ETV Bharat / entertainment

'ఇకపై వయసుకు తగ్గ పాత్రలు చేస్తా'- డంకీ రిలీజ్ తర్వాత షారుక్ షాకింగ్ డెసిషన్​! - షారుక్​ ఖాన్ లేటెస్ట్ మూవీస్

Shahrukh Khan Next Movie Update : బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్​ ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ 'డంకీ'తో థియేటర్లలో సందడి చేస్తున్నారు. అయితే తన తదుపరి సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు.

Shahrukh Khan Next Movie Update
Shahrukh Khan Next Movie Update
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 22, 2023, 4:49 PM IST

Shahrukh Khan Next Movie Update : 'పఠాన్‌', 'జవాన్' సినిమాలతో వరుస హిట్లు అందుకున్న బాలీవుడ్​ బాద్​షా షారుక్ ఖాన్ తాజాగా 'డంకీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. 'త్రీ ఇడియట్స్' ఫేమ్​ రాజ్​కుమార్​ హిరాణీ ఈ సినిమాను రూపొందించారు. డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్​ టాక్ అందుకుని థియేటర్లలో నడుస్తోంది. అయితే షారుక్​ ఖాన్ తర్వాత ఎలాంటి సినిమాలు చేస్తారనే అనే విషయం ఆసక్తికరంగా మారాయి. ఈ విషయంపై తాజాగా కింగ్​ క్రేజీ అప్డేట్​ ఇచ్చారు.

ప్రస్తుతం డంకీ పాజిటివ్​ టాక్​తో రన్​ అవుతోంది. ఈ సందర్భంగా షారుక్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా తన తదుపరి సినిమాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు​ చేశారు. "ఈ సారి కొత్తగా ప్రయత్నించాలని అనుకుంటున్నా. ఇకపై నా వయసుకు తగిన సినిమాలు చేస్తాను. అందులోనూ నేను ప్రధాన పాత్రలో నటిస్తాను. అది అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నా. నా నెక్ట్స్ మూవీ వచ్చే ఏడాది మార్చి లేదంటే ఏప్రిల్​లో ప్రారంభం కానుంది" అని షారుక్ చెప్పారు. డంకీ రిలీజ్​ తర్వాత ఒక్క రోజులో తన తదుపరి సినిమాల గురించి చెప్పటం, ఇకపై ఎలాంటి సినిమాలు చేస్తారనే విషయంపై షారుక్ మాట్లాడడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయితే తన కొత్త సినిమా ఎవరి దర్శకత్వంలో నటించనున్నారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.

ఇక కింగ్​ ఖాన్ ఈ ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 'పఠాన్' ఆ తర్వాత 'జవాన్'​తో బ్లాక్ బాస్టర్​ హిట్లను అందుకున్నారు. ఏకంగా బాక్సాఫీస్​ వద్ద రూ.1000 కోట్లుకు పైగా వసూళ్లు దక్కించుకున్నారు. ఇక తాజాగా విడుదలైన 'డంకీ' కూడా థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ఒక్కరోజు తేడాతో 'సలార్'​ కూడా విడుదల అవ్వటం ఈ సినిమాపై ప్రభావం ఉండొచ్చని భావిస్తున్నాయి సినీ వర్గాలు. ప్రస్తుతం 'సలార్​'కు కూడా పాజిటివ్​ టాక్​ వస్తోంది. దీంతో బాక్సాఫీస్​ వద్ద డంకీ సినిమాకు కలెక్షన్లు ఏ విధంగా వస్తాయో చూడాలి.

'డంకీ' మీనింగ్​ అదేనట- షారుక్ క్లారిటీ​- మరి సలార్ అంటే ఏంటో తెలుసా?

'ఆదిపురుష్​' కంటే తక్కువ - ఓపెనింగ్స్​లో డీలాపడ్డ 'డంకీ' మూవీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.