ETV Bharat / entertainment

NBK 107 అప్డేట్​:​ నా ఫేవరెట్​ హీరోయిన్​ వచ్చేసిందంటూ డైరెక్టర్​ ట్వీట్​.. - shrutihassan join sets balakrishna movie

Balakrishna Gopichand malineni movie: గోపిచంద్​ మలినేని దర్శకత్వంలో నందమూరి హీరో బాలకృష్ణ నటిస్తున్న 'ఎన్​బీకే 107' సినిమా సెట్స్​లో అడుగుపెట్టారు హీరోయిన్ శ్రుతిహాసన్​. దీనికి సంబంధించిన ఫొటోను దర్శకుడు గోపిచంద్​ ట్వీట్​ చేశారు.

NBK 107 shruti hassan
గోపిచంద్​ మలినేని శ్రుతిహాసన్​
author img

By

Published : Jun 19, 2022, 10:28 AM IST

Balakrishna Gopichand malineni movie: నటసింహం నందమూరి బాలకృష్ణ నూతన చిత్రం 'ఎన్​బీకే107'. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్​ యాక్షన్​ ఎంటర్​టైనర్​గా ఈ సినిమా తెరకెక్కనుంది. శ్రుతిహాసన్​ హీరోయిన్. శరవేగంగా షూటింగ్​ జరుపుకుంటున్న ఈ చిత్రంలో తాజాగా సెట్స్​లోకి అడుగుపెట్టారు శ్రుతిహాసన్​. దీనికి సంబంధించిన ఫొటోను దర్శకుడు గోపిచంద్​ సోషల్​మీడియాలో షేర్​ చేశారు. "అత్యంత ప్రతిభావంతురాలు, నా ఫేవరెట్​ శ్రుతిహాసన్​ సెట్స్​లో అడుగుపెట్టారు. షూటింగ్​ స్పీడ్​గా జరుగుతోంది" అని వ్యాఖ్య రాసుకొచ్చారు.

కాగా, 'అఖండ' సినిమాలో తన బ్యాక్‌గ్రౌండ్ మ్యాజిక్​తో నందమూరి అభిమానుల్ని ఉర్రూతలూగించిన తమన్.. 'ఎన్​బీకే 107' చిత్రానికీ బాణీలు అందిస్తున్నారు. కన్నడ హీరో దునియా విజయ్ విలన్‌గా కనిపించబోతున్నారు. వరలక్ష్మీ శరత్​కుమార్​ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఫస్ట్​ హంట్​ పేరుతో విడుదలైన టీజర్​లో మాస్​ డైలాగులు, స్క్రీన్​ ప్రెజన్స్​తో ఈలలు వేయిస్తున్నారు బాలయ్య.

ఇదీ చూడండి: కెమెరా అసిస్టెంట్​గా జర్నీ స్టార్ట్​.. ఇప్పుడు జబర్దస్త్, సినిమాలతో ఫుల్​ బిజీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.