Sarkaru Vaari Paata Runtime: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో రానున్న 'సర్కారువారి పాట' కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం గురించిన ఆసక్తికర విషయం చెప్పారు మేకర్స్. సినిమా రన్‌టైమ్ 2 గంటల 42 నిమిషాలని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
-
All set to embrace your immense love and support from May 12th 💝💫
— Mythri Movie Makers (@MythriOfficial) May 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Get ready to witness Super ⭐@urstrulyMahesh's MENTAL MASS SWAG in Theatres Worldwide ❤️🔥
Bookings opening in a phased manner across the board 🤗#SarkaruVaariPaata #SVP #SVPMania pic.twitter.com/0EFKRHlLMQ
">All set to embrace your immense love and support from May 12th 💝💫
— Mythri Movie Makers (@MythriOfficial) May 8, 2022
Get ready to witness Super ⭐@urstrulyMahesh's MENTAL MASS SWAG in Theatres Worldwide ❤️🔥
Bookings opening in a phased manner across the board 🤗#SarkaruVaariPaata #SVP #SVPMania pic.twitter.com/0EFKRHlLMQAll set to embrace your immense love and support from May 12th 💝💫
— Mythri Movie Makers (@MythriOfficial) May 8, 2022
Get ready to witness Super ⭐@urstrulyMahesh's MENTAL MASS SWAG in Theatres Worldwide ❤️🔥
Bookings opening in a phased manner across the board 🤗#SarkaruVaariPaata #SVP #SVPMania pic.twitter.com/0EFKRHlLMQ
ఈ సినిమాలో కీర్తి సురేశ్ కథానాయిక. తమన్ సంగీత దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, జీఎంబీ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మదర్స్ డే గిఫ్ట్: ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించిన 'కేజీయఫ్ 2' చిత్రం నుంచి మదర్స్ డే సందర్భంగా 'యదగరా యదగరా' అంటూ సాగే పూర్తి వీడియో సాంగ్ విడుదలైంది. 'కేజీయఫ్' రెండు భాగాల్లోనూ భారీ పోరాటాలు సహా అమ్మ సెంటిమెంటే ప్రధాన బలం. యశ్ నటించిన 'రాకీ' పాత్ర ప్రయాణానికి అమ్మే స్ఫూర్తి. ఏప్రిల్ 14న విడుదలైన రెండో భాగం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల వసూళ్లు అందుకోగా, ఇటీవలే కేవలం హిందీ వెర్షన్లో రూ.400 కోట్లు రాబట్టింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'సీతారామం' తొలి పాట ప్రోమో: 'మహానటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన హీరో దుల్కర్ సల్మాన్. మలయాళం హీరో అయినప్పటికీ తన నటనతో తెలుగులోనూ చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. తాజాగా స్వప్న సినిమా పతాకంపై ఈ యంగ్ హీరో నటిస్తున్న చిత్రం 'సీతా రామం'. ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను మే9న విడుదల చేయనున్నారు. ఆదివారం ఈ పాట ప్రోమో విడుదలైంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రష్మిక కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో దుల్కర్ సరసన మృణాళిని ఠాకూర్ నటిస్తున్నారు. అశ్వినీదత్, ప్రియాంకదత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రేమకథా దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్, గౌతమ్ మేనన్, ప్రకాష్ రాజ్‌లు తదితరులు నటిస్తున్న ఈ ‘యుద్ధంతో’ రాసిన ప్రేమకథను తెలుగుతో పాటు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. పి.ఎస్.వినోద్ ఛాయాగ్రహణం బాధ్యతలు చేప్పటిన ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.
ఇదీ చూడండి: 'అమ్మకు ప్రేమ'తో మెగాబ్రదర్స్.. వెంకీ, నాని, రామ్ మూవీ అప్డేట్స్