
ఇదీ చూడండి : గ్రాండ్‌గా కియారా- సిద్ధార్థ్ '3' డేస్ వెడ్డింగ్.. ఏకంగా 70 లగ్జరీ కార్లతో.. రోజుకు ఎంత ఖర్చంటే?