ETV Bharat / entertainment

సమంత హెల్త్ అప్డేట్​ -150 డిగ్రీల చలిలో ట్రీట్మెంట్​ - సమంత హెల్త్ అప్డేట్​

Samantha Health Update : హీరోయిన్ సమంత తన ట్రీట్మెంట్​కు సంబంధించి ఓ చిన్న అప్డేట్​ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వివరాలు..

సమంత హెల్త్ అప్డేట్..​ -150 డిగ్రీల చలిలో ట్రీట్మెంట్​

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 4, 2023, 1:44 PM IST

Updated : Nov 4, 2023, 2:21 PM IST

Samantha Health Update : అగ్ర కథానాయిక సమంత చాలా కాలం నుంచి మయోసైటిస్‌ అనే ఆటో ఇమ్యూనీ వ్యాధితో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. చాలా సార్లు దీని గురించి చెప్పుకొని బాధ కూడా పడింది. అయినప్పటికీ ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండానే ఓ వైపు సినిమాలు చేస్తూ మరోవైపు ఈ వ్యాధికి సంబంధించిన చికిత్స తీసుకుంది. కానీ కొద్ది రోజుల క్రితం మాత్రం ఖుషి సినిమా సమయంలో కాస్త ఇబ్బంది తలెత్తడంతో ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. కేవలం ఆరోగ్యం, మానసిక ప్రశాంతతపైనే దృష్టి పెట్టింది.

వెకేషన్ ట్రిప్స్​ అంటూ ఎంజాయ్​ చేస్తూనే చికిత్స తీసుకుంటోంది. ఈ మధ్యే హైదరాబాద్ తిరిగి వచ్చిన ఈమె.. సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉంటూ తన పర్సనల్ అప్డేట్స్​ షేర్ చేస్తోంది. అలా తాజాగా తన ట్రీట్మెంట్​కు సంబంధించి ఓ చిన్న అప్డేట్​ను సోషల్​ మీడియా ఇన్​స్టా స్టేటస్​లో షేర్ చేసుకుంది. కైరో థెరపీ సెషన్‌కు హాజరైనట్లు చెప్పుకొచ్చింది. ఓ ఫొటోను కూడా షేర్‌ చేసింది. అందులో ఆమె -150 డిగ్రీల ఫారెన్​ హీట్​లో పొగలు కక్కే చలిలో ఓ టబ్​లో కూర్చొని కనిపించింది.

మానవ శరీరంలో బలహీనపడిన ఇమ్యూనిటీ సిస్టమ్‌ మెరుగ్గా పని చేయించడంతో పాటు, ఇన్‌ఫెక్షన్‌ బారినపడకుండా ఉండేలా ఈ థెరపీ సహాయ పడుతుందని చెప్పుకొచ్చింది. "ఇన్​ఫెక్షన్స్​తో పోరాడే వైట్ బ్లడ్ సెల్స్​ఉత్పత్తిని పెంచుతుంది. రక్త ప్రసరణ సాఫీగా చేస్తుంది. మెంటల్ హెల్త్, ఎనర్జీని కూడా ఇస్తుంది. శరీరంలో ఉన్న మార్పును సరి చేసి మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది" అని రాసుకొచ్చింది.

సమంత హెల్త్ అప్డేట్​ -150 డిగ్రీల చలిలో ట్రీట్మెంట్​

Samantha Upcoming Movies : ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. చివరగా రౌడీ హీరో విజయ్‌ దేవరకొండతో కలిసి ఖుషి చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం భారీ వసూళ్లను అందుకోకపోయినా.. డీసెంట్​ టాక్​తో లాగించేసింది. త్వరలోనే వరుణ్‌ ధావన్‌తో కలిసి నటించిన సిటాడెల్‌ ఇండియన్ వెర్షన్​ వెబ్‌సిరీస్‌తో ఓటీటీలో సందడి చేయనుంది. అలానే సల్మాన్​ ఖాన్​తోనూ ఓ సినిమా చేయనుందంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి.

బోయపాటి బాబాయ్​ మరీ ఇలా దొరికేశావేంటి - జర చూసుకోవాల్సింది!

టైట్​ ఫిట్​లో ఇలా బంధిస్తే.. అందాలకు ఊపిరాడేదెలా జాన్వీ?

Last Updated : Nov 4, 2023, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.