ETV Bharat / entertainment

'డ్రగ్స్‌ నిషా.. రెండు రోజులు లేవలేదు.. ఇంట్లోవాళ్లు ఒకటే ఏడుపు!' - డ్రగ్స్​ తీసుకున్న సంజయ్​ దత్​​

బాలీవుడ్​లో తనకంటూ మంచి పేరును సంపాదించుకున్నారు నటుడు సంజయ్​ దత్​. కేజీఎఫ్​ చిత్రంలో అధీరాగా నటించి సౌత్​ ఆడియన్స్​కు దగ్గరయ్యారు సంజయ్​. తాజాగా ఒక షోలో తన చెడు అలవాటు గురించి ఆయన చెప్పారు.

sanjay dutt
సంజయ్​ దత్​
author img

By

Published : Oct 30, 2022, 7:49 PM IST

Updated : Oct 30, 2022, 8:10 PM IST

బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌ దత్‌ను అక్కడి అభిమానులు ముద్దుగా సంజూ భాయ్‌ అని పిలుచుకుంటారు. పాన్​ ఇండియా చిత్రంగా వచ్చిన కేజీఎఫ్​ సినిమా బాక్సాఫీస్​ను షేక్​ చేసిన విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లలేదు. అయితే ఆ సినిమాలో అధీరాగా నటించి సౌత్‌ ఆడియన్స్‌కు దగ్గరైన సంజయ్​ గతంలో డ్రగ్స్‌కు బానిసైన సంగతి తెలిసిందే! ఈ విషయాన్ని కొన్నేళ్ల క్రితం అతనే స్వయంగా 'దస్‌ కా దమ్‌' అనే షోలో బయటపెట్టారు.

"ఓసారి డ్రగ్స్‌ తీసుకున్న మత్తులో ఆదమరిచి నిద్రపోయాను. ఉదయం 7 గంటల సమయంలో నిద్ర లేచి ఆకలిగా ఉంది, అన్నం పెట్టమని ఇంటి సిబ్బందిని అడిగాను. దానికతడు ఏడుపందుకుంటూ.. రెండు రోజుల తర్వాత మీరు లేచి ఆకలి అని అడుగుతున్నారని చెప్పాడు. అదేంటి? నిన్న రాత్రే కదా పడుకున్నాను. రెండు రోజులంటున్నారేంటని ప్రశ్నించగా.. లేదు, మీరు బెడ్‌ మీద నుంచి లేవక రెండు రోజులయ్యిందన్నాడు. కొన్ని క్షణాలపాటు నాకేమీ అర్థం కాలేదు. వెంటనే డ్రగ్స్‌ మానేయాలని డిసైడ్‌ అయ్యాను. డ్రగ్స్‌ వేస్ట్‌.. జీవితాన్ని మత్తులో దింపే దానికి దగ్గరవకపోవడమే మంచిది" అని చెప్పుకొచ్చారు సంజయ్‌ దత్‌.

ఇదీ చదవండి:ఆఫ్రికాలో రామ్​చరణ్​ వెకేషన్.. వంట చేస్తూ ఎంజాయ్​.. వీడియో చూశారా?

నెట్టింట వైరల్​గా మారిన బన్నీ ఫొటో.. 'పుష్ప-2' షూటింగ్​ స్టార్ట్​ అయిందా?

Last Updated : Oct 30, 2022, 8:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.