ETV Bharat / entertainment

'జురాసిక్‌ పార్క్‌' మూవీని రిజెక్ట్​ చేసిన శ్రీదేవి.. ఎందుకంటే? - Senior Actress sridevi rejected Jurassic movie

హాలీవుడ్‌ సినిమాల్లో ఛాన్స్​ వస్తే ఏ నటీనటులైనా వదులుకుంటారా? అందులోనూ దిగ్గజ దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ మూవీ అంటే.. కథేంటో కూడా వినకుండా మ్యాక్సిమమ్​​ ఓకే చెప్పేస్తారు. కానీ అలనాటి తార శ్రీదే నో చెప్పిందట. ఎందుకంటే?

Sridevi Jurassic park
శ్రీదేవి జురాసిక్ పార్క్​
author img

By

Published : May 27, 2023, 6:07 PM IST

నటీనటులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ కెరీర్​లో ముందుకెళ్తుంటారు. రీజనల్​ భాషల్లో సినిమాలు చేసేవారు.. బాలీవుడ్ కోసం.. అక్కడ పనిచేసేవారు హాలీవుడ్​ ఛాన్స్​ల కోసం ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా ఇంగ్లీష్​ సినిమాల్లో ఛాన్స్​ వస్తే ఓ గొప్ప అవకాశంలో భావిస్తారు. అక్కడ నటిస్తే డబ్బుకు డబ్బుకు.. ఊహించని రేంజ్​లో ఫేమ్​ వస్తాయి. అందులోనూ దిగ్గజ దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ సినిమా ఛాన్స్​ అంటే.. స్టోరీ ఏంటే కూడా అడగకుండా గ్రీన్ సిగ్నల్​ ఇచ్చేసారు. కానీ.. అలనాటి నటి శ్రీదేవి మాత్రం ఈ విషయంలో నో చెప్పారట! అది కూడా 'జురాసిక్‌ పార్క్‌' చిత్రానికి. అవును.. మీరు చదివింది నిజమే.

యావత్‌ సినీ ప్రియులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన చిత్రం 'జురాసిక్ పార్క్​'. 1993లో విడుదలైన ఈ చిత్రం వరల్డ్​ బాక్సాఫీస్‌ వద్ద భారీ స్థాయిలో బిలియన్‌ డాలర్ల వసూళ్లను అందుకుంది. కాసుల వర్షాన్ని కురిపించింది. అలాంటి చిత్రంలో నటించే ఛాన్స్​నే శ్రీదేవి వదిలేసిందట. అందుకు గల కారణాన్ని కూడా ఆమె వివరించింది. 'మామ్‌' సినిమా ప్రమోషన్స్‌లో సమయంలో చెప్పింది.

'మీరెందుకు 'జురాసిక్‌ పార్క్‌' ఆఫర్​ను తిరస్కరించారు' అని.. 'మామ్‌' చిత్రంలో నటించిన అక్షయ్‌ఖన్నా అడగారు. అందుకు ఆమె బదులిస్తూ.. "ఆ రోజుల్లో హాలీవుడ్‌ మూవీస్ అంటే.. ఏలియన్​లా నటించడమే. కానీ.. ఇప్పుడది ఒక గౌరవం. అందుకే అప్పుడు ఒప్పుకోలేదు" అని శ్రీదేవి చెప్పింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇకపోతే శ్రీదేవి.. కేవలం 'జురాసిక్‌ పార్క్‌' చిత్రాన్ని మాత్రమే కాదు.. ఆమె కెరీర్‌ పీక్ స్టేజ్​లో ఉన్నప్పుడే పలు కారణాల వల్ల ఎన్నో పాత్రలను వదిలేసుకున్నారు. అలాంటి వాటిలో 'డర్‌' కూడా ఒకటి. దీనిపై ఆమె మాట్లాడుతూ.. "చాందినీ, లమ్హీ మూవీస్​ తర్వాత 'డర్‌'లో నా పాత్ర చాలా సింపుల్​గా ఉంటుందని భావించాను. ఒకవేళ షారుక్​ ఖాన్‌ పోషించిన పాత్ర లాంటిదైతే చేసి ఉండేదాన్నేమో. ఆ రోల్​ క్యారెక్టరైజేషన్‌ నాకు చాలా బాగా నచ్చింది. ఇకపోతే జూహీ చావ్లాకు అలాంటి పాత్ర కొత్త ఎక్స్​పీరియన్స్​. ఆమె సరిగ్గా సరిపోయింది" అని శ్రీదేవి అన్నారు.

కాగా, శ్రీదేవి... బాలనటిగా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోయిన్​గా ఎదిగింది. బాలీవుడ్​లోనూ స్టార్ హీరోల చిత్రాల్లో నటించి సత్తా చాటింది. కెరీర్​ పీక్​ స్టేజ్​లో ఉన్నప్పుడే నిర్మాత బోణీకపూర్​ను పెళ్లిచేసుకుంది. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు. వారిలో ఒకరు జాన్వీ కపూర్​ ప్రస్తుతం నటిగా రాణిస్తోంది. ఇకపోతే 2018, ఫిబ్రవరి 24న శ్రీదేవి కన్నుమూసింది.

ఇదీ చూడండి:

జాన్వీ హోమ్​ టూర్​.. అతిలోక సుందరి శ్రీదేవి ఇంద్రభవనాన్ని చూశారా?

రజనీ కన్నా శ్రీదేవీకే ఎక్కువ రెమ్యునరేషన్​ అట.. ఎంత తీసుకున్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.