సమంత ప్రధాన పాత్రలో రిలీజ్‌కు సిద్ధమవుతున్న చిత్రం 'శాకుంతలం'. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. యూట్యూబ్‌లో కూడా ట్రెండ్ అవుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రం నుంచి మల్లికా మల్లికా లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో సమంతను చూస్తే.. దివి నుంచి దిగి వచ్చిన అప్సరసలా కనిపిస్తోంది. సంగీత దర్శకుడు మణిశర్మ అందించిన స్వరాలు మనకు మరో లోకాన్ని పరిచయం చేస్తాయి. ఈ పాటను గాయని రమ్య బెహరా ఆలపించారు. చైతన్య ప్రసాద్ రాసిన లిరిక్స్ సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఇది. ఇందులో శకుంతల పాత్రలో సమంత... ఆమెకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. గోపీచంద్ 'జిల్'తో తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రతినాయకుడిగా పరిచయమైన కబీర్ సింగ్ ఈ సినిమాలో విలన్ రోల్ చేశారు. కింగ్ అసుర క్యారెక్టర్ పాత్రలో నటిస్తున్నాడు. 'శాకుంతలం' సినిమాలో అందమైన ప్రేమకథ మాత్రమే కాదు... దుష్యంతుడికి, అసురకు మధ్య భారీ యుద్ధ సన్నివేశం ఉంది. పది రోజుల పాటు ఆ వార్ సీక్వెన్స్ తీశారు. సినిమాలో ఆ ఫైట్ కూడా హైలైట్ అవుతుందని సమాచారం.
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో డీఆర్‌పీ- గుణా టీమ్ వర్క్స్ పతాకంపై గుణశేఖర్ కుమార్తె నీలిమ 'శాకుంతలం' సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రిన్స్ భరత పాత్రలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ నటించారు. ఇంకా దుర్వాస మహర్షిగా కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు, ప్రియంవద పాత్రలో అనన్య, అదితి బాలన్ పాత్రలో అనసూయ నటించారు. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">