ETV Bharat / entertainment

'త్వరలోనే అదిరిపోయే ఆరు కొరియన్‌ మూవీస్​ రీమేక్‌.. సమంతతోనూ ఓ చిత్రం!' - ఆరు కొత్త కొరియన్ సినిమాలు రీమేక్​

త్వరలోనే ఆరు సూపర్​హిట్​ కొరియన్​ సినిమాలు తెలుగులో రీమేక్​ కానున్నాయి! అలాగే హీరోయిన్​ సమంత నటించబోయే కొత్త సినిమా అప్డేట్​ వచ్చింది. అదేంటంటే..

samantha
సమంత కొరియన్ సినిమాలు
author img

By

Published : Sep 15, 2022, 10:13 AM IST

ఓటీటీ ప్లాట్​ఫామ్​ కారణంగా గతకొంత కాలంగా కొరియన్​ వెబ్​సిరీస్​, మూవీస్​కు ఆదరణ ఎక్కువగా దక్కుతోంది. అయితే ఇప్పటికే అక్కడ తెరకెక్కిన పలు సినిమాలను ఇక్కడ రీమేక్​ చేయడం ప్రారంభించారు మన దర్శకనిర్మాతలు. అయితే తాజాగా ఈ విషయమై నిర్మాత సునీత తాటి మాట్లాడుతూ.. త్వరలోనే ఆరు కొరియన్​ సినిమాలను రీమేక్​ చేస్తున్నట్లు తెలిపారు. ఆ సంగతులేంటో చూద్దాం..

కథల్ని ఇచ్చి పుచ్చుకోవడానికి భాషతో సంబంధం లేదు. దేశం ఏదైనా.. భాష ఏదైనా భావోద్వేగాలు మాత్రం ఒక్కటే. అందుకే 'సినిమా బాగుంది' అనే మాట వినిపిస్తే చాలు... మన దర్శకనిర్మాతలు ప్రపంచంలో ఏ మూల కథల్నైనా సరే తీసుకొచ్చేస్తుంటారు. 'ఓ బేబీ'తో సహా కొన్నేళ్లుగా తెలుగులో కొరియన్‌ కథల జోరు కనిపిస్తోంది. అక్కడ విజయవంతమైన 'మిడ్‌నైట్‌ రన్నర్స్‌'కు రీమేక్‌గా ఇటీవల 'శాకిని డాకిని' తెరకెక్కింది. రెజీనా, నివేదా థామస్‌ ప్రధాన పాత్రధారులుగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత సునీత తాటి విలేకర్లతో చిత్ర విషయాలను తెలిపారు.

"నిర్మాతగా ఇది నా 7వ చిత్రం. మాతృకలో ఇద్దరబ్బాయిల కథ ఇది. మేం కూడా ఇద్దరు హీరోలతోనే చేయాలనుకున్నాం కానీ, బ్యాలెన్స్‌ కుదరలేదు. దాంతో అమ్మాయిల కోసమని కథలో మార్పు చేర్పులు చేశాం. పోలీసులుగా శిక్షణ తీసుకుంటున్న ఇద్దరు యువతుల నేపథ్యంలో, ప్రధానంగా ఒక రాత్రి జరిగే సంఘటనల చుట్టూ సాగే కథ ఇది. సమాజం ఎదుర్కొంటున్న ఓ ప్రధాన సమస్యను చర్చించాం. ఆడపిల్లలున్న తల్లిదండ్రులు వాళ్ల పిల్లలతో కలిసి చూసేలా ఉంటుంది మా చిత్రం".

"రెజీనా, నివేదా థామస్‌ చేసే పోరాట ఘట్టాలు చాలా బాగుంటాయి. శిక్షణలో ఉన్న వాళ్లు తమ పాఠాల్ని అమలు చేసే విధానం ఆ పోరాట ఘట్టాల్లో కనిపిస్తుంది. ఆ ఇద్దరూ కూడా సమ ప్రాధాన్యమైన పాత్రల్లో కనిపిస్తారు. దర్శకుడు సుధీర్‌వర్మ ప్రతిభావంతుడు. ఆయనతో 'స్వామిరారా' నుంచే పనిచేయాలనుకుంటున్నా. చాలా స్టైలిష్‌గా ఈ సినిమాని తీర్చిదిద్దాడు. 'ఓ బేబి' తర్వాత మరో మహిళా ప్రధానమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండడం ఆనందంగా ఉంది. సరైన సమయంలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం".

"మన దేశంలో ఏటా అత్యధిక సంఖ్యలో సినిమాలు రూపొందుతుంటాయి. చాలా దేశాలు మన సినిమాల్ని ఫ్రీమేక్‌ చేస్తుంటాయి. కొరియా, జపాన్‌లోనూ మన కథల ఆధారంగా సినిమాలు రూపొందాయి. 'శాకిని డాకిని'తో కలిపి ఆరు కొరియన్‌ చిత్రాల్ని రీమేక్‌ చేస్తున్నాం. తదుపరి మా సంస్థ నుంచి ‘దొంగలున్నారు జాగ్రత్త’ చిత్రం రాబోతోంది. ఒక దొంగ మానసిక స్థితి, అతను చేసే పనుల చుట్టూ సాగే కథ అది. సమంతతో తీయనున్న 'అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌' సినిమాని వచ్చే యేడాది సెట్స్‌పైకి తీసుకెళతాం. నేను దర్శకుడు బాపు అభిమానిని. సున్నితమైన రొమాంటిక్‌ కామెడీ కథలకి దర్శకత్వం వహించే ఆలోచన ఉంది. ఫాంటసీ కథలన్నా ఇష్టమే. భవిష్యత్తులో ఆ తరహా సినిమాలకి దర్శకత్వం వహిస్తా." అని అన్నారు.

ఇదీ చూడండి: రామ్​పోతినేని-కమల్​హాసన్​తో గౌతమ్​మేనన్​ సినిమా.. త్వరలోనే ఏమాయ చేసావె సీక్వెల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.