ETV Bharat / entertainment

' 'మా'లో ఏం జరుగుతుందో నాకు తెలియడం లేదు' - jeevitha rajasekhar

రాజశేఖర్​ హీరోగా జీవిత దర్శకత్వం వహించిన సినిమా 'శేఖర్'. ఆ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో జీవిత రాజశేఖర్‌ మీడియాతో చిత్ర విశేషాలను వివరించారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ గురించి కూడా కొన్ని ఆసక్తికర కామెంట్స్​ చేశారు.

jeevitha rajasekhar
జీవిత రాజశేఖర్​
author img

By

Published : May 16, 2022, 8:06 AM IST

"నటిగా కొనసాగుతున్న రోజుల్లో ఎదురుగా నలుగురు ఉన్నారంటే అక్కడ తినేదాన్ని కూడా కాదు. మేకప్‌ రూమ్‌కి వెళ్లిపోయేదాన్ని. ఇప్పుడు ఎంత మంది ఉన్నా ఇది కావాలని ధైర్యంగా చెబుతా. దర్శకత్వం, నిర్మాణం మొదలుకొని ఎడిటింగ్‌ వరకు అన్ని పనులూ నాకు తెలుసు. దానికి కారణం రాజశేఖర్‌ అందించిన ప్రోత్సాహమే" అన్నారు జీవిత రాజశేఖర్‌. నటిగా వెండితెరపై తనదైన ముద్ర వేసిన ఆమె... దర్శకురాలిగా పలు విజయాలు అందుకున్నారు. తన భర్త రాజశేఖర్‌ కథానాయకుడిగా 'శేఖర్‌' తెరకెక్కించారు. ఆ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా జీవిత రాజశేఖర్‌ హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ..

మళ్లీ మెగాఫోన్‌ పట్టారు. ఆ అనుభవాలేంటి?
కొద్దిమంది చెప్పుకొన్నట్టుగా నాకు దర్శకత్వంపై ఆసక్తేమీ లేదు. కథల విషయంలో జోక్యం చేసుకోను. దర్శకత్వం అనుకోకుండా చేసిందే. మేం అప్పట్లో తమిళ చిత్రం 'సేతు' కొన్నప్పుడు చాలా మంది దర్శకుల్ని సంప్రదించాం. అందరూ మార్పులు చెప్పారు. మేమేమో దాన్ని మాతృకలో ఎలా ఉంటే అలాగే తీయాలనుకున్నాం. దాంతో నాకు అనుభవం లేకపోయినా, ఛాయాగ్రాహకుడు హరి అనుమోలుతో కలిసి రంగంలోకి దిగా. 'శేషు' పేరుతో ఆ సినిమాని తెరకెక్కించా. ఆ తర్వాత మా సొంత సినిమాలు కొన్ని చేయాల్సి వచ్చింది.

"మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ కార్యవర్గంలో నేను లేకపోయినా 'మా' సభ్యులు టచ్‌లోనే ఉంటారు. ఇప్పుడు 'మా'లో ఏం జరుగుతుందో నాకు తెలియడం లేదు. అక్కడ పనిచేసే కొద్దిమందిని తీసేశారు. కారణాలేమో తెలియదు. వాళ్ల కార్యచరణ ఎలా ఉందో తెలియదు కానీ... ఇప్పటివరకైతే పనులేమీ కనపడలేదు. ఎన్నికలైతే న్యాయబద్ధంగా జరగలేదు. ప్రకాశ్‌రాజ్‌కి సపోర్ట్‌ చేసినందుకు, నేను ఓడిపోయినందుకు బాధపడటం లేదు."

ఈ సినిమా విషయంలోనూ మొదట చాలా మంది దర్శకుల పేర్లే వినిపించాయి?
రాజశేఖర్‌కి బాగుంటుంది, సినిమా కొత్తగా ఉందని చెబితే కొవిడ్‌ సమయంలో మలయాళ చిత్రం 'జోసెఫ్‌' చూశాం. హక్కులు కొన్నాం. అప్పుడే 'పలాస' దర్శకుడు కరుణకుమార్‌తోనూ చర్చించాం. ఆయనకి వేరే ఒప్పందాలు ఉండటంతో చేయలేకపోయారు. ఆ తర్వాత నీలకంఠతో చేయాలనుకున్నాం. పేరు దగ్గర్నుంచే మామధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఆ తర్వాత మరో కొత్త దర్శకుడితో చేద్దామనుకున్నాం. కుదరలేదు. చివరికి నేనే చేయాల్సి వచ్చింది. 'జోసెఫ్‌'ని చూసినప్పుడు ఎక్కడైతే భావోద్వేగాల పరంగా లోతుగా వెళ్లలేకపోయారని అనిపించిందో, అలాంటి చోట ఇంకా కసరత్తులు చేసి స్క్రిప్ట్‌ని తీర్చిదిద్దాం.

'శేఖర్‌' ఎలా ఉంటాడు?
ప్రతి ప్రేక్షకుడికీ కనెక్ట్‌ అవుతాడు మా శేఖర్‌. జీవితంలో తనకంటూ ఎవ్వరూ లేని ఓ ఒంటరి వ్యక్తి ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొన్నాడు? తన పక్కన ఎవ్వరూ లేకపోయినా ఎలా పోరాటం చేశాడనేదే ఈ సినిమా. ఇందులో ఓ మంచి సందేశంతోపాటు, మనందరం నేర్చుకునే విషయమూ ఉంటుంది. లవ్‌, రొమాన్స్‌, ప్రత్యేకగీతాలు... ఇవేవీ ఇందులో లేవని మాకు తెలుసు. హృదయం ఉన్న ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అయ్యే కథ, పాత్రలు, భావోద్వేగాలున్నాయి కాబట్టి మేం నమ్మకంగా తీశాం.

రాజశేఖర్‌తోపాటు, మీ అమ్మాయి శివాని నటించారు. కుటుంబ సభ్యులతో కలిసి పనిచేయడం ఎలా ఉంటుంది?
ఇల్లు శుభ్రం చేయడం దగ్గర్నుంచి దర్శకత్వం వరకు ఏదైనా నేను పద్ధతిగా చేస్తా. ప్రతి సన్నివేశం చేసి చూపించగలిగేంత స్పష్టతతో సెట్‌కి వెళతా. కుటుంబ సభ్యులతో సినిమా చేస్తున్నప్పుడు కొంచెం చొరవ ఎక్కువ ఉంటుందేమో తప్ప మార్పేమీ ఉండదు. రాజశేఖర్‌, శివాని కలిసి నటించడానికి కారణం సినిమాలో తండ్రీకూతుళ్ల పాత్రలే. ఆ ఇద్దరి మధ్య అంత ఎక్కువ సన్నివేశాలు ఉండవు. ఉన్నంతలో భావోద్వేగాలు బలంగా పండాలి. అందుకే వేరేవాళ్లకంటే నిజమైన తండ్రీకూతుళ్లయితే బాగుంటుందనే శివానిని ఎంపిక చేశా.

ఇదీ చదవండి: నిర్మాతలుగా అగ్ర కథానాయకులు.. తోటి హీరోలకు ప్రోత్సాహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.