ETV Bharat / entertainment

కృష్ణంరాజు మొత్తం ఆస్తి విలువ అన్ని కోట్లా? - కృష్ణంరాజూకు ప్రముఖులు నివాళి

ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు రెబల్​ స్టార్​ కృష్ణంరాజు కన్నుమూశారు. అయితే ఆయన గురించిన ఓ విషయంపై సామాజిక మాధ్యమాల్లో చర్చ నడుస్తోంది. కృష్ణంరాజు ఆస్తి గురించి తెగ ముచ్చటిస్తున్నారు నెటిజన్స్​. ఆ వివరాలేంటో చూద్దాం..

Senior Actor Krishnamraju property details
కృష్ణంరాజు ఆస్తి
author img

By

Published : Sep 11, 2022, 6:45 PM IST

ప్రముఖ నటుడు కృష్ణంరాజు వెండితెర మీద రెబల్​ స్టార్​ అయితే.. తెర వెనుక మర్యాద రామన్నలా ఉంటారని సినీ పరిశ్రమలో ఉన్న టాక్​. సినీ రంగంలో, రాజకీయాలలో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు కృష్ణంరాజు. దాదాపు 60 ఏళ్లకుపైగా ఆయన సినీ జీవితం కొనసాగింది. సంపన్న కుటుంబంలో జన్మించడం వల్ల వారసత్వంగా ఆయనకు కొంత ఆస్తి ఉంది. కానీ ఇన్నాళ్లు సినిమాల్లో కూడా కొంత సంపాదించారు. తాజాగా కృష్ణంరాజు మరణించడం కారణంగా.. ఆయన ఆస్తి గురించిన విషయంపై చర్చ మొదలైంది. ఎన్నికల అఫిడవిట్​ ప్రకారం, మరికొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇవీ ఆయన ఆస్తులు..

పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగళ్తూరులో ఓ సంపన్నుల కుటుంబంలో కృష్ణంరాజు జన్మించారు. తల్లిదండ్రుల వారసత్వంగా సొంతూరిలో వందల ఎకరాల భూమి వచ్చిందట. ప్రస్తుతం దాని నిర్వహణంతా కృష్ణంరాజు బంధువులే చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఓ భవనంతో పాటు చెన్నై, హైదరాబాద్​లో కృష్ణంరాజుకు నాలుగు ఖరీదైన ఇళ్లు ఉన్నాయట. ప్రస్తుతం జూబ్లీహిల్స్​లో నివాసముంటున్న బిల్డింగ్ ఖరీదు రూ.18 కోట్ల వరకు ఉంటుందని అంచనా. హైదరాబాద్​లో కృష్ణంరాజుకు ఫామ్ హౌస్ కూడా ఉందట.

ఇప్పుడు కృష్ణంరాజు వద్ద రూ.90 లక్షల విలువైన మెర్సిడెజ్ బెంజ్, రూ.40 లక్షల విలువైన టొయోటా ఫార్చునర్, రూ.90 లక్షల ఖరీదైన వోల్వో ఎక్స్ సీ కార్లు ఉన్నాయి. 2009 లోక్ సభ ఎన్నికల్లో కృష్ణంరాజు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడివిట్ ప్రకారం.. తన కుటుంబానికి రూ.8.62 కోట్ల ఆస్తులు, రూ.2.14 కోట్ల అప్పులు ఉన్నట్లు చూపించారు. అయితే ఆ ఆస్తుల విలువ ఇప్పుడు పెరిగి ఉంటుంది. దీంతో పాటు బ్యాంక్ డిపాజిట్లు, కుమార్తెల పేర్ల మీద బాండ్లు కూడా ఉన్నాయి. కృష్ణంరాజు కుటుంబం దగ్గర అప్పట్లోనే 4 కిలోల బంగారం ఉందని, దీనికి ప్రస్తుత మార్కెట్ విలువ చాలానే ఉండొచ్చని అంచనా. దీని ప్రకారం ఆయన మొత్తం ఆస్తి విలువ రెండు వందల కోట్ల నుంచి మూడు వందల కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా.
తన వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన ప్రభాస్​ కూడా బాగానే సంపాదించినట్లు తెలుస్తోంది. రెబల్ స్టార్​గానే కాదు మంచి మనిషిగా కృష్ణంరాజు ఎంతో పేరు గడించారని సినీ ప్రముఖులు చెబుతున్నారు. ఆయన మరణానికి సినీ రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు.

ఇదీ చూడండి: కృష్ణంరాజు పార్థివదేహానికి సినీ ప్రముఖుల నివాళి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.