Samantha Nagachaitanya : హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ ఏదో ఒక కొటేషన్స్ పెడుతూ తన పర్సనల్ లైఫ్‌ను షేర్ చేసుకుంటుంటారు. అలానే తాజాగా మరోసారి ఆమె ఫ్యాన్స్ ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా తన వైవాహిక జీవితం గురించి కూడా ఇండైరెక్ట్‌గా షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను జీవితంలో చేసిన అతి పెద్ద తప్పేంటో చెప్పారు. తన మాజీ భర్త తన ఇష్టాయిష్టాలను ప్రభావితం చేశారని అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ అటు అభిమానుల్లో, ఇటు మీడియా వర్గాల్లో చర్చనీయాంశమైంది.
"నా ఇష్టాయిష్టాలను గుర్తించడంలో ఫెయిల్ అయ్యాను. దానిని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఎందుకంటే గతంలో నా పార్ట్నర్ వాటిని ప్రభావితం చేశాడు. క్లిష్ట సమయంలోనే మనం విలువైన పాఠం నేర్చుకోగలం అని అర్థమైంది. ఈ విషయాన్ని గ్రహించిన తర్వాతే నా పర్సనల్ లైఫ్ ఎదుగుదల మొదలైంది" అని సమంత అన్నారు.
గతంలోనూ హీరోయిన్ సమంత ఓ సారి ఒక ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ తన డివోర్స్(Samantha Divorce), వరుస ఫ్లాప్‌లు, ఆరోగ్య సమస్యలు(Samantha Health) గురించి మాట్లాడారు. అవన్నీ ఒకేసారి చుట్టుముట్టడం వల్ల ఎంతో కుంగిపోయినట్లు తెలిపారు. ఒకవైపు ఆరోగ్యం దెబ్బతింటుంటే మరోవైపు వైవాహిక బంధం ముగిసిందని అన్నారు. దీంతో కుంగుబాటుకు గురైనట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం సామ్ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి లైఫ్‌ను చిల్ కొడుతున్నారు. అలాగే మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న ఆమె, దాని చికిత్స తీసుకోవడం కోసం సమయాన్ని కేటాయించిందని, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టినట్లు ఆ మధ్యలో కథనాలు వచ్చాయి. ఇకపోతే ఆమె నటించిన ఇండియన్ వెర్షన్ 'సిటాడెల్' (Samantha Citadel Indian Webseries) వెబ్‌సిరీస్ రిలీజ్‌కు రెడీగా ఉంది. మరోవైపు, ఆమె కొద్ది రోజుల క్రితం నిర్మాతగానూ మారి ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 'ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్' పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి కొత్త టాలెంట్ డైరెక్టర్లను, నటీనటులను ప్రోత్సహించనున్నారు.
సంక్రాంతి బరిలో సౌత్ సినిమాలు - కలెక్షన్స్‌లో టాప్ ఏదంటే ?