Nagachaitanya Samantha divorce: వైవాహిక జీవితానికి ముగింపు పలికిన రోజు నుంచి.. నాగచైతన్య గానీ, సమంత గానీ ఎందుకు విడాకులు తీసుకున్నారో తెలపలేదు. దీనికి సంబంధించిన ప్రశ్నలు ఎదురైనప్పటికీ సున్నితంగా పక్కకు తప్పుకున్నారు. తాజాగా ఈ విషయమై సామ్ స్పందించినట్లు తెలిసింది. సీజన్-7లో భాగంగా ఇటీవలే ఆమె 'కాఫీ విత్ కరణ్' షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా కెరీర్‌తో పాటు, నాగచైతన్య బంధానికి ఎందుకు ముగింపు పలకాల్సి వచ్చిందో కూడా చెప్పినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.
డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా జులై 7న ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుందట. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్ అవుతుండటం వల్ల ఈ షో ఎప్పుడెప్పుడు చూద్దామా? అని ఇటు సామ్ అభిమానులతో పాటు అటు చైతూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కాగా, సామ్ త్వరలోనే.. శాకుంతలం, యశోద చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్‌దేవరకొండతో ఖుషి సినిమాలో నటిస్తోంది. మరోవైపు నాగ చైతన్య నటించిన 'లాల్ సింగ్ చద్ధా', 'థ్యాంక్యూ' విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇంకా మరిన్ని ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇదీ చూడండి: నాగ చైతన్య-సమంత-శోభితా ధూళిపాల.. అసలేం జరుగుతోంది?