నటి శ్రుతి హాసన్.. 'వాల్తేరు వీరయ్య' చిత్రం ట్రైలర్ లాంచ్‌కు ఎందుకు హాజరుకాలేదో వివరించారు. తన మానసిక ఆరోగ్యం సరిగా లేనందు వల్లే ఈవెంట్కు రాలేదని వైరల్ అవుతున్న వార్తలను ఆమె ఖండించారు. తనకు వైరల్ ఫీవర్ రావడం వల్లే ప్రీ రిలీజ్ ఫంక్షన్కు రాలేకపోయానని ఇన్స్టా ద్వారా తెలిపారు.
ఇలాంటి తప్పుడు సమాచారం ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో మానసిక ఆరోగ్యంపై భయాందోళనలు మొదలవుతే పరిస్థితి ఏంటో మీరే ఆలోచించండి. ఇది సరైన పద్ధతి కాదు అని శ్రుతి అసహనం వ్యక్తం చేశారు. "ఇలాంటి తప్పుడు సమాచారం, విపరీతమైన నాటకీయత కారణంగా చాలామంది తమ మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను బయటపెట్టడానికి భయపడుతుంటారు. అయితే.. అది నా విషయంలో పనిచేయలేదు. నేను ఎప్పుడూ ఒక మానసిక నిపుణురాలిగా వ్యవహరిస్తుంటాను. ఇకపోతే.. నాకు వైరల్ ఫీవర్ వచ్చింది కాబట్టి ఫంక్షన్కు వెళ్లలేదు. నా విషయంలో వదంతులను చేరవేసే ప్రయత్నం చక్కగా చేశారు. ఒకవేళ మీరు మానసిక సమస్యలతో ఇబ్బందిపడితే.. వైద్య నిపుణులను సంప్రదించండి" అని శ్రుతి అన్నారు. కాగా, 'వీర సింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య'లతో ఈ ఏడాది ఆరంభంలోనే మంచి చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు శ్రుతి.