ETV Bharat / entertainment

షారుక్​కు షాక్​.. దర్శకుడితో మనస్పర్థలు.. ఆగిపోయిన సినిమా షూటింగ్​! - షారుక్​ ఖాన్ డంకీ షూటింగ్ బ్రేక్​

బాలీవుడ్​ బాద్​షా నటిస్తున్న 'డంకీ' సినిమా చిత్రీకరణకు బ్రేక్​ పడింది. సినిమా తాత్కాలికంగా నిలిచిపోయింది. అసలేం ఏం జరిగిందంటే..

sharukh khan dunki movie
షారుక్ ఖాన్​ డంకీ మూవీకి బ్రేక్​
author img

By

Published : Jul 13, 2022, 10:42 AM IST

Sharukh khan Dunki movie: నాలుగేళ్ల నుంచి వెండితెరపై కనిపించని బాలీవుడ్​ బాద్​షా షారుక్ ఖాన్​ 2023లో బ్యాక్​ టు బ్యాక్​ సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఇప్పుడాయనకు ఓ షాక్ తగిలింది. ఆయన నటించే సినిమాల్లో ఒకటి తాత్కాలికంగా నిలిచిపోయింది.

ఏం జరిగిందంటే.. ప్రస్తుతం షారుక్​ 'పఠాన్'​, 'జవాన్'​, 'డంకీ' సినిమాలు చేస్తున్నారు. అయితే రాజ్​కుమార్ హిరాని దర్శకత్వం వహిస్తున్న 'డంకీ'కి అడ్డంకులు ఎదురయ్యాయి. సెట్స్​పైకి వెళ్లి తొలి షెడ్యూల్​ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్​గా పని చేస్తున్న అమిత్​ రాయ్​.. ప్రాజెక్ట్​ నుంచి తప్పుకున్నట్లు కొద్ది రోజులగా ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా వీటిపై క్లారిటీ ఇచ్చారు అమిత్​ రాయ్​. తాను డంకీ మూవీకి పనిచేయడం లేదని స్పష్టం చేశారు. "తొలి షెడ్యూల్‌లో భాగంగా డంకీ చిత్రానికి 18, 19 రోజులు వర్క్‌ చేశాను. ఇకపై నేను ఆ సినిమాకీ పని చేయడం లేదు. నాకు, డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ హిరానికి మధ్య మనస్పర్థలు తలెత్తడమే ఇందుకు కారణం" అని చెప్పుకొచ్చారు.

"ఇద్దరి ఆలోచనలు ఏకీభవించడం లేదు. మేం ఒకే కోణంలో చూడలేకపోయాం. ఈ క్రమంలో మా మధ్య కొన్ని మనస్పర్థలు వచ్చాయి. ఇది భవిష్యత్తులో ఎలాంటి గొడవలకు దారి తీయకూడదనే ఉద్దేశంతోనే ఈ సినిమా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. ఇదే విషయాన్ని డైరెక్టర్‌తో కూర్చొని మాట్లాడాను కూడా. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయానికి వచ్చాం" అని అన్నారు. కాగా ఈ సినిమాను 2023 డిసెంబర్‌ 22న థియేటర్లోకి తీసుకురానున్నట్లు చిత్రబృందం గతంలో ప్రకటించింది.

ఇదీ చూడండి: అల్లుఅర్జున్​ సినిమా నేను చేయాల్సింది.. కానీ: వేణు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.