Coffee with Karan Samantha: 'కాఫీ విత్ కరణ్ 7'షోలో అక్షయ్‌కుమార్‌తో కలిసి సందడి చేశారు హీరోయిన్ సమంత. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో వచ్చేసింది. ఇందులో సమంతను అక్షయ్ ఎత్తుకుని సీటు దగ్గరకు తీసుకొచ్చి హంగామా చేశారు. కరణ్ అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానం చెబుతూ ఈ ఇద్దరు నవ్వులు పంచారు. ఈ క్రమంలోనే 'బ్యాచిలరేట్‌కి మీరు హోస్ట్ అయితే ఏ ఇద్దరు బాలీవుడ్ హీరోలను తీసుకుంటారు?' అని కరణ్ అడగ్గా 'రణ్‌వీర్‌సింగ్, రణ్‌వీర్‌సింగ్' అని సమంత మనసులో మాట బయటపెట్టారు. ఈ సమాధానం వినగానే 'ఓకే' అని అక్షయ్ చిరు నవ్వు చిందించారు. కరణ్‌ను ఉద్దేశిస్తూ 'అన్‌హ్యాపీ మ్యారేజ్‌కు మీరే కారణం' అని సమంత ఆరోపించారు. గతంలో విడుదలైన ఓ ప్రోమోలో వినిపించిన ఈ వ్యాఖ్యకు సంబంధించిన క్లిప్పింగ్ వైరల్‌గా మారింది. మరి, సమంత ఎవరి వివాహం గురించి మాట్లాడారోనని ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కరణ్ జోహార్‌కు ఫిల్మ్‌మేకర్‌గానే కాకుండా వ్యాఖ్యాతగానూ బాలీవుడ్‌లో మంచి పేరుంది. హోస్ట్‌గా ఆయనకు క్రేజ్ తీసుకొచ్చిన సెలబ్రిటీ టాక్ షో 'కాఫీ విత్ కరణ్'. 6 సీజన్ల బుల్లితెర వేదికగా అలరించిన ఈ షో 7వ సీజన్ ఓటీటీ 'డిస్నీ+హాట్‌స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే రణ్‌వీర్‌సింగ్- అలియాభట్, జాన్వీకపూర్- సారా ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రేక్షకుల్ని అలరించారు. అక్షయ్- సమంతల ఎపిసోడ్ ఈ గురువారం ప్రసారంకానుంది. షాహిద్ కపూర్, కియారా అడ్వాణీ, అనిల్ కపూర్, వరుణ్ ధావన్, విజయ్ దేవరకొండ, అనన్య పాండే త్వరలోనే ఈ వేదికపైకి రానున్నారు. 6 సీజన్ల వరకు బాలీవుడ్ తారలకే పరిమితమైన ఈ షో ఇప్పుడు దక్షిణాది నటులకూ ఆహ్వానం పలికింది. ఈ జాబితాలో నిలిచిన వారే సమంత, విజయ్ దేవరకొండ.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చూడండి: రవితేజ- నిర్మాత సుధాకర్ మధ్య గొడవకు కారణం వాళ్లేనట.. మాస్ మహారాజా క్లారిటీ