Samantha Tattoo : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెకేషన్లో ఉన్నారు. మయోసైటిస్కు చికిత్స పొందేందుకు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ స్టార్.. తన ఫ్యాన్స్‌ను సోషల్ మీడియా ద్వారా పలకరిస్తుంటారు. ఇందులో భాగంగా తన వెకేషన్ ఫొటోస్‌తో పాటు లేటెస్ట్ ఫొటోషూట్లను అప్లోడ్ చేస్తుంటారు. తాజాగా కూడా పింక్ శారీలో కనిపించి సందడి చేశారు. సామ్ అప్లోడ్ చేసిన కొద్ది నిమిషాలకే ఆ ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అయ్యాయి. ఇక ఫ్యాన్స్ ఆ పోస్ట్‌పై కామెంట్ల వర్షం కురిపించారు. అయితే కొందరు మాత్రం ఆ ఫొటోలపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. సామ్ వేయించుకున్న ఓ టాటూ గురించి నెట్టింట చర్చలు మొదలెట్టారు.
2019లో నాగ చైతన్యతో కలిసి ఉన్న సమయంలో సామ్ తన పక్కటెముకలపై ఓ టాటూ వేయించుకున్నారు. 'చై' అనే ఇంగ్లిష్ అక్షరాలను రాయించుకున్నారు. దీంతో పాటు తన చేతిపై అలానే మెడపై కూడా ఓ టాటూ ఉండేది. అయితే అందరి దృష్టి మాత్రం చై టాటూ పై పడింది. వీళ్లిద్దరూ విడిపోయిన తర్వాత కూడా సమంత షేర్ చేసిన ఫొటోల్లో ఆ టాటూ కనిపించింది. ఇటీవలే సిటడెల్ లండన్ ప్రీమియర్ షోకు హాజరైన సందర్భంగా కూడా సామ్ ఒంటిపై ఈ టాటూ కనిపించింది. కానీ ఈ లేటెస్ట్ ఫొటోల్లో మాత్రం అది లేదు. దీంతో ఆ టాటూని ఆమె తొలగించారా లేక అది కనిపించకుండా కవర్ చేసుకున్నారా అన్న చర్చ అభిమానుల్లో మొదలైంది. మొన్నటి వరకు ఉన్న టాటూ ఇప్పుడు ఎందుకు కనిపించటం లేదంటూ సామ్ ఫ్యాన్స్ ఆరా తీయడం మొదలెట్టారు. కానీ ఈ విషయంపై ఎటువంటి క్లారిటీ రాలేదు. ఏదీ ఏమైనప్పటికీ.. సామ్ ఈ విషయంపై స్పందిస్తే కానీ అసలు విషయం తెలియదని అభిమానులు అంటున్నారు.
ఇక సామ్ తాజాగా విజయ్ దేవరకొండతో 'ఖుషి' సినిమాలో నటించింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ అందుకుంది. ఆ తర్వాత ఏడాదిన్నర పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సామ్.. ప్రస్తుతం ఫారిన్ టూర్లో ఉన్నారు. తాజాగా ఖుషి ప్రమోషన్స్‌లో సందడి చేసిన సామ్.. ఆ తర్వాత న్యూయార్క్‌లో జరిగిన స్వాత్రంత్య దినోత్సవ వేడుకల్లోనూ పాల్గొన్నారు.
షికార్లు కొడుతున్న ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా?.. ఫుల్ చిల్ కొడుతోందిగా!
Samantha Ruth Prabhu New Pics : పింక్ శారీలో సమంత గుబాళింపు.. ఈ మార్పులు చూశారా?