ETV Bharat / entertainment

అప్పుడు సామ్​ అలా.. ఇప్పుడు చైతూ ఇలా.. వీరి మధ్య ప్రేమ తగ్గినట్టు లేదే! - టాటూపై నాగచైతన్య కామెంట్స్​

Nagachaitanya Samantha: నాగచైతన్య తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ విషయాన్ని బయటపెట్టారు. ఈ వ్యాఖ్యలతో సమంతపై ఆయనకు ఇంకా ప్రేమ తగ్గలేదా అనే అనుమానం అభిమానుల్లో కలుగుతోంది.

chaitu sam
సామ్ చైతూ
author img

By

Published : Aug 10, 2022, 11:49 AM IST

Nagachaitanya Samantha: గతకొద్ది రోజులుగా గమనిస్తే.. నాగచైతన్య-సమంత ఒకరిపై మరొకరు కామెంట్స్​ చేసుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్​ విషయాన్ని తెలిపారు చైతూ. 'లాల్‌ సింగ్‌ చడ్డా' ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన తన చేతిపై ఉన్న పచ్చబొట్టు గురించి స్పందించారు. "మీ చేతిపై ఉన్న టాటూకు అర్థం ఏమిటి? దానిని ఎందుకు వేయించుకున్నారు?" అని ప్రశ్నించగా.. "చేతి మణికట్టు దగ్గర మాత్రమే నాకు పచ్చబొట్టు ఉంటుంది. అదంటే నాకెంతో ఇష్టం. సామ్‌తో పెళ్లి జరిగిన తేదిని పచ్చబొట్టుగా వేయించుకున్నా. చూసేవారికి అది డేట్‌ అనే విషయం తెలియదు. దాంతో నా అభిమానులు చాలామంది ఆ పచ్చబొట్టుని కాపీ కొడుతున్నారు. ఇటీవల నేను పలువురు అభిమానుల్ని కలిశా. వారిలో కొంతమంది నా చేతిపై ఉన్న పచ్చబొట్టునే కాపీ కొట్టి వేయించుకున్నారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా నా అభిమానులందరికీ చెప్పేది ఒక్కటే.. దయచేసి టాటూ విషయంలో నన్ను ఫాలో కాకండి. ఎందుకంటే అది నా మ్యారేజ్‌ డేట్‌" అని వివరించారు. "సామ్‌-మీరూ విడిపోయిన తర్వాత ఆ పచ్చబొట్టు మార్చుకోవాలని అనిపించలేదా?" అని ప్రశ్నించగా.. "దాని గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. ఎందుకంటే ఈ టాటూ ఉండటం వల్ల నాకెలాంటి ఇబ్బంది లేదు" అని చై తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యల ఆధారంగా చూస్తే సమంతపై ఆయనకు ఇంకా ప్రేమ తగ్గలేదా అనే అనుమానం అభిమానుల్లో కలుగుతోంది.

అంతకుముందు చైతూపై ఓ షోలో కామెంట్స్​ చేసింది సామ్​. అంతేకాదు ఈ మధ్య కాలంలోనే చైతూతో కలిసి ఉన్న ఇంటిని కూడా ఎక్కువ డబ్బులు పెట్టి మరీ సామ్​ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని తెలిపిన సీనియర్​ నటుడు మురళి తెలిపారు. ప్రస్తుతం సామ్​.. తన తల్లితో కలిసే అక్కడే ఉన్నట్లు చెప్పారు. కాగా, స్నేహితులుగా పరిచయమైన సామ్‌-చై 2017 అక్టోబర్‌ 6న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత గతేడాది అక్టోబర్‌లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం వీరిద్దరూ కెరీర్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవలే థ్యాంక్యూ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చైతూ.. ప్రస్తుతం లాల్​సింగ్​ చడ్డాతో అభిమానులను పలకరించనున్నారు. అలానే పలు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక సామ్​ కూడా త్వరలోనే యశోద, శాకుంతలంతో రానుంది. ఇక హిందీలో రెండు, మూడు ప్రాజెక్ట్​లకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చినట్లు తెలిసింది.

ఇదీ చూడండి: Tollywood: రీసెంట్​ బెస్ట్ ఆన్​స్క్రీన్​ పెయిర్స్​.. వీళ్ల లవ్​ట్రాక్​కు ఆడియెన్స్​ ఫిదా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.