ETV Bharat / entertainment

'సర్కారువారి పాట' కూడా ఓటీటీలో అదే బాట - సర్కారు వారి పాట

సూపర్​స్టార్​ మహేశ్​ నటించిన 'సర్కారువారి పాట' గురువారం అమెజాన్​ ప్రైమ్​లో రిలీజైంది. కానీ యూజర్లను నిరాశపరుస్తూ ఈ సినిమాను అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి తెచ్చింది. సినిమా చూడాలంటే రూ.199 చెల్లించాలని పేర్కొంది.

d
d
author img

By

Published : Jun 2, 2022, 8:52 PM IST

మహేశ్‌బాబు కథానాయకుడిగా పరశురామ్‌ తెరకెక్కించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'సర్కారు వారి పాట' కీర్తిసురేశ్‌ కథానాయిక. మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడు వస్తుందా? అని సినీ ప్రేక్షకుల ఎదురుచూపులకు చెక్​ పెడుతూ అమెజాన్‌ ప్రైమ్‌ గురువారం చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్​ చేసింది. అద్దె ప్రాతిపదికన 'సర్కారువారి పాట' మూవీని అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. రూ.199 చెల్లించి సినిమాను చూడొచ్చు.

'సర్కారువారి పాట' చూడాలంటే సినిమాను అద్దెకు తీసుకోవాలి. ఇందుకు రూ.199 చెల్లించాలి. ఒకసారి సినిమాను అద్దెకు తీసుకున్న తర్వాత 30 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. మరొక విషయం ఒకసారి సినిమా చూడటం మొదలు పెట్టిన తర్వాత 48 గంటల్లో గడువు పూర్తయిపోతుంది. అంటే సినిమాను అద్దెకు తీసుకుని, చూడటం మొదలు పెడితే 48 గంటల్లో సినిమా చూసేయాలన్నమాట. ఇటీవల 'కేజీయఫ్‌2'ను కూడా అద్దె ప్రాతిపదికన విడుదల చేసిన సంగతి తెలిసిందే. 'రన్‌ వే 34' సహా పలు సినిమాలను అమెజాన్‌ ముందుగానే అద్దె ప్రాతిపదికన అందిస్తోంది.

'మురారి వా' సాంగ్‌ జత చేసిన చిత్ర బృందం: ఒకప్పుడు ప్రేక్షకులను మళ్లీ థియేటర్‌కు రప్పించడానికి డిలీట్‌ చేసిన సీన్లు, తొలగించిన పాటలను కొద్ది రోజుల తర్వాత జత చేసేవారు. 'సర్కారువారి పాట' చిత్ర బృందం ఇప్పుడే అదే పనిచేసింది. మాస్‌ మెలోడి 'మురారి వా' పాటను థియేటర్‌లో సినిమాకు యాడ్‌ చేసింది. ప్రస్తుతం ఈ పాట ప్రేక్షకులను అలరిస్తోంది.

ఇదీ చూడండి : ఉద్వేగంగా 'మేజర్​' జనగణమన పాట.. కిర్రాక్​ టైటిల్​తో షారుక్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.