సమంత, నాగచైతన్య విడాకుల విషయాన్ని ఇద్దరి అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా సామ్-చైకి సంబంధించి అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇద్దరు మళ్లీ కలవబోతున్నారని, అందుకోసం ఒక డైరెక్టర్ తెగ ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే విషయంపై ఒక క్లారిటీ వచ్చింది. సమంత, నాగచైతన్య కలవబోతున్నది ఓ సినిమా కోసమని.. తన మూవీలో ఇద్దరిని నటింపజేసేందుకు డైరెక్టర్ నందినిరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
నందిని రెడ్డి సిద్ధం చేసిన ఒక కథ నాగ చైతన్యకు బాగా నచ్చిందట. ఈ సినిమాలో హీరోయిన్గా సమంతని తీసుకోవాలని నందినిరెడ్డి భావిస్తోందట. అందుకోసం అమె విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఫిల్మ్నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇది ఒకవేళ నిజమైతే.. ఇద్దరు సినిమాకు ఒప్పుకుంటే.. సమంత, నాగచైతన్య అభిమానులకు పండగ అనే చెప్పాలి.
'ఏ మాయ చేసావే' సినిమాతో మొట్టమొదటిసారిగా కలిసి నటించిన నాగచైతన్య, సమంత జంట.. వెండతెరపై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత వీరు కలిసి నటించిన 'ఆటో నగర్' 'మనం', 'మజిలీ' సినిమాలు సగటు సినిమా అభిమానులను మంత్రముగ్ధుల్ని చేశాయి. విడాకులకు ముందు సమంత లీడ్ రోల్లో నంటించిన 'ఓ బేబీ' సినిమాలో చై అతిథి పాత్రలో నటించారు.