Gopichand Malineni-Balakrishna movie దర్శకుడు గోపీచంద్ మలినేని- హీరో బాలకృష్ణ కాంబోలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా తెరకెక్కుతోంది. బాలయ్య 107వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీలో శ్రుతిహాసన్ కథానాయిక. కన్నడ నటుడు దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సిరిసిల్ల పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం.. అక్కడే ఓ షెడ్యూల్‌ను పూర్తిచేసుకుని మరో కీలక షెడ్యూల్‌ను కూడా ఇటీవలే ప్రారంభించింది. ప్రముఖ ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో.. కీలకమైన పోరాట ఘట్టాలను.. బాలకృష్ణ, ఇతర ప్రధాన తారాగణంపై తెరకెక్కించారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ యాక్షన్ షెడ్యూల్ పూర్తైనట్లు తెలిసింది. దీంతో కొత్త షెడ్యూల్ షూటింగ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించాలని మూవీటీమ్ సన్నాహాలు చేస్తోందట! త్వరలోనే ఈ విషయాన్ని చిత్రబృందం తెలియజేయనుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా సిద్ధమైన ఈ కథలో బాలకృష్ణ రెండు కోణాల్లో సాగే పాత్రలో సందడి చేయనున్నట్టు తెలిసింది. విదేశీ నేపథ్యమూ ఇందులో ఉంటుందని సమాచారం. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా మాటలు అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Hindi Jersy releasedate postpone: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కథానాయకుడిగా తెరకెక్కిన 'జెర్సీ' సినిమాకు విడుదల కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు ఏప్రిల్ 14న రిలీజ్ డేట్‌ను ఖరారు చేసుకుని బాక్సాఫీస్ బరిలో దిగింది. అయితే తాజాగా మళ్లీ ఆ బరిలో నుంచి తప్పుకుంది. ఏప్రిల్ 13న కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన 'బీస్ట్', ఏప్రిల్ 14న కన్నడ స్టార్ యశ్ నటించిన 'కేజీఎఫ్ 2' విడుదల అవ్వడమే ఇందుకు కారణం. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్‌మీడియా ద్వారా ట్వీట్ చేసింది. భారీ చిత్రాల విడుదల నేపథ్యంలో వారం రోజుల పాటు చిత్రాన్ని పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 22న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పింది.
తెలుగులో ఘన విజయం అందుకున్న నాని 'జెర్సీ'కి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. నాని పాత్రలో షాహిద్ కనిపించనున్నారు. మృణాల్ ఠాకూర్ కథానాయిక. మాతృకను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరినే ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని దిల్‌రాజు, సూర్యదేవర నాగవంశీ, అమన్ నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. సచిత్- పరంపర సంగీతం అందించారు.
-
‘Jersey’ postponed by a week. To release on 22nd April 2022!! Looking to the tight position of cinemas, it has been shifted ahead. pic.twitter.com/Gp9HVID1mS
— Komal Nahta (@KomalNahta) April 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">‘Jersey’ postponed by a week. To release on 22nd April 2022!! Looking to the tight position of cinemas, it has been shifted ahead. pic.twitter.com/Gp9HVID1mS
— Komal Nahta (@KomalNahta) April 11, 2022‘Jersey’ postponed by a week. To release on 22nd April 2022!! Looking to the tight position of cinemas, it has been shifted ahead. pic.twitter.com/Gp9HVID1mS
— Komal Nahta (@KomalNahta) April 11, 2022
ఇదీ చూడండి: దర్శకుడితో సీక్రెట్ రిలేషన్షిప్.. అబార్షన్ చేయించుకున్న నటి