ETV Bharat / entertainment

సందీప్​ కిషన్​-విజయ్ సేతుపతి 'మైఖేల్​' ట్రైలర్.. పక్కా యాక్షన్​ మోడ్​ - విజయ్​ సేతుపతి మైఖేల్ ట్రైలర్​

సందీప్‌ కిషన్‌ హీరోగా నటించిన తొలి పాన్‌ ఇండియా చిత్రం మైఖేల్‌. దివ్యాంశ కౌశిక్‌ కథానాయిక. ఫిబ్రవరి 3న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది మూవీటీమ్​. విజయ్‌ సేతుపతి, గౌతమ్‌ మేనన్‌, వరుణ్‌ సందేశ్‌, అనసూయ, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ తదితరులు విభిన్న పాత్రల్లో కనిపించారు.ఆ ట్రైలర్‌ను మీరు చూసేయండి.

Sandeep Kishan Vijay sethupati Michael trailer release
సందీప్​ కిషన్​-విజయ్ సేతపుతి మైఖేల్​ ట్రైలర్.. పక్కా యాక్షన్​ మోడ్​
author img

By

Published : Jan 23, 2023, 1:06 PM IST

Updated : Jan 23, 2023, 1:13 PM IST

హిట్​ ఫ్లాప్​లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్న హీరో సందీప్ కిషన్. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌', 'బీరువా', 'ఏ1 ఎక్స్‌ప్రెస్‌' వంటి పలు సినిమాలు కమర్షియల్‌గా మంచి విజయాలే సాధించినా.. సందీప్‌కు మాత్రం స్టార్ స్టేటస్​ను తీసుకురాలేకపోయాయి. అందుకే సరైన హిట్​ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో అతడు బాగా గ్యాప్​ తీసుకుని చేస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా మైఖేల్​. రంజిత్‌ జయంకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్​ను బాలయ్య రిలీజ్ చేశారు. ఇది ఆడియెన్స్​ను ఆకట్టుకునేలా ఉంది. అమ్మాయిలు జోలికి వెళ్లకూడదంటూనే చివరికి ఈ కథ మొత్తం ఓ అమ్మాయి కోసమే జరుగుతున్నట్లు చూపించారు దర్శకుడు. మొత్తంగా ఈ ట్రైలర్‌ యాక్షన్‌ సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది.

ఇంకా ఈ ప్రచార చిత్రంలో విజయ్‌ సేతుపతి, గౌతమ్​ మేనన్​ క్యారెక్టర్‌ పవర్‌ ఫుల్‌గా ఉన్నట్లు అర్థమవుతోంది. ఇక వరుణ్‌ సందేశ్​ కొత్తగా కనిపిస్తున్నారు. వరలక్ష్మీ క్యారెక్టర్‌ కూడా స్ట్రాంగ్‌గా ఉన్నట్లు తెలుస్తుంది. లవ్ కమ్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి ౩న పాన్‌ ఇండియా లెవ్​ల్​లో రిలీజ్‌ కాబోతుంది. దివ్యాంషా కౌశిక్​ హీరోయిన్​.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: ఉపాసన ఇంట్లో విషాదం... ధైర్యం చెబుతున్న మెగా ఫ్యాన్స్​!

Last Updated : Jan 23, 2023, 1:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.